
వాటర్ గ్రిడ్‌కు నిధులు కేటాయించాలి: వినోద్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వాటర్ గ్రిడ్ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ కేంద్రాన్ని కోరారు. లోక్‌సభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు, అందరికీ ఆహారం కోసం పది శాతం నిధులు, అలాగే జాతీయ గ్రామీణ తాగునీటి పథకానికి పది శాతం నిధులు ఇస్తోందని, దీనిని పెంచే ఉద్దేశం ఏదైనా ఉందా అని వినోద్ ప్రశ్నించగా.. మంత్రి అలాంటి ప్రతిపాదనేదీ లేదన్నారు. అనంతరం వినోద్ మాట్లాడుతూ వాటర్‌గ్రిడ్‌కు నిధులు కేటాయించాలని కోరారు.