* లోక్‌సభలో కరీంనగర్ ఎంపీ వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపును 40 మంది ఉద్యోగుల వరకూ ఉన్న సంస్థలకు వర్తింపజేయడం తగదని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కార్మిక చట్టం (రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.
19 నుంచి ఈ సంఖ్యను 40కి పెంచకుండా 25 వరకు ఉద్యోగులు ఉన్న సంస్థలకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. చిన్న సంస్థలకు సంక్లిష్టమైన నిబంధనలు అడ్డుగోడలా ఉండకుండా తెస్తున్న ఈ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
మినహాయింపును పరిమితం చేయాలి
Published Sat, Nov 29 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement
Advertisement