
సమావేశంలో మాట్లాడుతున్న శేఖర్‌రావు
సాక్షి, హుస్నాబాద్‌రూరల్: టీఆర్‌ఎస్ బలపరిచిన కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బోయినిపెల్లి వినోద్‌కుమార్‌ను 5 లక్షల మెజార్టీతో గెలుపించడానికి ట్రాస్మా ఉపాధ్యాయులు అందరూ పని చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరిశేఖర్‌రావు అన్నారు. హుస్నాబాద్‌లో ట్రస్మా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనతి కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వినోద్‌కుమార్ గెలుపు కోసం ట్రస్మా నాయకులు పని చేయాలని కోరారు. తమ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులకు గ్రామాల్లోని ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి గెలుపు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు లింగంపెల్లి మల్లారెడ్డి, డివిజన్ అధ్యక్షులు బుర్ర రాజేందర్, నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ముత్తినేని రాజేశ్వర్‌రావు, అయిలేని శంకర్‌రెడ్డి, మహ్మద్ అయూబ్, రవికుమార్,టీఆర్‌ఎస్ నాయకులు వాల నవీన్‌చాడ సత్యనారాయణరెడ్డి, వెంకటనారాయణ, శ్రీధర్‌రెడ్డి, కిరణ్, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment