
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడైన శివచరణ్‌రెడ్డితో సీఎం రేవంత్ విజయ సంకేతం
గల్లీలో పేదల కోసం పనిచేసే వారికే పదవులు: సీఎం రేవంత్‌రెడ్డి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన శివచరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి వెళ్లి దండాలు పెడితే, ఆ నాయకుల అండ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చే రోజులు పోయాయని, గల్లీలో పేదల కోసం పనిచేసే వారికి, కష్టపడే వారికి మాత్రమే పదవులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైరవీలతో పదవులు తెచ్చుకునే సంగతిని మర్చిపోవాలని చెప్పారు. డబ్బులతో ఎన్నికల్లో గెలిచే రోజులు కూడా పోయాయని, నిత్యం ప్రజల్లో ఉండేవారినే గెలుపు వరిస్తుందని అన్నారు.
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్‌రెడ్డి శుక్రవారం గాం«దీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన చాలామంది నాయకులు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో రాణించారని, రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు వంటిదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులపై ఉందన్నారు.
కేసీఆర్ బయటకొచ్చి చేసేదేముంది?: కొడితే గట్టిగా కొడదామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారని, ఆయన కొడితే.. రాష్ట్రాన్ని దోచుకున్న అల్లుడు, కొడుకును గట్టిగా కొట్టాలని రేవంత్ అన్నారు. ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడే గట్టిగా బండకేసి కొట్టి ప్రజలు ఓడగొట్టారని, ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి ఆయన చేసేది ఏముందని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment