Prathyusha
-
హాఫ్ శారీకే అందం తెచ్చిన ‘బుజ్జితల్లి’ (ఫొటోలు)
-
24గంటల వ్యవధిలో తండ్రి, కూతుళ్ల మృతి!
మహబూబ్‌నగర్: మండలంలోని దుప్పల్లిలో తండ్రి, కూతురి మరణం తీవ్ర విషాదం నింపింది. సకాలంలో సరైన వైద్యం చేయించుకోలేక 24గంటల వ్యవధిలో ఇరువురు మృతి చెందడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. దుప్పల్లి ఎస్సీకాలనీకి చెందిన తిరుమల్‌రావు (50) పూరి గుడిసెలో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి జీవనం సాగించేవాడు. కొంతకాలంగా అతడు అనారోగ్యానికి గురికావడంతో భార్య కుర్మమ్మ కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో పెద్ద కూతురు ప్రత్యూషను పక్కింట్లో నివాసముండే బాలరాజుకు ఇచ్చి వివాహం చేశారు. కొన్ని రోజులుగా తిరుమల్‌రావు తీవ్ర అనారోగ్యానికి గురికావడం.. ఆర్థిక సమస్యలతో సరైన వైద్యం చేయించుకోక ఇంట్లో మంచానికే పరిమితమై శుక్రవారం మృతి చెందాడు. కాన్పు నిమిత్తం ఆస్పత్రికి వెళ్లి కూతురు.. తిరుమల్‌రావు కూతురు ప్రత్యూష (20) కాన్పు నిమిత్తం ఈనెల 3న వనపర్తి ఎంసీహెచ్‌కు వెళ్లింది. అక్కడ ఆమెకు సాధారణ కాన్పు కాకపోవడంతో డాక్టర్లు ఆపరేషన్ చేశారు. కూతురు జన్మించింది. మరుసటి రోజు ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి క్షీణించి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అక్కడి వైద్యుల సూచన మేరకు ఆమెను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. అక్కడ పరిస్థితి అనుకూలించకపోవడంతో అదే రోజు రాత్రి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. రెండు రోజులపాటు చికిత్స పొందిన ప్రత్యూష.. శనివారం తెల్లవారుజామున మరణించింది. ఒకే ఇంట్లో తండ్రి, కూతురు మరణించడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోధనలు అందరినీ కలిచివేశాయి. ఆర్థిక సమస్యలు లేకుంటే ఇద్దరు బతికేవాళ్లని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలని కోరుతున్నారు. -
Fashion: పర్పుల్ కలర్ అవుట్‌ఫిట్‌లో మెరిసిపోతున్న ‘వింక్ బ్యూటీ’! డ్రెస్ ధర ఎంతంటే!
తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ లోని కన్ను కొట్టే సీన్‌తో ‘వింక్ బ్యూటీ’ గా పేరు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాశ్ వారియర్! సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ హీరోయిన్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవడంలోనూ అంతే ఫాస్ట్‌గా ఉంటుంది. అలా ఆమె అభిమానాన్ని చూరగొన్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. ప్రత్యూష గరిమెళ్ల.. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి తను పెద్ద ఫ్యాషన్ డిజైనర్‌ని కావాలని కలలు కన్నారు. ఆ ఆసక్తితోనే ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్‌లో తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించించారు. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్ వాల్యూ. చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర డిజైన్‌ను బట్టే. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ ఆమె డిజైన్స్ లభ్యం. కాగా ఈ ఏడాది జూన్‌లో ప్రత్యూష గరిమెళ్ల బలవన్మరణానికి పాల్పడి తన వాళ్లను విషాదంలోకి నెట్టారు. ఆమ్రపాలి నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. కానీ ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ని ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు. బ్రాండ్ వాల్యూ డ్రెస్ డిజైనర్: ప్రత్యూష గరిమెళ్ల ధర: రూ. 40,800 జ్యూయెలరీ బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్ ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. అదో సరదా వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. ట్రాన్స్పెరెంట్ గొడుగు, రెయిన్ కోట్ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్ స్లిప్పర్స్ వేసుకుని స్కూల్ బస్ కోసం వెయిట్ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. - ప్రియా ప్రకాశ్ వారియర్ -దీపిక కొండి చదవండి: Floral Designer Wear: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్‌తో మెరిసిపోండిలా! -
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కారణాలపై విచారణ వేగవంతం
-
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెల్ల ప్రత్యూష ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒంటరితనం, డిప్రెషన్ కారణంగానే ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యంత విషపూరితమైన కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే ఆత్మహత్యపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. సెల్ఫీ వీడియో? ప్రత్యూష తన పరిస్థితిని మొత్తం స్నేహితులకు షేర్ చేసినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేగాక ఓ ప్రముఖ హీరోయిన్‌తో ప్రత్యూష చివరిసారిగా మాట్లాడినట్లు గుర్తించారు. చార్కోల్ గ్రిల్లో కార్బన్ మోనాక్సైడ్ రసాయనాన్ని ఉంచి మంటను రగిలించడం ద్వారా వచ్చే పొగను పీల్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బిల్డింగ్ సెల్లార్‌లోని బెడ్రూమ్లో రెండు గ్రిల్స్‌లో కార్బన్ మోనాక్సైడ్‌ను మండించి సోఫాలో పడుకొని ప్రాణాలు వదిలినట్లు పేర్కొన్నారు. డిప్రెషన్‌తో! ప్రత్యూష నుంచి సుసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు అందుకే వెళ్ళిపోతున్నాను’ అంటూ లేఖలో పేర్కొంది. గత కొంత కాలంగా ప్రత్యూ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్ నుంచి బయటకు రాలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రత్యూష నుంచి సుసైడ్ నోట్, పెన్‌డ్రైవ్, సీసీటీవీ ఫుటేజ్, మొబైల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్కు శాంపిల్స్‌ను వైద్యులు పంపారు. అపోలో ఆస్పత్రిలో ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. ఆమె అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. కాగా హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తన బొటిక్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం ఇంటికి వెళ్లిన ఆమె.. శనివారం విగతా జీవిగా కనిపించారు. ఐఆర్ఎస్ కుమార్తె అయిన ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్ రంగంలో రాణిస్తున్నారు. దేశంలో 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఆమె ఒకరు. దాదాపు టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలకు ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశారామో. -
డిప్రెషన్‌తోనే ప్రత్యూష ఆత్మహత్య: పోలీసుల ప్రాథమిక నిర్థారణ
-
ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య, ఎమోషనలైన ఉపాసన
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది హీరోయిన్లకు డిజైనర్‌గా వ్యవహరించిన ప్రత్యూష శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె సినీ సెలబ్రెటీలు హీరోయిన్లు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన కూడా తన స్నేహితురాలైన ప్రత్యూష మృతికి నివాళులు అర్పించారు. చదవండి: నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు: కమల్ హాసన్ ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మై బెస్టీ మై డియరెస్ట్ ఫ్రెండ్. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ఎంతో ది బెస్ట్‌గా ఉండేది. ఇక కెరీర్, ఫ్యామిలీ, స్నేహితులు విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాల్లో ది బెస్ట్‌గా ఉండే ఆమె కూడా డిప్రెషన్‌కు గురైంది. ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం గుండా పయనిస్తుందనేది నిజమనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఉపాసన భావోద్వేగానికి లోనయ్యారు. చదవండి: Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య కాగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూష తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎంతోమంది హీరోహీరోయిన్లకు, సెలబ్రిటీలకు ప్రత్యూష కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. టాలీవుడ్లో శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేశ్, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్, రానా, రామ్ చరణ్‌లకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్లకు సైతం ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మాధురి దీక్షిత్, విద్యాబాలన్‌కు కూడా వర్క్ చేశారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్సులను కూడా చాలా మంది సెలబ్రెటీలు ఎండార్స్ కూడా చేశారు. My bestie my dearest friend. Gone too soon - Upset/ Pissed / Sad She had the best of everything, career, friends & family - yet succumbed to depression. Post this incident, truly believe that karmic baggage passes through lifetimes. We pray for her peace. 🙏#rip P pic.twitter.com/1aOXixKh85 — Upasana Konidela (@upasanakonidela) June 11, 2022 -
ప్రత్యూష గరిమెళ్ల రూమ్ లో సూసైడ్ నోట్.. ఏం రాసిందంటే..??
-
Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
-
Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ప్రత్యూష.. శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష గదిలో కార్బన్‌మోనాక్సైడ్ బాటిల్ లభ్యమైంది. దీంతో ఆమె కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చి మృతి చెందినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రత్యూష గుర్తింపు పొందారు. బాలీవుడ్, టాలీవుడ్లో ప్రముఖ హీరోయిన్లకు ప్రత్యూష డ్రెస్‌లు డిజైన్ చేశారు. దేశంలోని 30 మంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ప్రత్యూష ఒకరుగా గుర్తింపు ఉంది. రిటైర్డ్ ఐఆర్ఎస్ కృష్ణారావు కుమార్తె ప్రత్యూష. సూసైడ్ నోట్ రాసిన ప్రత్యూష ప్రత్యూష ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. తల్లి దండ్రులకు భారం కాలేనని, క్షమించండి అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. తాను కోరుకున్న జీవితం ఇది కాదని లేఖలో పేర్కొంది. కాగా, నిన్న రాత్రి జూబ్లీహిల్స్‌లోని సొంతింటి నుంచి బోటిక్‌కు వచ్చిన ప్రత్యూష.. అక్కడకు కేవలం ఒక బ్యాగ్‌తోనే వెళ్లింది. తనను ఎవరూ డిస్టర్బ్ చేయవద్దని లోపలికి వెళ్లేముందు వాచ్‌మెన్‌కు ప్రత్యూష చెప్పింది. ఎంతసేపటికీ ఆమె బయటకు రాకపోవడంతో వాచ్మెన్ వెళ్లి చూడగా.. ఆమె కిందపడిపోయి ఉండటంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు.. ప్రత్యూష మృతదేహానికి పోస్టుమార్టం నిమ్మితం ఆసుపత్రికి తరలించారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టులో ప్రత్యూష కార్బన్‌మోనాక్సైడ్ వాయువు పీల్చుకోవడం వల్లే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ధైర్యంగా జీవితంలో ముందుకెళ్లండి.. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ప్రిక్వార్టర్స్‌లో ప్రత్యూష
నాగ్‌పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ప్రత్యూష రాచపూడి శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రత్యూష 6–2, 5–7, 6–3తో అవిష్క గుప్తా (భారత్)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. హెదరాబాద్ అమ్మాయిలు హుమేరా, స్మృతి భాసిన్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్లో హుమేరా 6–3, 6–4తో కశిష్ (భారత్)ను ఓడించగా, స్మృతి 6–3, 6–1తో ఎనిమిదో సీడ్ మిహికా యాదవ్ (భారత్)పై సంచలన విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో శ్రావ్య శివాని 1–6, 0–6తో సహజ యమలపల్లి చేతిలో ఓడింది. డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక–సాత్విక 7–6 (7/4), 6–2తో శ్రావ్య శివాని–షర్మదాలపై... నిధి చిలుముల–సౌమ్య 6–3, 6–1తో సుదీప్త–రియాలపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. -
పచ్చ సొన.. సుగుణాల సోనా: డాక్టర్ ప్రత్యూషారెడ్డి
‘కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలిగిస్తుందని అందరికీ తెలుసు. అయితే కొంతమంది కొవ్వు చేరుతుందని అందులోని పచ్చసొనను పక్కనపెట్టి తెల్లసొన మాత్రమే తింటుంటారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. డీ విటమిన్ కొరత రాకుండా ఉండాలంటే రోజూ కోడిగుడ్డు తినాలి. గుడ్డులో ఉండే పచ్చసొనలో లభించే డీ విటమిన్ మరెక్కడా లభించదు’ అంటున్నారు డాక్టర్ ప్రత్యూషారెడ్డి. హైదరాబాద్‌లో ఎంబీబీఎస్ చదివి, అమెరికాలో క్లినికల్ న్యూట్రిషన్లో ఎంఎస్ చదివిన ప్రత్యూష ప్రస్తుతం హైదరాబాద్‌లో పోషకాహార నిపుణులుగా రాణిస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఎలాంటి పోషకాహారం తీసుకోవాలన్న దానిపై ‘సాక్షి’కి ప్రత్యూషారెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. –సాక్షి, హైదరాబాద్ రోగనిరోధక శక్తి అంటే ఏంటి? ఎర్ర రక్తకణాలను పెంచుకోవడం లేదా వాటిని బలోపేతం చేసుకోవడమే రోగ నిరోధక శక్తి. ఏదైనా వైరస్ వస్తే, దానిపై పోరాడేతత్వం ఈ ఎర్రరక్త కణాలకు ఉంటుంది. ఏడు రకాల పద్ధతులు పాటిస్తే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని ప్రపంచ వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమతుల్యమైన ఆహారం అవసరం... ఆరోగ్యానికి, బరువు నియంత్రణలో ఉంచుకోవడానికి సమతుల్యమైన ఆహారం అవసరం. సమతు ల్యమైన ఆహారం అంటే ఏంటనే ప్రశ్న అందరిలో వస్తుంది. కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్ సరిగ్గా తీసుకోవడమే సమతుల్యమైన ఆహారం. ఇడ్లీ, దోశ, అన్నం, చపాతీలతో కార్బోహైడ్రేట్స్ లభిస్తాయి. అదే సమయంలో పీచుపదార్థం తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రంగుల్లో లభించే కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనకు యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు ఉండే గుడ్లు, పప్పు, చికెన్, మటన్ వంటివి కొద్దిగా తీసుకోవాలి. ఇలా మన ఆహారంలో ఇవి మూడూ ఉండాలి. పసుపు, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర వంటివి ప్రతిరోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే కరోనా సమయంలో ఏ కషాయాలు తాగాల్సిన అవసరంలేదు. రోజులో అప్పుడప్పుడు పళ్లు, డ్రైప్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. వ్యాయామం.. నిద్ర.. నీరు ఇక ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాలు ఆగకుండా వాకింగ్ చేయ డం ఆరోగ్యానికి మంచిది. లేదా ప్రాణాయామంతో కూడిన యోగా చేసుకోవచ్చు. కరోనా సమయంలో ప్రాణాయామం ముఖ్యం. వ్యాయామంతోపాటు ప్రతి ఒక్కరూ ఆరు నుంచి ఏడు గంటలపాటు నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్లు దెబ్బతిని అవయవాల పనితీరు తగ్గిపోతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అలాగే రోజుకు 10–12 గ్లాసుల నీరు తాగితే మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్ ప్రమాదం ఉండదు. మానసికంగా లేదా శారీరకంగా తీవ్రమైన ఒత్తిడి, అలసట ఏర్పడితే మనలో ఉన్న హార్మోన్లు తగ్గడం లేదా పెరగడం జరుగుతాయి. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకో వడానికి వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం. పెద్దలకు ప్రతిరోజూ మల్టీ విటమిన్... తినే ఆహారంలో అన్ని విటమిన్లు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల ఒక్కోసారి అవసరమైన విటమిన్లు శరీరానికి సరిగా అందవు. కాబట్టి పెద్దవాళ్లు రోజూ ఒక మల్టీ విటమిన్ మాత్ర వేసుకోవాలి. కడుపునిండా తిన్న తర్వాతే మాత్ర వేసుకోవాలి. మల్టీ విటమిన్లో విటమిన్–సీ, యాంటి ఆక్సి డెంట్స్ ఉంటాయి. శరీరంలో ఇన్ఫెక్షన్, ఊపిరితి త్తుల్లో సమస్య రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ కరోనా వచ్చినా ఇబ్బంది ఉండదు. పండ్లను జ్యూస్ చేసుకోకూడదు.. అన్ని రకాల పండ్లను జ్యూస్ చేసుకొని తాగకూడదు. పండ్లను నేరుగా తినడమే మేలు. జ్యూస్ చేయడం వల్ల వాటిలో షుగర్ చేరుతుంటుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. నేల లోపల పండే క్యారె ట్, బీట్రూట్ లాంటి వాటిని ఉడికించే తినాలి. లేకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక చాలామంది సకాలంలో ఆహారం తినకపోవడం వల్లనే బరు వు పెరుగుతూ ఉంటారు. ఉదయం అల్పా హారం సరిగా తినకపోవడం వల్ల మధ్యాహ్నం ఎక్కువగా తింటాం. ఉదయం ఏదైనా కొద్ది మోతాదులో టిఫిన్‌తోపాటు ఒక ఎగ్ లేదా కూరగాయలు తింటే సరిపోతుంది. అన్నం పరిమాణం తగ్గించుకోవాలి. సాయంత్రం తక్కువ తినాలి. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారి లక్షణాలు.. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి తరచుగా జలుబు చేస్తుంది. ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతి చిన్నదానికీ భయపడుతుంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, మలబద్దకం, విరేచనాలు వస్తుంటాయి. తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి. శారీరకంగా పెద్దగా శ్రమ చేయకుండానే అలసిపోతుంటారు. -
ప్రత్యూష కథ: ఎడారిలో వసంతం లాగా
ప్రత్యూష పెళ్లికూతురు అయింది. 28 డిసెంబర్ 2020 నాడు చరణ్ రెడ్డితో పెళ్లి కావడంతో 24 ఏళ్ళ ఆ యువతి ఓ ఇంటావిడ అయింది. ఎడారిలో వసంతంలాగా నేడు సుఖాంతమైన ప్రత్యూష జీవితం అనూహ్య మలుపులకు కేంద్ర బిందువు. 17 ఆగస్టు 2015 తెల్లవారు 6 గంటల సమయం. సమాచారం అందిన వెంటనే బాలల హక్కుల సంఘం అచ్యుతరావు ఎల్బీనగర్ స్టేషన్ లేడీ కానిస్టేబుల్ తోడుగా ఓ టీవీ చానల్‌ను వెంట తీసుకోని నాగోలు బండ్లగూడలోని ఆ ఇంటి తలుపు తట్టారు. ఇల్లంతా వెతుకగా గిన్నెలు తోముతూ వారికి ప్రత్యూష కనిపించింది. ఆ శరీరంలో నిలబడి నాలుగడుగులు వేసే శక్తి లేదు. ఎండిన ప్రేవులతో తడారిన గొంతుతో మాట పెగలడం లేదు. నల్లగా కమిలిపోయి పొంగిన బుగ్గ లతో ఎండు కట్టెలా నిలబడ్డ ప్రత్యూష ముఖం నిండా గాట్లు, చేతులపై వాతలు. పత్రికల్లో ఈ వార్త చదివిన వారికీ గుండెలు ద్రవించే పరిస్థితి. టీవీల్లో ప్రత్యూషని చూసినవారు చలించిపోయారు. తక్షణ వైద్య సహాయం కోసం ఆమెను దగ్గర్లోని గ్లోబల్ హాస్పిటల్లో చేర్పించారు. రెండ్రోజుల్లో కాస్త కోలుకొని, హాస్పిటల్ బెడ్ పైనుంచే టీవీ, పత్రికలవాళ్ళ ప్రశ్నలకు సమా ధానమిచ్చింది. 2015లో అచ్యుతరావు ప్రత్యూషను కాపాడినప్పటి చిత్రం ప్రత్యూష తల్లి సరళ ‘మిస్ ఆంధ్ర’ కిరీటం గెలుచు కున్న బ్యూటీషియన్. ఇంటికి దగ్గర్లో బ్యూటీ పార్లర్ నడిపేది. తండ్రి రమేశ్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి. 1996లో ప్రత్యూష పుట్టింది. హాయిగా సాగుతున్న సంసారంలోకి రమేశ్ సహోద్యోగి శ్యామల ప్రవేశించింది. తన బ్యూటీ పార్లర్లో వీరిరువురి శారీరక సంబంధాన్ని స్వయంగా చూసిన సరళ నిలదీయడం పర్యవసానంగా 2003లో వారి వైవాహిక బంధం తెగి పోయింది. కూతురు ప్రత్యూషతో సరళ విడిగా బతక నారంభించింది. కుటుంబ జీవితంలో వచ్చిన ఒడి దుడుకులను తట్టుకోలేక సరళ 2010 డిసెంబర్లో ఆత్మహత్య చేసుకుంది. తల్లి తోబుట్టువుల నిరాదరణ వల్ల ప్రత్యూష జీవితం అనాథాశ్రయానికి చేరింది. కొంత కాలానికి తండ్రి వచ్చి ఇంటికి తీసికెళ్ళాడు. ఒక సంవత్సరం బాగానే గడిచింది. ప్రత్యూష చదువు కొనసాగించింది. క్రమంగా సవతి తల్లి శ్యామలలో ప్రత్యూష పట్ల క్రూరత్వం మొదలైంది. చదువు మాన్పించింది. జుట్టు కత్తిరించింది. కత్తితో గాట్లు, వాతలు, ఇనుప రాడ్లతో, సుత్తితో బాదడం నిత్య కృత్యమైంది. రోజుల తరబడి ఆకలితో మాడ్చింది. తండ్రి ఆ అకృత్యాలను చూస్తూ నవ్వుతూ పేపర్ చదువుకొనేవాడు. సుమారు రెండేళ్ల పాటు ఈ దుర్భర జీవితాన్ని అనుభవించిన ప్రత్యూష బాలల హక్కుల సంఘం చొరవతో బయటపడింది. ఐదు రోజులపాటు హాస్పిటల్లో ప్రత్యూష వెంట ఉన్న అచ్యుతరావు డిశ్చార్జి అయ్యాక కూడా ఆమె బాగోగుల బాధ్యత తానే తీసుకుంటానని మీడియాతో అన్నారు. అయితే ఆయనకు ఆ అవసరం పడలేదు. ప్రత్యూష జీవన పరిస్థితి తెలుసుకొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వయంగా హాస్పిటల్‌కు వచ్చి ఆమెను పరామర్శించారు. ఆ క్షణమే తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రత్యూష తండ్రిని, సవతి తల్లిని పోలీ సులు అరెస్టుచేసి హత్యానేరాన్ని నమోదు చేశారు. ప్రత్యూష మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హాస్టల్లో చేరింది. నర్సింగ్ కోర్సులో డిగ్రీ పూర్తి చేసింది. ఏడాదిగా ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఉద్యోగం చేస్తోంది. త్వరలో నిమ్స్‌లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరనుంది. తన సహోద్యోగి ద్వారా పరిచయమైన కుటుంబంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగి చరణ్‌తో జరిగిన పెళ్లి ప్రత్యూష నిండు జీవితానికి శ్రీకారమైంది. తమ దత్త పుత్రిక పెళ్లి లాంఛనాలను కేసీఆర్ కుటుంబం నిర్వర్తించింది. తాను రక్షించిన అమ్మాయి జీవితంలో విరబూసిన ఆనందాలు చూసేందుకు, అచ్యుతరావు మన మధ్య లేరు. కరోనా బారిన పడి ఆయన 2020 జూలై 21న మరణించారు. ప్రత్యూష జీవితం బాగుపడినందుకు ఎంతో ఆనందంగా ఉందనీ, ఆ స్ఫూర్తితో బాలల సంఘం తన కార్యకలాపాలపై మరింత అంకితమవు తుందనీ అచ్యుతరావు కుటుంబం చెబుతోంది. బి. నర్సన్ వ్యాసకర్త రచయిత, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 28169 -
కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహ వేడుక
-
కేసీఆర్ దత్త పుత్రిక వివాహ వేడుక
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం కార్యక్రమం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పాటిగడ్డ గ్రామంలో చరణ్ రెడ్డితో ఆమె వివాహం నేడు (సోమవారం) జరగనుంది. ఈనేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆమె పాటిగడ్డలోని లూర్దూమాత చర్చికి బయల్దేరి వెళ్లారు. పాటిగడ్డ గ్రామస్తులు, వరుడు చరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి వేడుకకు తరలివెళ్లారు. ప్రత్యూష వివాహానికి పలువురు ప్రముఖులు రానున్నారు. ఇక క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం నిర్వహించనున్నట్టు జిల్లా స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారి మోతీ తెలిపారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణలోని పెళ్లి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. (చదవండి: ప్రత్యూష పెళ్లికూతురాయెనె.. ) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రత్యూష పెళ్లికూతురాయెనె..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లికూతురుగా ముస్తాబైంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ గెస్ట్‌హౌజ్‌లో ఈ వేడుక నిర్వహించారు. ఈశాఖ సంయుక్త సంచాలకురాలు కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సునంద, గిరిజ, శారద, హైదరాబాద్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మోతి తది తరులు ప్రత్యూషను మంగళవాయిద్యాల నడుమ పెళ్లి కూతురుగా అలంకరించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం) అనంతరం మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 28 ఉదయం 10 గంటలకు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట పాటిగడ్డ గ్రామం వద్ద మేరీమాత ఆలయంలో రాంనగర్‌కు చెందిన చరణ్ రెడ్డితో క్రిస్టియన్ (రోమన్ క్యాథలిక్) సంప్రదాయ పద్ధతిలో ప్రత్యూష వివాహం జరగనుందని మహిళా శిశుసంక్షేమ అధికారులు తెలిపారు. ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజ్ పర్యవేక్షణలో జరిగే ఈ వివాహానికి పలువురు మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు హాజరు కానున్నారు. -
సినీనటి ప్రత్యూషకు నివాళి
మియాపూర్: స్త్రీలు ఎక్కడ గౌరవించడబడుతారో అక్కడ దేవతలు కొలువుంటారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. ఆదివారం మియాపూర్‌లోని మారుతీ గర్ల్ చైల్డ్ అనాథాశ్రమంలో సినీనటి ప్రత్యూష వర్ధంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలకిషన్, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్‌లు హాజరై ప్రత్యూష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం షీ టీంలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రత్యూషకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగరాదన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నిర్వాహకులు విజయ, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఫీల్డ్ ఆఫీసర్ ప్రశాంతి, ప్రత్యూష సోదరుడు కృష్ణ చంద్ర, మారుతీ అనాథాశ్రమం చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాగం సుజాత యాదవ్ తదితరులు -
ఓ తల్లి వేదన
-
అత్తింటివారే హత్యచేశారు.?
కృష్ణాజిల్లా, పెనమలూరు: రెండు రోజుల క్రితం యనమలకుదురులో అదృశ్యమైన నల్లబోతుల ప్రత్యూష కేసులో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నేతలు పెనమలూరు పోలీస్‌స్టేషన్ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. అత్తింటి వారే ప్రత్యూషను హత్యచేసి కనిపించకుండా చేశారని ఆరోపిస్తూ పోలీసులు నిందితులకు మద్దతుగా ఉన్నారంటూ వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష తల్లి నిర్మల స్పృహ కోల్పోవడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పందించిన పోలీసులు కేఈబీ కెనాల్‌ను జల్లెడపట్టారు. చివరికి ప్రత్యూష మృతదేహాన్ని చోడవరం గ్రామం వద్ద గుర్తించారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ప్రత్యూష (20)కు యనమలకుదురు మాజీ పంచాయతీ వార్డు సభ్యుడు నల్లబోతుల విజయ్‌కిరణ్‌తో 2016లో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నాడు. విజయ్‌కిరణ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య కొంత కాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న భార్యభర్తల మధ్య మరోసారి వాగ్వివాదం జరిగింది. అదే రోజు రాత్రి ప్రత్యూష కేఈబీ కెనాల్లో దూకి గల్లంతైంది. ఈ ఘటనకు ముందు ఆమె తల్లితో ఫోన్లో మాట్లాడింది. ఆ తరువాత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అదే రోజు అర్ధరాత్రి భర్త విజయ్‌కిరణ్ ప్రత్యూష కనబడటంలేదని అత్త నిర్మలకు చెప్పి మౌనంగా ఉండి పోయాడు. కేఈబీ కెనాల్ నుంచి మృతదేహాన్ని తీస్తున్న దృశ్యం మిస్సింగ్ కేసు నమోదుపై వివాదం కాగా ప్రత్యూష కనిపించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రత్యూష తల్లి అల్లుడిపై అనుమానం వ్యక్తంచేసినా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయడం వివాదంగా మారింది. గత మంగళవారం నుంచి ప్రత్యూష కనిపించకపోయినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, అత్తింటి వారికి మద్దతుగా ఉన్నారని ఆరోపిస్తూ శుక్రవారం ప్రత్యూష కుటుంబ సభ్యులు, బంధువులు, మహిళా çసంఘాల నేతలు పోలీస్‌స్టేషన్‌కు వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ప్రత్యూష తల్లి నిర్మల పోలీస్‌స్టేషన్ వద్ద స్పృహ కోల్పోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. -
ప్రమాదం పెద్దదే...అయినా భయపడలేదు..
సర్పవరం (కాకినాడసిటీ): ప్రమాదానికి గురైన ప్రత్యూష పూర్తిగా కోలుకుందని బుధవారం జీజీహెచ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వైద్యులు తెలిపారు. ఇటీవల ప్రమాదశాత్తు మేడపై నుంచి పడిపోయిన ఈమె పక్కటెముకకు కర్ర గుచ్చుకుని కడుపులో నుంచి బయటకు వచ్చిన సంఘటన పాఠకులకు విదితమే. ఈ నెల 10వ తేదీన ప్రమాదం జరిగిన అనంతరం రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్ళి మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా సర్జరీ విభాగాధిపతి డాక్టర్ పీవీ బుద్ధ, డాక్టర్ రజని, వైద్య బృందం కడుపులోనుంచి కర్రను తొలగించి శస్త్ర చికిత్స చేసిన అనంతరం పూర్తిగా కోలుకున్నందున బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు తెలిపారు. ప్రమాదం పెద్దదే...అయినా భయపడలేదు.. నా పక్కటెముకల్లో కర్ర గుచ్చుకున్నా నేను ధైర్యంగానే ఉన్నాను. డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను మాలమస్తీ కుటుంబంలో పుట్టాను. నా తల్లిదండ్రులు నాకు భయం తెలియకుండా పెంచారు. నా కుటుంబంలో ఎవరికీ భయం ఉండదు. ఎంతటి సమస్యనైనా ఒంటరిగానే ఎదుర్కోవలసి ఉంటుందని, మా పెద్దల నుంచి నాకు అలవాటైంది. నా కడుపులో కర్ర దిగినా నా కళ్ళల్లో నీళ్ళు రాలేదు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో మాలమస్తీ విన్యాసాలకు ప్రత్యేకత ఉంది. నా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మాలాంటివాళ్లను ప్రభుత్వం తరుపున జిమ్నాస్టిక్ పోటీలకు పంపిస్తే నిజాయితీగా పతకాలు తెస్తాం. – పత్తి ప్రత్యూష, 8వ తరగతి, దుళ్ల హైస్కూల్ -
ఆరేళ్లకే...నూరేళ్లు నిండిపోయాయా తల్లీ!
ఆ చిన్నారికేం తెలుసు... ఆ రోజే తనను మృత్యువు కబళించబోతోందని. ఆ ఇటుకల ట్రాక్టర్ తన పాలిట మృత్యుశకటమవుతుందని. బడికి సెలవని తెలీక... అదే తనకు చివరి రోజని ఊహించక... తెల్లారి లేచి చక్కగా యూనిఫాం వేసుకుని... పుస్తకాల సంచి భుజాన తగిలించుకుని అమ్మా... నాన్నకు... టాటా చెప్పింది. అదే చివరి పిలుపని ఆ తల్లిదండ్రులూ ఊహించలేదు. శృంగవరపుకోట మండలం వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజు కళ్లాల వద్ద జరిగిన ఈ దుస్సంఘటన కన్నవారినే కాదు... విన్నవారిని సైతం కన్నీరు పెట్టించింది. గ్రామమంతానిర్ఘాంతపోయింది. శృంగవరపుకోట రూరల్:ఎస్.కోట–విజయనగరం ప్రధాన రహదారిలో వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజుకళ్లాల వద్ద ఇటుకల లోడ్‌తో అతివేగంగా వస్తున్న ఏపీ 35 వై 4093 నంబర్ గల ట్రాక్టర్ ఢీకొనడంతో యూకేజీ విద్యార్థిని తమటపు ప్రత్యూష (6) అక్కడికక్కడే కన్నుమూసింది. ట్రాక్టర్ నడుపుతున్న తాండ్రంగి వాసు (17) సంఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. గురువారం ఉదయం 9.30 సమయంలో జరిగిన ఈ ప్రమాదం గురించి ప్రత్యక్ష సాక్షులు, ఎస్.కోట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.రవి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. వేములాపల్లి పంచాయతీ శివారు గట్రాజుకళ్లాలకు చెందిన తమటపు ప్రత్యూష స్థానికంగా ఉన్న శ్రీసత్యసాయి హైస్కూల్లో యూకేజీ చదువుతోంది. ప్రతిరోజులాగానే పాఠశాలకు వెళ్లిన విద్యార్థులకు బాబూజగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా సెలవు అని చెప్పడంతో ఇంటిముఖం పట్టారు. ఇంటికి వస్తున్న దారిలో గల ఒక షాపు వద్ద విద్యార్థిని ప్రత్యూష తినుబండారాలు కొనుక్కొని ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా విజయనగరం వైపు నుంచి ఇటుకల లోడ్‌తో అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ చిన్నారి ప్రత్యూషను నేరుగా ఢీకొని తొమ్మిదడుగుల మేర ఈడ్చుకుని పోవడంతో చిన్నారి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ప్రమాద వార్త తెలుసుకున్న వెంటనే ఉపాధి పనులకు వెళ్లిన తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తల్లిదండ్రులు లక్ష్మి, కృష్ణ, మృతురాలి అక్క జ్ఞానేశ్వరి, తదితరుల రోధనలతో చూపరుల కళ్లు చెమర్చాయి. చిన్నారి ప్రత్యూష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాక్టర్ డ్రైవర్, యజమానిపై కేసు నమోదు మైనర్ వ్యక్తిని ట్రాక్టర్ డ్రైవర్‌గా నియమించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు ప్రమాదాలకు కారణమైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్ వాసు, ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవి తెలిపారు. పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి.. ప్రత్యూష మృతికి సత్యసాయి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం కూడా కారణమేనని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కేఎస్ పాత్రుడు, ఆర్. శ్రీను ఆరోపించారు. సెలవు రోజున పాఠశాల ఎందుకు తెరిచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా పాఠశాలకు సెలవు ప్రకటించామని, విషయం తెలియని కొంతమంది విద్యార్థులు పాఠశాలకు రాగా సెలవని చెప్పి పంపించేసినట్లు పాఠశాల కరస్పాండెంట్ లగుడు శ్రీను తెలిపారు. -
ఒలింపియాడ్ పతకమే లక్ష్యం
చెస్ క్రీడాకారిణి ప్రత్యూష తుని : చెస్ ఒలింపియాడ్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని తునికి చెందిన చదరంగం క్రీడాకారిణి బి.ప్రత్యూష తెలిపారు. తుని రైల్వేస్టేçÙన్లో మంగళవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 2 నుంచి 14 వరకూ అజర్బైజాన్ దేశం బాకార్ పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు వెళుతున్నట్టు వివరించారు. ఇండియా నుంచి ఐదుగురు క్రీడాకారిణులతో కూడిన జట్టు ఈ పోటీలకు వెళుతుందన్నారు. ఇందులో ఏపీ నుంచి తనతోపాటు ద్రోణవల్లి హారిక, ఢిల్లీకి చెందిన తానియా సత్యదేవ్, మహారాష్ట్ర నుంచి సౌమ్య స్వామినాథన్, ఒడిశాకు చెందిన పద్మినీ రీత్ ఉన్నారన్నారు. అజర్‌బైజా¯Œæకు బుధవారం బయలుదేరుతున్నట్టు ప్రత్యూష వివరించారు. ప్రస్తుతం 2,329 పాయింట్లతో ఉన్నానని, ఒలిపింయాడ్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 16 వరకూ కోల్‌కతాలో జరిగే వుమెన్–ఎ టోర్నమెంట్, డిసెంబర్ 2 నుంచి 14 వరకూ లండన్‌లో జరిగే క్లాసిక్ టోర్నీ, సెప్టెంబర్ 18 నుంచి 28 వరకూ ఖతార్‌లో జరిగే ఓపెన్ చెస్ టోర్నమెంట్లలో తాను పాల్గొంటున్నానని చెప్పారు. నవంబర్ నెలాఖరుకు మహిళా గ్రాండ్‌మాస్టర్ అవుతానని ప్రత్యూష వివరించారు. -
బాలిక అదృశ్యం
సుండుపల్లి: స్థానిక వాయలపాటివాండ్లపల్లెకు చెందిన ప్రత్యూష అనే బాలిక అదృశ్యమైనట్లు ఆమె తండ్రి శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలోని బోరు దగ్గరకు వెళ్లి మోటర్ స్విచ్ ఆన్ చేసి వస్తానని తండ్రి శివయ్యకు చెప్పి వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ బాలిక స్థానిక జూనియర్ కళాశాలలో చదువుతోంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కేసీఆర్ దత్త పుత్రిక ప్రేమికుడు దొరికాడు
ఆళ్లగడ్డ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ప్రత్యూషను ప్రేమించిన యువకుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక పోలీసుల సమాచారం మేరకు.. ప్రత్యూష హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో అదే ఆసుపత్రికి తమ బంధువుల చికిత్స నిమిత్తం వెళ్లిన ఆళ్లగడ్డ యువకుడు వెంకట మద్దిలేటి(బుజ్జి)తో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారి ఇరువురూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇరువురూ కలిసి ఉన్న ఫొటోలు వాట్సాప్‌లో హల్ చల్ చేశాయి. దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆరాతీశారు. వెంకట మద్దిలేటి స్థానిక ఆటో మొబైల్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. -
ప్రత్యూష స్నేహితులపై చర్యలు..
ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్న ఇద్దరు నటీమణులు.. రాఖీ సావంత్, డాలీ బింద్రాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మెంబర్స్ ఆఫ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సీఐఎన్‌టీఏఏ) ప్రకటించింది. 'వీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలీదు. ఓ వైపు నటి చనిపోతే మరోవైపు వీరందరూ పబ్లిసిటీ కోసం పడిచస్తున్నారు. సీఐఎన్టీఏఏలో వీరు కూడా సభ్యులు కావడం మూలన సస్పెండ్ చేయలేకపోతున్నాం' అని వివాదాల కమిటీ చైర్మన్ అమిత్ భేల్ తెలిపారు. ప్రత్యూష మరణం తర్వాత డాలీ ఆమెతో వాట్సాప్‌లో జరిపిన సంభాషణను ప్రత్యూష తల్లి సమక్షంలో మీడియా ముందుకు తీసుకువచ్చారు. ప్రత్యూషను ఆసుపత్రికి తీసుకువచ్చినపుడు ఆమె నుదుటి మీద కుంకుమ బొట్టు ఉందని ఆమె పేర్కొంది. ఆత్మహత్యలు ఆగాలంటే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫ్యాన్లను బ్యాన్ చేయాలంటూ రాఖీ కోరింది. ఈ అంశాలపై సీఐఎన్‌టీఏఏ సభ్యులతో చర్చించానని త్వరలో చర్యలపై మాట్లాడుతానని తెలిపారు. -
ప్రత్యూషకు మరో విజయం
కోల్‌కతా: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష మరో విజయాన్ని సాధించింది. అండర్-14 ప్రపంచ చాంపియన్ వైశాలి (తమిళనాడు)తో ఆదివారం జరిగిన తొమ్మిదో రౌండ్లో ప్రత్యూష 43 ఎత్తుల్లో గెలిచింది. ఈ టోర్నీలో ప్రత్యూషకిది ఐదో విజయం. తొమ్మిదో రౌండ్ తర్వాత ప్రత్యూష 6.5 పాయింట్లతో స్వాతి ఘాటే (ఎల్ఐసీ)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నూతక్కి ప్రియాంక నాలుగో పరాజయాన్ని చవిచూసింది. తొమ్మిదో రౌండ్లో భక్తి కులకర్ణి (గోవా) చేతిలో ప్రియాంక ఓడిపోయింది. ప్రస్తుతం పద్మిని రౌత్ (ఒడిషా) 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఈ టోర్నీలో మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి. సోమవారం జరిగే 10వ రౌండ్లో భక్తి కులకర్ణితో ప్రత్యూష, సౌమ్య స్వామినాథన్‌తో ప్రియాంక తలపడతారు. -
ప్రత్యూష గేమ్ ‘డ్రా’
కోల్‌కతా: జాతీయ మహిళల ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు బొడ్డ ప్రత్యూష, నూతక్కి ప్రియాంకలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. శుక్రవారం జరిగిన ఏడో రౌండ్లో తానియా సచ్దేవ్ (ఎయిరిండియా)తో 124 ఎత్తులపాటు సుదీర్ఘంగా సాగిన గేమ్‌ను ప్రత్యూష ‘డ్రా’ చేసుకోగా... ప్రపంచ అండర్-14 చాంపియన్ వైశాలి (తమిళనాడు) చేతిలో ప్రియాంక ఓడిపోయింది. ఈ టోర్నీలో ప్రత్యూషకిది మూడో ‘డ్రా’ కాగా... ప్రియాంకకు మూడో ఓటమి. ఏడో రౌండ్ తర్వాత ప్రత్యూష ఖాతాలో 4.5 పాయింట్లు, ప్రియాంక ఖాతాలో మూడు పాయింట్లు ఉన్నాయి. 5.5 పాయింట్లతో పద్మిని రౌత్ (ఒడిషా), స్వాతి ఘాటే (ఎల్ఐసీ) సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. -
ప్రత్యూషకు చేజారిన కాంస్యం
అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో ప్రత్యూష 6.5 పాయింట్లతో విజయలక్ష్మి (భారత్), దినారా సాదుకసోవా (కజకిస్తాన్)లతో కలిసి సంయక్తంగా రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు మిత్రా హెజాజిపౌర్ (ఇరాన్), షెన్ యాంగ్ (చైనా) 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్స్‌ను వర్గీకరించగా మిత్రాకు టైటిల్ దక్కగా... షెన్ యాంగ్ రన్నరప్‌గా నిలిచింది. విజయలక్ష్మి మూడో స్థానాన్ని పొందగా... ప్రత్యూషకు నాలుగో స్థానం, దినారాకు ఐదో స్థానం లభించాయి. దినారాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ప్రత్యూష 68 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ప్రత్యూష ఐదు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడింది. ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు లలిత్ బాబు (6 పాయింట్లు), కోనేరు హంపి (5.5 పాయింట్లు), ద్రోణవల్లి హారిక (5 పాయింట్లు) వరుసగా 7, 20వ, 35వ స్థానాల్లో నిలిచారు. సలీమ్ సలే (యూఏఈ), సూర్య శేఖర గంగూలీ (భారత్), సేతురామన్ (భారత్) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు. -
కేసీఆర్ ఇంటికి ప్రత్యూష
-
కేసీఆర్ ఇంటికి ప్రత్యూష
హైదరాబాద్: పినతల్లి, తండ్రి చేతిలో చిత్రహింసల అనుభవించిన ప్రత్యూష తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇంటికి వెళ్లనుంది. ఆమెను కేసీఆర్ ఇంటికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రత్యూషను హైకోర్టులో హాజరుపరిచారు. చీఫ్ జస్టిస్ 25 నిమిషాల పాటు ప్రత్యూషతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ప్రత్యూషను ఎక్కడ ఉంచాలన్న విషయం నిర్ణయిద్దామని న్యాయస్థానం పేర్కొంది. ప్రత్యూషను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సీఎం కేసీఆర్‌ను హైకోర్టు అభినందించింది. సీఎం కలుగ చేసుకోవడం వల్ల ప్రత్యూష లాంటి బాధితులెందరికో భరోసానిస్తుందని న్యాయస్థానం ప్రశంసించింది. ఇటీవల ప్రత్యూష చికిత్స పొందుతున్నఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ దంపతులు పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రత్యూషకు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. ప్రత్యూషను చదివించడంతో పాటు సొంత ఖర్చులతో ఇల్లు కట్టించి, పెళ్లి చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రత్యూష బాధ్యతలను తాను తీసుకుంటున్నట్టు చెప్పారు. -
సొంత ఖర్చుతో ప్రత్యూషకు పెళ్లి చేస్తా: కేసీఆర్
-
సొంత ఖర్చుతో ప్రత్యూషకు పెళ్లి చేస్తా: కేసీఆర్
హైదరాబాద్: సొంత ఖర్చుతో ఇల్లు కట్టించి, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రత్యూషకు హామీ ఇచ్చారు. వైద్యానికి, విద్యకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ చెప్పారు. జరిగిన సంఘటనను ఓ పీడకలగా మరచిపోయి కొత్తజీవితం ఆరంభించాలని ప్రత్యూషకు సూచించారు. సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను శనివారం మధ్యాహ్నం కేసీఆర్ పరామర్శించారు. ప్రత్యూష చికిత్స పొందుతున్న సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్‌కు కేసీఆర్ దంపతులు వెళ్లారు. కేసీఆర్ దంపతులతో పాటు వారి కుమార్తె, ఎంపీ కవిత కూడా వచ్చారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యూషను చిత్ర హింసలు పెట్టినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రత్యూష ఆరోగ్యం, భద్రత చూసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబారాబాద్ పోలీస్ కమిషనర్లను కేసీఆర్ ఆదేశించారు. తనను హింసించిన తండ్రి, సవతి తల్లి జైలు నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రత్యూష.. కేసీఆర్‌ను కోరారు. -
ప్రత్యూషకు కేసీఆర్ దంపతుల పరామర్శ
హైదరాబాద్: సవతి తల్లి, కన్న తండ్రి చేతుల్లో చిత్రహింసలకు గురై తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న ప్రత్యూషను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పరామర్శించారు. శనివారం మధ్యాహ్నం సరూర్ నగర్ లోని అవేర్ గ్లోబల్ హాస్పిటల్‌కు కేసీఆర్ దంపతులు వెళ్లారు. కేసీఆర్ దంపతులతో పాటు వారి కుమార్తె, ఎంపీ కవిత కూడా వచ్చారు. ప్రత్యూష ఆరోగ్య పరిస్థితి గురించి కేసీఆర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యూషకు సంబంధించి అన్ని విషయాలను ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని కేసీఆర్ చెప్పారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రత్యూషను కేసీఆర్ దంపతులు కలవాల్సి ఉన్నా నగరంలో పుష్కరాల వాహనాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్ తో ఆయన ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. ప్రత్యూషను అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఓ సామాన్యురాలిని పరామర్శించడం.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇవ్వడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేశారు. మీడియాలో ప్రత్యూషపై వచ్చిన కథనాలు చూసి చలించిపోయిన కేసీఆర్ అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. తల్లిని కోల్పోయిన ప్రత్యూషను ఎవరూ చేరదీయకపోవడం పట్ల సీఎం కేసీఆర్ ఆవేదన చెందారు. సవతి తల్లి, కన్నతండ్రి పెట్టిన చిత్రహింసలు భరిస్తూ ఆమె నరకం చూసిందంటూ ఇంతకుముందు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ప్రత్యూష పరిస్థితి తనకు తరచూ గుర్తుకొస్తోందన్నారు. దీంతో ప్రత్యూష కు సంబంధించిన అన్ని విషయాలను ఇకపై ప్రభుత్వం తరపున తానే పర్యవేక్షిస్తానని చెప్పారు. -
ప్రత్యూష బాధ్యతలకు 'దుర్గాబాయి దేశ్ ముఖ్'
హైదరాబాద్: ఎట్టకేలకు ప్రత్యూషకు అండగా నిలిచేందుకు ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. ఆమెమంచి చెడులు చూసేందుకు, పూర్తిస్థాయి బాధ్యతలు చూసేందుకు దుర్గాబాయి దేశ్ ముఖ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్ధ శనివారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. కన్నతండ్రి, సవతి తల్లి చేతిలో దారుణంగా చిత్ర హింసలకు గురై ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకున్న విషయం తెలిసిందే. అయితే, ప్రత్యూష పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అందరూ ఉన్నా.. ఆమె సంరక్షణకు ఎవరూ ముందుకు రాకపోవడం బాధకలిగిస్తోందని హైకోర్టు పేర్కొంది. కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు పలువురిని కదిలించాయి. అంతకుముందు ఎవరూ ముందుకు రాకుంటే ప్రత్యూష బాధ్యతలు తాను తీసుకుంటానంటూ నటుడు పోసాని కృష్ణమురళి ముందుకొచ్చిన విషయం తెలిసిందే. -
ప్రత్యూషకు అన్నీ నేనై ఉంటా: పోసాని
-
ప్రత్యూషకు అన్నీ నేనై ఉంటా: పోసాని
హైదరాబాద్: కన్నతండ్రి సవతి తల్లి చేతిలో తీవ్ర చిత్ర హింసలు ఎదుర్కొని ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న ప్రత్యూషకు అన్నీ తానై ఉంటానని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఆమె ఆస్పత్రిలో నుంచి ఢిశ్చార్జి అయినప్పటి నుంచి పెళ్లయ్యే వరకు తానే అన్ని ఖర్చులు భరిస్తానని చెప్పారు. శుక్రవారం సాక్షితో మాట్లాడిన ఆయన ప్రత్యూష బీఎస్సీ చదవాలనకుంటుందని తెలిసిందని, ఆ బీఎస్సీ పూర్తి చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత పోసానిగారు ఇక మీ సాయం చాలు అనేంత వరకు తాను కంటికి రెప్పలా చూసుకుంటానని తెలిపారు. ఈ ఘటన తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ తామంటే తాము ఆదుకుంటామని అన్నవారే తప్ప ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదని చెప్పారు. ఈ విషయం తనను అమితంగా కలిచివేసిందని, ప్రత్యూష ఘటనకు ఎంత చలించిపోయానో, ఎంతగా ఏడ్చానో తనకు, తన భార్యకు మాత్రమే తెలుసునని అన్నారు. సాధారణంగా ఇలాంటి ఘటనలు టీవీలో చూస్తున్నప్పుడు మనకెందుకులే అని చానెల్ మార్చి వేరే ప్రోగ్రాం చూస్తే అసలు మనం మనుషులమే కాదని అన్నారు. మిమ్మల్ని ఇంతగా కదిలించడానికి గల కారణమేమిటని పోసానిని ప్రశ్నించగా.. తాము కూడా ఒకప్పుడు బాగా బతికామని, డబ్బులు అయిపోయాక తన తండ్రి ఇబ్బందులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. దాంతో దొంగనో రౌడీనో కావాల్సిన నేను పరుచూరి బ్రదర్స్ దయతో చక్కటి క్రమశిక్షణ నేర్చుకుని ప్రయోజకుడినయ్యానని తెలిపారు. అప్పటి నుంచే తీవ్ర ఇబ్బందులు పడేవారిని చూస్తే తన గుండె తరుక్కుపోతుందని, వెంటనే స్పందిస్తానని చెప్పారు. తనకే గనుక ప్రత్యూష కేసు విషయంలో తీర్పు ఇచ్చే అవకాశం వస్తే ఆ తండ్రికి, సవతి తల్లికి అదే రోజు ఉరిశిక్ష వేసి, అదే రోజు అమలు చేయాలని చెప్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ సవతి తల్లి ఒక ఆడదేనా అని ప్రశ్నించారు. -
'నాన్నను, పిన్నిని కఠినంగా శిక్షించాలి'
హైదరాబాద్: కన్నతండ్రి, పిన్ని చేతిలో ఘోరంగా చిత్రహింసలు అనుభవించిన ప్రత్యూష తొలిసారి వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఎల్బీ నగర్‌లోని అవేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శుక్రవారం సాక్షితో మాట్లాడింది. తాను వాళ్లకు పుట్టలేదనే కారణంతో ఏడాది కాలంగా తనను టార్చర్ పెడుతూ వచ్చారని వాపోయింది. తనను ప్రతిక్షణం మానసికంగా, శారీరకంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నారని ప్రత్యూష వెల్లడించింది. తన పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయో కూడా తెలియదని, తనలాంటి దుస్థితి మరెవరికి రాకూడదని కన్నీరు మున్నీరైంది. ఇంత ఘోరంగా వేధించిన తన నాన్నకు, పిన్నికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఏడాది కాలంగా గదిలో నిర్బంధించి తండ్రి చిత్ర హింసలు పెట్టడంతో తీవ్రగాయాలయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. -
ఆస్తి కోసమే ప్రత్యూషపై వేధింపులు?
పైశాచికానికి పాల్పడిన పినతల్లికి రిమాండ్ హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ ఆనందనగర్‌కు చెందిన ప్రత్యూషను గృహ నిర్బంధం చేసి చిత్ర హింసలకు గురిచేసిన ఆమె సవతి తల్లి చాముండేశ్వరిని గురువారం ఎల్బీనగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా బీఎస్ఎన్ఎల్లో ఏఈగా పనిచేస్తున్న యువతి తండ్రి రమేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. చాముండేశ్వరి ప్రత్యూషను ఏడాది కాలంగా చిత్రహింసలకు గురిచేస్తుండగా అందుకు రమేష్ సహకరించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న మానవహక్కుల కమిషన్, పోలీసులు బాధితురాలి ఇంటిపై దాడిచేసి ఆమెను బుధవారం గృహనిర్బంధం నుంచి విముక్తికలిగించిన సంగతీ విదితమే. ఈ కేసులో చాముండేశ్వరిని పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న రమేష్‌ను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ప్రత్యూష ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి ఆస్తిపై కన్నేసినందునే ఈ కేసులో ప్రత్యూష పేరిట ఉన్న ఆస్తిని కాజేసేందుకే సవతి తల్లి ఆమెపై అకృత్యాలకు దిగినట్లు తెలుస్తోంది. 2003లో రమేష్‌కుమార్ మొదటి భార్య సరళాదేవి భర్తతో విడిపోయే సమయంలో పద్మారావునగర్‌లో ఉన్న శ్రీరామ్ సీతమ్స్ అపార్ట్మెంటులో ఉన్న ప్లాటును వారి కుమార్తె ప్రత్యూష పేరుమీద రాయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం సరళాదేవి మృతి చెందింది. ఈ క్రమంలో ప్రత్యూషను బంధువులు సత్యసాయి ఆశ్రమంలో చేర్పించారు. 2013లో ప్రత్యూషకు మైనార్టీ తీరడంతో తండ్రి రమేష్ బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో తన ఇంటికి తెచ్చాడు. అయితే పద్మారావునగర్ ప్లాటు విలువ సుమారు రూ.కోటి ఉండడంతో ఆ ఆస్తి ప్రత్యూషకు దక్కుతుందేమోనన్న భయంతో రమేష్ రెండో భార్య చాముండేశ్వరి యువతిని చిత్రహింసలకు గురిచేసేది. ఈ సంఘటనలో రమేష్‌కుమార్ అరెస్ట్ అయితే పూర్తి వివరాలు తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
నేను బాల్కనీలో దాక్కున్నా...
-
నేను బాల్కనీలో దాక్కున్నా...
హైదరాబాద్ : కళ్ల ఎదుటే అమ్మను, చెల్లిని, నాన్నమ్మను... నాన్న దారుణంగా హతమార్చాడు. తనను కూడా చంపేందుకు వస్తున్న తండ్రి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ చిన్నారి బాల్కనీలోకి పరుగెత్తి తలుపు గడియ పెట్టుకుంది. అదృష్టవశాత్తు తండ్రి బారి నుంచి ప్రాణాలతో బయటపడిన ప్రత్యూష.. జరిగిన దారుణాన్ని భయం భయంగా వివరించింది. బాలాపూర్‌లోని సాయినగర్‌లో రామిరెడ్డి అనే వ్యక్తి తల్లి సుభద్ర (65), భార్య రాధిక (40), కుమార్తె అక్షయ (14)లను కత్తితో గొంతుకోసి హతమార్చిన విషయం తెలిసిందే. (చదవండి: కుటుంబ సభ్యులను హతమార్చిన కిరాతకుడు) ఈ ఘటన నుంచి తప్పించుకున్న రామిరెడ్డి పెద్ద కుమార్తె ప్రత్యూష.. మీడియాతో మాట్లాడుతూ 'నిద్రలో ఉన్నా, అయితే ఏమైందో మమ్మీ పెద్దగా ఒర్లింది. డాడీ బయట నుంచి గొళ్లెం పెట్టిండు.. మళ్లీ అక్షయను పిలిచిండు. లోనికి పిలిచి చున్నీతో చంపిండు. ఏమైంది అని నాన్నమ్మ డాడీని అడిగితే ఏం కాలేదన్నడు. ఆ తర్వాత నాన్నమ్మని చంపిండు. నాకు భయం వేసి బాల్కనీలో దాక్కున్నా. డోర్ పెట్టుకున్నా. డాడీ నన్ను కూడా పిలిసిండు. ప్రత్యూష బయటకు రా అని బెదిరించాడు. నాకు మస్తు భయం వేసింది. కింద నుంచి కత్తి వేశాడు. ఇంతలో పెదడాడీ వచ్చాడు. ఏమైందంటే.. నీవెవడ్రా.. వీళ్లను చంపితే నాకు ఆస్తి వస్తుంది. అందుకే చంపేశా అన్నడు. పెదమమ్మీని కూడా తిట్టాడు. ఆ తర్వాత బయటకు వెళ్లిపోయాడు' అని తెలిపింది. కాగా హత్యల అనంతరం పరారీ అవుతూ ఓ వ్యవసాయ బావిలో పడిపోయిన రామిరెడ్డిని పోలీసులు బయటకు తీశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆస్తి తగదాల కారణంగానే అతడు తన కుటుంబ సభ్యులను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు.