vinod kumar boianapalli
-
అధ్యాపకుల నియామకానికి చర్యలు
ఉస్మానియా యూనివర్సిటీ: యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో రాష్ట్ర విశ్వవిద్యాలయాల అధ్యాపకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ఓయూ టీచర్స్ అసోషియేషన్ (ఔటా) ఉపాధ్యక్షులు ప్రొ.మల్లేశం అధ్యక్షత వహించగా వినోద్‌కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై సమాకాలిన ఉన్నత విద్య సవాళ్లు–పరిష్కారాలు అనే అంశం పై మాట్లాడారు. నియామకాల అంశం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని, తిరిగి అసెంబ్లీలో ప్రవేశపెట్టి పక్రియను ప్రారంభిస్తామన్నారు. రిటైర్మెంట్ వయోపరిమితి పెంపుపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. సీపీఎస్, పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులపై ప్రభుత్వ అధికారులతో చర్చించి అమలు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యా సంస్థల్లో ఎన్నికలు ఉండాలని తన అభిప్రాయంగా వినోద్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో సాధించిన అభివృద్ధిని అధ్యాపకులకు వివరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు అప్పారావు, విద్యాసాగర్, చెన్నప్ప, మహేందర్‌రెడ్డి, మంగు, చలమల్ల వెంకటేశ్వర్లు, మద్దిలేటి, కాశీం, సూర్య ధనుంజయ్, లావణ్య, జమీల్, అలియాబేగం తదితరులు పాల్గొన్నారు. వర్సిటీ అధ్యాపకుల సంఘం ఏర్పాటు వర్సిటీల అధ్యాపకుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడేందుకు 15 వర్సిటీల అధ్యాపకులతో నూతన సంఘాన్ని స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్–ఏయూటీఏ) పేరుతో ఏర్పాటు చేసినట్లు ప్రొ.మల్లేషం పేర్కొన్నారు. త్వరలోనే నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. -
వెలమ Vs కాపు: బీఆర్ఎస్ సీనియర్‌కు వ్యతిరేక పవనాలు..
రాజకీయాలు సహజంగా పార్టీలవారీగా నడుస్తుంటాయి. కానీ.. తెలంగాణలో ఒక జిల్లాలో పార్టీల కంటే సామాజికవర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తుంది. అక్కడ పార్టీలు ఒక భాగమైతే.. సామాజికవర్గాలు మరో భాగంగా ఉన్నాయి. పార్టీ ఏదైనా ఒక ప్రధాన సామాజికవర్గం నేతలు అన్ని పార్టీల్లోని తమవారు గెలవాలని కోరుకుంటారు. ఎవరిని ఎలా గెలిపించాలా? ప్రత్యర్థి సామాజికవర్గాన్ని ఎలా దెబ్బ తీయాలా అని ప్లాన్స్ వేస్తుంటారు. ఇంతకీ ఆ జిల్లా ఏది అంటే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆది నుంచీ వెలమ సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఓటింగ్ పరంగా అధికంగా ఉన్న మున్నూరు కాపు వర్గం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మరోసారి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల కోసం అందరి కంటే ముందుగానే సిద్దమవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఏయే అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే వినోద్‌కు దెబ్బ పడిందో ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఇందుకోసం సామాజికవర్గ లెక్కలు వేస్తున్నారు స్థానిక నాయకులు. వెలమ వర్సెస్ కాపు.. బోయినపల్లి వినోద్‌కు దక్కుతున్న ప్రాధాన్యాన్ని భరించలేకే మున్నూరు కాపు వర్గానికి చెందిన కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మున్నూరు కాపు వర్సెస్ వెలమ సామాజికవర్గం మధ్య గ్యాప్ కొనసాగుతోంది. గతంలో వెలమ సామాజికవర్గం వారే కరీంనగర్ అసెంబ్లీ సీటుకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించడంతో.. వెలమ సామాజికవర్గానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ క్రమంలో... పార్లమెంట్ సెగ్మెంట్లో వినోద్‌తో పాటు.. కరీంనగర్ అసెంబ్లీలోనూ ఆ సామాజికవర్గాలకు సందు ఇవ్వొద్దనే రీతిలో మరి కొన్ని సామాజికవర్గాలు.. ఏకంగా పార్టీలకతీతంగా కంకణం కట్టుకోవడం.. కరీంనగర్లో కనిపించే విభిన్న రాజకీయ తంత్రం. వినోద్ డామినేటింగ్ శైలి.. రాజకీయాలంటేనే వ్యూహ, ప్రతివ్యూహాలుగా భావించే రోజుల్లో.. నేతల స్వయంకృతాపరాధాలు కూడా ప్రత్యర్థి పార్టీలకు.. అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులకూ అడ్వాంటేజ్‌గా మారుతాయి. గత పార్లమెంట్ ఎన్నికలే అందుకు నిదర్శనం. కరీంనగర్‌కు ఎన్నో పనులు చేసినా తనను ఓడించారని మాజీ ఎంపీ వినోద్ భావిస్తుండగా.. ఎన్ని చేశామన్నది కాదు.. ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని చేశారా అని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేశారు. పైగా ప్రస్తుతం అధికారంలో లేనప్పుడే వినోద్ శైలి డామినేటింగ్‌గా ఉందని ఫీలవుతున్న కొందరు కీలక ప్రజాప్రతినిధులు.. మరోసారి ఎంపీగా గెలిస్తే.. ఇక తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే భావన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది. కరీంనగర్ రాజకీయాల్లో ఒక పార్టీవారంతా ఒకే తాటిపైన ఉన్నారనుకుంటే పొరపాటే. ఒక సామాజికవర్గం వారైతే మాత్రం కచ్చితంగా ఒక్క తాటిపైనే ఉన్నట్టు సామాజిక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి అనేకంటే.. ఏ సామాజికవర్గానిది పైచేయి అవుతుందని మాట్లాడుకోవాల్సిన భిన్నమైన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది. ఇది కూడా చదవండి: తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. ప్లాన్ మార్చిన ఒవైసీ! -
ప్రైవేట్ విద్యాసంస్థలు బాధ్యత మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి విధిగా ప్రతి నెలా జీతాలు చెల్లించే నైతిక బాధ్యత ఆయా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలపై ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రైవేట్ సాంకేతిక కళాశాలల లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల సంఘం ప్రతినిధులు వినోద్ కుమార్‌ను ఆయన అధికారిక నివాసంలో ఆదివారం కలిశారు. తమ సమస్యలు వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ భావిభారత పౌరులను తీర్చిదిద్దుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయ, అధ్యాపకులకు విద్యా సంస్థలు జీతాలు చెల్లించకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే తెలంగాణ విద్యాచట్టం–82లో సవరణలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతి నెలా ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఆయా విద్యాసంస్థల యజమానులు కచ్చితంగా నెలవారీ జీతాలు చెల్లించేలా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వినోద్‌ను కలిసిన వారిలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐనేని సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉమాదేవి, కార్యదర్శులు రాజు, నరేశ్, మదన్ తదితరులున్నారు. -
రెండో ఐటీ సిటీగా కరీంనగర్
సాక్షి, కరీంనగర్ : హైదరాబాద్ తరువాత ఐటీ సిటీగా కరీంనగర్‌ను తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(టీఎస్ఐఐసీ) కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. కరీంనగర్లో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటీ టవర్‌లో కంపెనీల ఏర్పాటు, మౌలికవసతుల కల్పన, ఉద్యోగావకశాలు వంటి అంశాలపై ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని రాష్ట్రంలోనే హైదరాబాద్ తర్వాత రెండవ అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే కరీంనగర్ నగరంలో ఐటీ టవర్ నిర్మించాలని తాను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రూ.38 కోట్ల వ్యయంతో 2018 జనవరి 8న కేటీఆర్ శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రెండేళ్లలోనే ఐటీ టవర్‌ను అత్యాధునికంగా నిర్మించామని, ఈ నెల 30న కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని భావించినప్పటికీ, ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో వాయిదా వేసినట్లు తెలిపారు. ఐటీ టవర్‌లో ఇప్పటికే అంగీకరించిన 11 కంపెనీల ఏర్పాటుతోపాటు ఇతర అంశాలపై అధికారులు తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్ ఇప్పటికే స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీ, సేఫ్ సిటీగా పేరుపొందిందని, దేశంలో ఐదు లక్షలలోపు జనాభా కలిగిన పట్టణాలలో రెండవ నివాసయోగ్యమైన నగరంగా ఎన్నికైందని తెలిపారు. ఐటీ కంపెనీలు కరీంనగర్‌కు రావడం వల్ల స్థానికంగా కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని చెప్పారు. ఈ దిశగా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలన్నారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడే ఐటీ టవర్ మంజూరైందని, భవిష్యత్తులో ఐటీ రంగానికి కరీంనగర్ మరో కేంద్రంగా మారనుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగావకాశాలను వికేంద్రీకరిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కొనియాడారు. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఐటీ కంపెనీలకు అందిస్తున్న రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పనను వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ టీఎస్ఐసీ నరసింహారెడ్డి, 15 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. -
ప్రధాని నరేంద్రమోదీకి సీఎం లేఖ
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంలో ఐఐఐటీని ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదివారం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. తాను గతంలో ఎంపీగా పనిచేసిన సమయంలో ఐఐఐటీని కరీంనగర్లో ఏర్పాటు చేయాలని కోరుతూ 2018 ఆగస్టులో సీ ఎం ద్వారా పంపిన లేఖకు కొనసాగింపుగా సీఎం ద్వారా మరో లేఖ పంపినట్లు తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగ ర్ పట్టణం పారిశ్రామికంగా అభి వృద్ధి చెందిందని, కరీంనగర్‌కు ఐఐఐటీని ఏర్పాటు చేయలని లేఖలో కోరినట్లు తెలిపారు. -
కేంద్ర ఎన్నికల సంఘంతో టీఆర్ఎస్ ప్రతినిధుల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం అవుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్రతినిధులతో ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం అన్ని పార్టీలతో సమావేశం అవుతోందని, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ను కూడా ఆహ్వానించారని తెలిపారు. సెక్షన్ 6ఏ, 6ఎఫ్ ఎన్నికల గుర్తులు రిజర్వేషన్, అలాట్మెంట్ 1968 ప్రకారం నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ గుర్తింపు పొందిన ప్రాంతీయ రాజకీయ పార్టీగా ఉందని, విభజన అనంతరం టీఆర్ఎస్ కేవలం తెలంగాణలోనే పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అభ్యర్థులను పోటీకి నిలపలేని నేపథ్యంలో కారు గుర్తును తమ పార్టీ గుర్తుగా ఉండాలా వద్ద అనే అంశంపై స్పందించాలని నోటీసులు ఇచ్చారని అన్నారు. దీనికి బదులుగా పార్టీ అధ్యక్షుడితో చర్చించిన అనంతరం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పినట్లు వినోద్ కుమార్ వివరించారు. -
వినోద్‌కుమార్‌కు 5లక్షల మెజార్టీ తేవాలి
సాక్షి, హుస్నాబాద్‌రూరల్: టీఆర్ఎస్ బలపరిచిన కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బోయినిపెల్లి వినోద్‌కుమార్‌ను 5 లక్షల మెజార్టీతో గెలుపించడానికి ట్రాస్మా ఉపాధ్యాయులు అందరూ పని చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరిశేఖర్‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో ట్రస్మా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనతి కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వినోద్‌కుమార్ గెలుపు కోసం ట్రస్మా నాయకులు పని చేయాలని కోరారు. తమ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులకు గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి గెలుపు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపెల్లి మల్లారెడ్డి, డివిజన్ అధ్యక్షులు బుర్ర రాజేందర్, నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ముత్తినేని రాజేశ్వర్‌రావు, అయిలేని శంకర్‌రెడ్డి, మహ్మద్ అయూబ్, రవికుమార్,టీఆర్ఎస్ నాయకులు వాల నవీన్‌చాడ సత్యనారాయణరెడ్డి, వెంకటనారాయణ, శ్రీధర్‌రెడ్డి, కిరణ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ గూటికి సర్పంచ్‌లు
సాక్షి శంకరపట్నం: మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో సహా, 9 మంది సర్పంచ్‌లు మంగళవారం కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మండలంలోని వంకాయగూడెం గ్రామంలోని మాదవసాయి గార్డెన్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చౌడమల్ల వీరస్వామి, యూత్ అధ్యక్షుడు రమణారెడ్డి, మొలంగూర్ ఎంపీటీసీ వావిలాల రాజు, మొలంగూర్ సర్పంచ్ మోరె అనూష, తాడికల్ సర్పంచ్ కీసర సుజాత, చింతగుట్ట సర్పంచ్ ఆడెపు రజిత, అర్కండ్ల సర్పంచ్ శేర్ల అనిత, రాజాపూర్ సర్పంచ్ పిన్‌రెడ్డి వసంత, కన్నాపూర్ సర్పంచ్ కాటం వెంకటరమణారెడ్డి, లింగాపూర్ సర్పంచ్ అంతం వీరారెడ్డి, కల్వల సర్పంచ్ దసారపు భద్రయ్య, ఇప్పలపల్లె సర్పంచ్ బైరీ సంపత్, ఏరడపెల్లి మాజీ ఎంపీటీసీ మొగురం శంకర్, వివిధ పార్టీలకు చెందిన 500 మంది కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ కండువాలు కప్పి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ దొంగల విజయ, జెడ్పీటీసీ పొద్దుటూరి సంజీవరెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అద్యక్షుడు పల్లె సంజీవరెడ్డి, యూత్ అధ్యక్షుడు గుర్రం శ్రీకాంత్, మార్కెట్ వైస్ చైర్మన్ కల్లూరి పోచయ్య, వైస్‌ఎంపీపీ పర్శరాములు, సింగిల్‌విండో చైర్మన్ హన్మంతరావు, రైతు సమితి కన్వీనర్ కొంరారెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. -
మినహాయింపును పరిమితం చేయాలి
* లోక్‌సభలో కరీంనగర్ ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపును 40 మంది ఉద్యోగుల వరకూ ఉన్న సంస్థలకు వర్తింపజేయడం తగదని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కార్మిక చట్టం (రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. 19 నుంచి ఈ సంఖ్యను 40కి పెంచకుండా 25 వరకు ఉద్యోగులు ఉన్న సంస్థలకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. చిన్న సంస్థలకు సంక్లిష్టమైన నిబంధనలు అడ్డుగోడలా ఉండకుండా తెస్తున్న ఈ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు. -
వాటర్ గ్రిడ్‌కు నిధులు కేటాయించాలి: వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు, అందరికీ ఆహారం కోసం పది శాతం నిధులు, అలాగే జాతీయ గ్రామీణ తాగునీటి పథకానికి పది శాతం నిధులు ఇస్తోందని, దీనిని పెంచే ఉద్దేశం ఏదైనా ఉందా అని వినోద్ ప్రశ్నించగా.. మంత్రి అలాంటి ప్రతిపాదనేదీ లేదన్నారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్‌కు నిధులు కేటాయించాలని కోరారు.