charan reddy
-
దండాలు పెడితే పదవులు రావు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి వెళ్లి దండాలు పెడితే, ఆ నాయకుల అండ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చే రోజులు పోయాయని, గల్లీలో పేదల కోసం పనిచేసే వారికి, కష్టపడే వారికి మాత్రమే పదవులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైరవీలతో పదవులు తెచ్చుకునే సంగతిని మర్చిపోవాలని చెప్పారు. డబ్బులతో ఎన్నికల్లో గెలిచే రోజులు కూడా పోయాయని, నిత్యం ప్రజల్లో ఉండేవారినే గెలుపు వరిస్తుందని అన్నారు.రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్‌రెడ్డి శుక్రవారం గాం«దీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన చాలామంది నాయకులు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో రాణించారని, రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు వంటిదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులపై ఉందన్నారు. కేసీఆర్ బయటకొచ్చి చేసేదేముంది?: కొడితే గట్టిగా కొడదామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారని, ఆయన కొడితే.. రాష్ట్రాన్ని దోచుకున్న అల్లుడు, కొడుకును గట్టిగా కొట్టాలని రేవంత్ అన్నారు. ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడే గట్టిగా బండకేసి కొట్టి ప్రజలు ఓడగొట్టారని, ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి ఆయన చేసేది ఏముందని ఎద్దేవా చేశారు. -
ప్రత్యూష పెళ్లికూతురాయెనె..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లికూతురుగా ముస్తాబైంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ గెస్ట్‌హౌజ్‌లో ఈ వేడుక నిర్వహించారు. ఈశాఖ సంయుక్త సంచాలకురాలు కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సునంద, గిరిజ, శారద, హైదరాబాద్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మోతి తది తరులు ప్రత్యూషను మంగళవాయిద్యాల నడుమ పెళ్లి కూతురుగా అలంకరించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం) అనంతరం మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 28 ఉదయం 10 గంటలకు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట పాటిగడ్డ గ్రామం వద్ద మేరీమాత ఆలయంలో రాంనగర్‌కు చెందిన చరణ్ రెడ్డితో క్రిస్టియన్ (రోమన్ క్యాథలిక్) సంప్రదాయ పద్ధతిలో ప్రత్యూష వివాహం జరగనుందని మహిళా శిశుసంక్షేమ అధికారులు తెలిపారు. ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజ్ పర్యవేక్షణలో జరిగే ఈ వివాహానికి పలువురు మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు హాజరు కానున్నారు. -
టై తో 9వ తరగతి విద్యార్థి ఉరి...
-
టై తో ఉరేసుకున్న విద్యార్థి..
సాక్షి, కడప : వైఎస్ఆర్ జిల్లా కడపలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారులోని మాంట్ ఫోర్ట్ ప్రయివేట్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 9వ తరగతి చదువుతున్న చరణ్ రెడ్డి అనే విద్యార్థి టైతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యపై స్కూల్ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. చరణ్ రెడ్డి తల్లిదండ్రులతో పాటు, పోలీసులకు సమాచారం అందించలేదు. హడావిడిగా మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం అందుబాటులోకి లేకపోవడంపై చరణ్ రెడ్డి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కడపలో విషాదం, టై తో విద్యార్థి ఉరి -
ఐపీఎస్ ఫోన్‌నే ట్యాప్ చేస్తారా?
► ఇదేమి పరిపాలన ► బాధ్యులపై చర్యలు తీసుకోరెందుకు? ► విధానసభలో బీజేపీ పక్షనేత శెట్టర్ ► ఐజీపీ చరణ్‌రెడ్డి ఫోన్‌ను డీసీపీ హిలోరియా ట్యాప్ చేయడంపై ఆగ్రహం సాక్షి, బెంగళూరు: ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ల ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం బుధవారం విధానసభలో ప్రతిధ్వనించింది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ – పార్టీ, ప్రధాన విపక్షమైన బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జీరో అవర్‌లో బీజేపీ పక్షనేత జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... ఐజీపీ అయిన చరణ్‌రెడ్డి ఫోన్‌కాల్‌ను డీసీపీ అజయ్ హిలోరియా అక్రమంగా ట్యాప్ చేసి ఆ వివరాలను బహిరంగ పరడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. దీని వల్ల రాష్ట్రంలో పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ ఘటన జరిగి దాదాపు ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకూ బాధ్యులపై ఎందుకు చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనపై సర్కారుకు పట్టు లేకపోతే నిజాయితీగల అధికారులు స్వతంత్రంగా పనిచేయలేరన్నారు. ‘అసలు ఫోన్ ట్యాపింగ్‌కు అనుమితి ఇచ్చింది ఎవరు? ఒక వేళ అనుమతి లేకుండానే ఫోన్ ట్యాప్ చేయడం నేరం కాదా? ఆ యంత్ర పరికరాలు ఎలా సమకూర్చుకున్నారు.?’ అన్న విషయాల పై ప్రభుత్వం వెంటనే బహిరంగంగా సమాధానం చెప్పాలన్నారు. ఉగ్రవాదులు, మావోయిస్టుల ఫోన్లను ట్యాప్ చేయడం చూశాంకాని ఐపీఎస్ అధికారుల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఈ సమయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే స్పీకర్ కోళివాడ సర్దిచెప్పారు. మంత్రి ఎం.బీ పాటిల్ మాట్లాడుతూ పాలనా వ్యవస్థ పై ప్రభుత్వానికి పట్టు లేదనడం సరికాదన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయమై శాసనసభకు ప్రభుత్వం తరఫున స్పష్టతనిస్తామని తెలిపారు. ఇదీ ట్యాపింగ్ కథ గత ఏడాది సెప్టెంబర్‌లో కావేరి నదీ జలాల వివాద సమయంలో ఆందోళనకారులు బెంగళూరులో విధ్వంసానికి పాల్పడ్డారు. ఆ సమయంలో అదనపు పోలీస్ కమిషనర్‌గా ఉన్న చరణ్‌రెడ్డి పశ్చిమ విభాగ డీసీపీ అజయ్ హిలోరితో నగరంలో పరిస్థితులు శృతి మించకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఫోన్లో చర్చించారు. అనుమానితుల ఫోన్లపై నిఘా ఉంచాలని కూడా చర్చించారు. విధ్వంసానికి పాల్పడ్డట్లు ఆరోపణలు రావడంతో బ్యాటరాయనపుర పోలీసులు అరెస్ట్ చేసిన కన్నడ సంఘానికి చెందిన కార్యకర్త ప్రకాశ్‌ను విడుదల చేయాలంటూ చరణ్‌రెడ్డి డీసీపీ అజయ్‌హిలోరికి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఫోన్ సంభాషణను డీసీపీ అజయ్ హిలోరీ ఓ విలేఖరికి అందించారంటూ అదనపు కమిషనర్ చరణ్‌రెడ్డి అప్పటి డీజీపీ ఓం ప్రకాశ్‌కు ఫిర్యాదు చేశారు. కొద్దిరోజులకే ఓంప్రకాశ్ రిటైర్ కావడంతో తదుపరి డీజీపీ ఆర్కె దత్తా... చరణ్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌సూద్‌ను ఆదేశించారు.