
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లికూతురుగా ముస్తాబైంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ గెస్ట్‌హౌజ్‌లో ఈ వేడుక నిర్వహించారు. ఈశాఖ సంయుక్త సంచాలకురాలు కేఆర్‌ఎస్ లక్ష్మీదేవి, సునంద, గిరిజ, శారద, హైదరాబాద్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మోతి తది తరులు ప్రత్యూషను మంగళవాయిద్యాల నడుమ పెళ్లి కూతురుగా అలంకరించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం)
అనంతరం మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 28 ఉదయం 10 గంటలకు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట పాటిగడ్డ గ్రామం వద్ద మేరీమాత ఆలయంలో రాంనగర్‌కు చెందిన చరణ్ రెడ్డితో క్రిస్టియన్ (రోమన్ క్యాథలిక్) సంప్రదాయ పద్ధతిలో ప్రత్యూష వివాహం జరగనుందని మహిళా శిశుసంక్షేమ అధికారులు తెలిపారు. ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజ్ పర్యవేక్షణలో జరిగే ఈ వివాహానికి పలువురు మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు హాజరు కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment