
మియాపూర్: స్త్రీలు ఎక్కడ గౌరవించడబడుతారో అక్కడ దేవతలు కొలువుంటారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్‌లోని మారుతీ గర్ల్ చైల్డ్ అనాథాశ్రమంలో సినీనటి ప్రత్యూష వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకిషన్, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్‌లు హాజరై ప్రత్యూష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీంలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యూషకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగరాదన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నిర్వాహకులు విజయ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంతి, ప్రత్యూష సోదరుడు కృష్ణ చంద్ర, మారుతీ అనాథాశ్రమం చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాగం సుజాత యాదవ్ తదితరులు
Comments
Please login to add a commentAdd a comment