ఆదాయ పన్ను మాఫీ కోసం కొట్లాడుతా | Borlakunta Venkatesh Election Campaign In Peddapalli Constituency | Sakshi
Sakshi News home page

ఆదాయ పన్ను మాఫీ కోసం కొట్లాడుతా

Published Fri, Apr 5 2019 11:20 AM | Last Updated on Fri, Apr 5 2019 11:21 AM

Borlakunta Venkatesh Election Campaign In Peddapalli Constituency - Sakshi

మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి వెంకటేశ్‌ నేత 

సాక్షి, శ్రీరాంపూర్‌ (మంచిర్యాల): కార్మికులు తనను ఆదరించి గెలిపిస్తే ఆదాయ పన్ను మాఫీ కోసం పార్లమెంట్‌లో కొట్లాడుతానని టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌ నేత అన్నారు. గురువారం ఆయన శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఎస్సార్పీ 1 గని వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్మికులను గేటుబయట కలిసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌నేత మాట్లాడుతూ కేంద్రం తెలంగాణ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని వివరించారు. విభజన హామీలు నెరవేర్చలేదన్నారు.

ఎంపీల బలం ఉంటేనే కేంద్రంలో ఏ ప్రభుత్వమైనా దిగివస్తుందన్నారు. అందుకే ఈసారి అంతటా టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను అఖండా మెజారిటీతో గెలిపించాలని కోరారు. బొగ్గుగని కార్మికులు ఎన్నో ఏళ్లుగా ఆదాయ పన్ను కోసం ఎదురుచూస్తున్నారని కాని ఏనాడు కేంద్రంలోని ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కార్మికుల సమస్యలు ఏవి ఉన్న వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం దివాకర్‌రావు మాట్లాడుతూ వెంకటేశ్‌ నేత ప్రజాసేవా చేయాలనే ఉద్ధేశంతో ఉన్నత ఉద్యోగం వదిలి వచ్చానని తెలిపారు. ఆయన వెంట మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు ఉన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ బ్రాంచీ ఉ పాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర డెప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, నాయకులు వీరభద్రయ్య, మల్లారెడ్డి, వెంగళ కుమారస్వామి, మోతె రాఘవరెడ్డి, రాజనాల రమేశ్, ఫిట్‌ సెక్రెటరీ కొలిపాక సమ్మయ్య, గోపాల్‌ పాల్గొన్నారు. 


టీబీజీకేఎస్‌ ఎన్నికల ప్రచారం
శ్రీరాంపూర్‌ (మంచిర్యాల): గుర్తింపు సంఘం టీ బీజీకేఎస్‌ నాయకులు గురువారం కార్మిక కాలనీ ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్‌ నేతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీబీజీకేఎ స్‌ బ్రాంచీ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, సెంట్రల్‌ డెప్యూటీ జనరల్‌ సెక్రెటరీ అన్నయ్య ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికుల సమస్యలను తీర్చారన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయనన్నీ సంక్షేమ కార్యక్రమాలను, కొత్త హక్కులను కార్మికుల కోసం కల్పించారని వివరించారు. మరోసారి టీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపించి  కానుకగా ఇస్తే మరింత మేలు జరుగనుందని తెలిపారు.

పార్లమెంట్‌లో బొగ్గు గని కార్మికుల ఆదాయ పన్ను కోసం పోరాడాలంటే పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉండాలన్నారు. అందుకే 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలువాలన్నారు. బోర్లకుంట వెంకటేశ్‌ నేతను అధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంద మల్లారెడ్డి, వీరబధ్రయ్య, వెంగళ కుమారస్వామి, కాశీరావు, పానుగంటి సత్తయ్య, చిలుముల రాయమల్లు, మహేందర్‌రెడ్డి, నర్సయ్య, మెండె వెంకటి, కొలిపాక సమ్మయ్య పాల్గొన్నారు.
 


 


టీఆర్‌ఎస్‌దే ఘన విజయం
బెల్లంపల్లి: పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే ఘనవిజయమని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం సింగరేణి ఎక్స్‌ఫ్లోరేషన్‌ విభాగంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముం దస్తుగా కార్మికులను కలిసి టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ ,బీజేపీ పార్టీలకు కార్మికులలో ఆదరణ ఏమాత్రంలేదన్నారు.   పెద్దపల్లి ఎంపీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కొమ్మెర లక్ష్మణ్, ఫిట్‌ సెక్రెటరీ వీరస్వామి, రాజలింగు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement