Youth President
-
దండాలు పెడితే పదవులు రావు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీకి వెళ్లి దండాలు పెడితే, ఆ నాయకుల అండ ఉందంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చే రోజులు పోయాయని, గల్లీలో పేదల కోసం పనిచేసే వారికి, కష్టపడే వారికి మాత్రమే పదవులు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పైరవీలతో పదవులు తెచ్చుకునే సంగతిని మర్చిపోవాలని చెప్పారు. డబ్బులతో ఎన్నికల్లో గెలిచే రోజులు కూడా పోయాయని, నిత్యం ప్రజల్లో ఉండేవారినే గెలుపు వరిస్తుందని అన్నారు.రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్‌రెడ్డి శుక్రవారం గాం«దీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. యువజన కాంగ్రెస్‌లో పనిచేసిన చాలామంది నాయకులు జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో రాణించారని, రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ మొదటి మెట్టు వంటిదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులపై ఉందన్నారు. కేసీఆర్ బయటకొచ్చి చేసేదేముంది?: కొడితే గట్టిగా కొడదామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారని, ఆయన కొడితే.. రాష్ట్రాన్ని దోచుకున్న అల్లుడు, కొడుకును గట్టిగా కొట్టాలని రేవంత్ అన్నారు. ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడే గట్టిగా బండకేసి కొట్టి ప్రజలు ఓడగొట్టారని, ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి ఆయన చేసేది ఏముందని ఎద్దేవా చేశారు. -
ములుగులో సీఎం కేసీఆర్
ములుగు (గజ్వేల్): మండల టీఆర్ఎస్ యూత్ విభాగ అధ్యక్షుడు బట్టు అంజిరెడ్డి తల్లి వజ్రమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం హాజరయ్యారు. పది రోజుల క్రితం ఆమె అనారోగ్యంతో మృతి చెందా రు. ఈ సందర్భంగా అంజిరెడ్డిని సీఎం పరామర్శించారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితుడు, ఎర్రవల్లి ఫాంహౌస్ ఇన్చార్జి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ జహంగీర్ ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. -
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్‌కుమార్
హైదరాబాద్: రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎం.అనిల్‌కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలను శనివారం ప్రకటించారు. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల్లో అధ్యక్షపదవికోసం ఐదుగురు పోటీపడ్డారు. సమీప ప్రత్యర్థి రవికుమార్ యాదవ్‌పై అనిల్‌కుమార్ 1,856 ఓట్ల తేడాతో గెలుపొందారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అయిన అనిల్‌కుమార్‌కు ఈ ఎన్నికల్లో 4,379 ఓట్లు రాగా, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌కు 2,523 ఓట్లు వచ్చాయి. మిగిలిన వారికి చెప్పుకోదగిన ఓట్లు రాలేదు.