
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనిల్‌కుమార్
హైదరాబాద్: రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎం.అనిల్‌కుమార్ యాదవ్ ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలను శనివారం ప్రకటించారు. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల్లో అధ్యక్షపదవికోసం ఐదుగురు పోటీపడ్డారు.
సమీప ప్రత్యర్థి రవికుమార్ యాదవ్‌పై అనిల్‌కుమార్ 1,856 ఓట్ల తేడాతో గెలుపొందారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అయిన అనిల్‌కుమార్‌కు ఈ ఎన్నికల్లో 4,379 ఓట్లు రాగా, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ కుమారుడు రవికుమార్ యాదవ్‌కు 2,523 ఓట్లు వచ్చాయి. మిగిలిన వారికి చెప్పుకోదగిన ఓట్లు రాలేదు.