Mehndi Function
-
పెళ్లి సందడి షురూ.. ఘనంగా వరలక్ష్మి మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)
-
పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ.. మెహందీ ఫోటో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతుంది. రేపే(జూన్ 23) వీరి పెళ్లి జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రహస్యంగానే పెళ్లి పనులు షూరు చేశారు. తాజాగా ముంబైలోని సోనాక్షి ఇంట మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలా ప్రేమలో పడి.. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో సోనాక్షి, ఇక్బాల్ జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ విషయాన్ని మాత్రం బహిరంగంగా ప్రకటించాలేదు. బాలీవుడ్లో వార్తలు వచ్చిన స్పందించకపోవడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం అందరికి తెలిసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇటీవల తరచు వినిపించాయి. కానీ సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా మాత్రం...తన కూతురు ప్రేమ, పెళ్లి గురించి తెలియదని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఈ పెళ్లి అతనికి ఇష్టంలేదనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల కాబోయే అల్లుడుని హత్తుకొని ఫోటో దిగి.. తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని చెప్పకనే చెప్పారు. అంతేకాదు తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లినే తానే దగ్గరుండి ఘనంగా చేస్తానని ప్రకటించాడు. View this post on Instagram A post shared by Prachi Mishra Raghavendra (@mishraprachi) -
హీరో వెంకటేశ్ ఇంట పెళ్లి సంబరాలు.. మెహందీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయ్ (ఫోటోలు)
-
మంచు మనోజ్- మౌనికల మెహందీ ఫంక్షన్ (ఫొటోలు)
-
కత్రీనా పెళ్లి వేడుకలు.. ఎన్ని కిలోల మెహందీ వాడారంటే ?
To Katrina Kaif Wedding Nearly 20 Kg Of Organic Mehndi Powder Sent: బీటౌన్‌లో హాట్ టాపిక్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ ప్రేమ వివాహం. 38 ఏళ్ల కత్రీనా కైఫ్, 33 సంవత్సరాల విక్కీ కౌశల్ ఒక ఏడాదికిపైగా డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విక్ట్రీనా (విక్కీ కౌశల్-కత్రీనా కైఫ్‌లను అభిమానులు ప్రేమగా పిలుచుకునే పేరు) వివాహ వేడుకలు మంగళవారం (డిసెంబర్ 7) నుంచి ప్రారంభమయ్యాయి. కత్రీనా కైఫ్, కౌశల్ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులతో సోమవారం సాయంత్రం ముంబై నుంచి జైపూర్‌కు వెళ్లారు. రెండు కుటుంబాలు 15 కంటే ఎక్కువ కార్లతో కూడిన కాన్వాయ్‌లో నేరుగా జైపూర్ నుంచి సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్‌కు చేరుకున్నారు. సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ హోటల్లో జరుగుతున్న ఈ వేడుకలకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కత్రీనాకు సన్నిహితుడు చిత్ర దర్శకుడు కబీర్ ఖాన్, అతని భార్య మినీ మాథూర్, దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార, నేహా ధూపియా-అంగద్ బేడీ దంపతులు, తదితరులు జైపూర్‌కు చేరుకున్నారని సమాచారం. మంగళవారం ఉదయం విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్ స్నేహితుడు శర్వారీ వాఘ్, రాధిక మదన్ కూడా హాజరయ్యారు. జైపూర్‌కు నుంచి సుమారు 120 కిలో మీటర్లు దూరం ఉన్న ఈ హోటల్‌కు ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ఎహసాన్ నూరానీ, పంజాబీ గాయకుడు గురుదాస్ మాన్ కూడా బుధవారం ఉదయం చేరుకున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకల్లో భాగమైన మెహందీ ఫంక్షన్‌కు సుమారు 20 కిలోల ఆర్గానిక్ మెహందీ పౌడర్ సరఫరా చేశారట. ఈ మెహందీని రాజస్థాన్‌లోని పాలి జిల్లా సోజత్ పట్టణం నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు సమాచారం. అలాగే సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో జరగనున్న విక్ట్రీనా పెళ్లికి మెహందీ పౌడర్‌తో పాటు 400 మెహందీ కోన్లు పంపించారట. అయితే ఈ సోజత్ పట్టణం మెహందీ సాగుకు ప్రసిద్ధి. ఈ వివాహ కార్యక్రమం కోసం ఈ ఆర్గానిక్ మెహందీ ప్రాసెస్ చేయడానికి సుమారు 20 రోజులు పట్టిందని సోజత్‌లో మెహందీ తయారీ కంపెనీ అయినా 'నెచురల్ హెర్బల్' యజమాని నితేష్ అగర్వాల్ తెలిపారు. ఇదీ చదవండి: పెళ్లి ఫుటేజ్ కోసం రూ. 100 కోట్లు ఆఫర్.. ఎందుకో తెలుసా ? -
ఒక్కటైన గుత్తా జ్వాల- విష్ణు విశాల్ జంట
-
ప్రత్యూష పెళ్లికూతురాయెనె..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దత్త పుత్రిక ప్రత్యూష పెళ్లికూతురుగా ముస్తాబైంది. రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం బేగంపేటలోని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ గెస్ట్‌హౌజ్‌లో ఈ వేడుక నిర్వహించారు. ఈశాఖ సంయుక్త సంచాలకురాలు కేఆర్ఎస్ లక్ష్మీదేవి, సునంద, గిరిజ, శారద, హైదరాబాద్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మోతి తది తరులు ప్రత్యూషను మంగళవాయిద్యాల నడుమ పెళ్లి కూతురుగా అలంకరించారు. సంప్రదాయ పద్ధతుల్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖకు చెందిన అధికారులు, ఉద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. (28న సీఎం దత్త పుత్రిక ప్రత్యూష వివాహం) అనంతరం మెహందీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనెల 28 ఉదయం 10 గంటలకు షాద్‌నగర్ సమీపంలోని కేశంపేట పాటిగడ్డ గ్రామం వద్ద మేరీమాత ఆలయంలో రాంనగర్‌కు చెందిన చరణ్ రెడ్డితో క్రిస్టియన్ (రోమన్ క్యాథలిక్) సంప్రదాయ పద్ధతిలో ప్రత్యూష వివాహం జరగనుందని మహిళా శిశుసంక్షేమ అధికారులు తెలిపారు. ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజ్ పర్యవేక్షణలో జరిగే ఈ వివాహానికి పలువురు మంత్రులతో పాటు ఐఏఎస్ అధికారులు హాజరు కానున్నారు. -
వేడుకల వేళ... ఆనందాల హేల
కుమారి కాజల్ అగర్వాల్ శ్రీమతి కాజల్ అవుతున్న రోజు రానే వచ్చింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో నేడు కాజల్ వివాహం జరగనుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, తక్కువమంది సమక్షంలో ముంబైలో వివాహ వేడుక ప్లాన్ చేశారు. గౌతమ్ కిచ్లుతో తన వివాహం కుదిరినట్లు అక్టోబర్ 6న కాజల్ అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పెళ్లి పనులతో బిజీ అయ్యారు. పెళ్లి కాగానే కొత్తింట్లోకి మారబోతున్నారు కాజల్, గౌతమ్. పెళ్లి షాపింగ్, ఆ ఇంటి పనులు చూసుకుంటూ, వేడుకలు చేసుకుంటూ ఈ జంట బిజీ బిజీగా గడిపారు. వారం రోజులుగా కాజల్, గౌతమ్ ఇంట్లో పెళ్లికి ముందు జరిగే వేడుకలను నిర్వహించారు. ఆ వేడుకల గురించి తెలుసుకుందాం. కాజల్, గౌతమ్ కిచ్లు నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో కొన్ని రొజుల క్రితం జరిగింది. ఆ తర్వాత కాజల్ తన చెల్లెలు నిషా, స్నేహితులతో కలిసి బ్యాచిలరెట్ పార్టీ చేసుకున్నారు. గౌతమ్ కిచ్లుతో కలిసి ఇటీవల దసరా పండగ జరుపుకున్నారు కాజల్. ‘‘రెండు రోజుల్లో మిసెస్ కాబోయే ముందు ‘మిస్’గా ఉన్నప్పుడు జరుపుకున్న ‘పైజామా పార్టీ’’ అంటూ తన చెల్లెలు నిషా, ఆమె కుమారుడితో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు కాజల్. గురువారం మెహందీ ఫంక్షన్ తాలూకు ఫొటోను పంచుకున్నారు. అదే రోజున ‘హల్దీ’ ఫంక్షన్ కూడా జరిగింది. పెళ్లికి ముందు పెళ్లి కూతురిని చేస్తారనే సంగతి తెలిసిందే. కాజల్‌ని కూడా గురువారం పెళ్లి కూతుర్ని చేశారు. ఆట పాటలతో.. సంగీత్ లేని పెళ్లి వేడుకలు చాలా అరుదు. పెళ్లి రోజునే సంగీత్ని ప్లాన్ చేశారు. ‘‘పెళ్లి వేడుకలన్నీ తక్కువమంది సమక్షంలో అయినప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేశాం. పెళ్లి రోజునే సంగీత్ ప్లాన్ చేశాం. ఆటపాటల హంగామా తప్పనిసరిగా ఉంటుంది’’ అని కాజల్ చెల్లెలు నిషా పేర్కొన్నారు. నటనకు దూరం కావడంలేదు ‘‘కొన్నేళ్లుగా నా మీద ఎంతో అభిమానం చూపించారు. ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాను. అందరి ఆశీర్వాదాలు కావాలి’’ అంటూ గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని ప్రకటించినప్పుడు కాజల్ పేర్కొన్నారు. ‘‘మీ కొత్త ప్రయాణానికి మా శుభాకాంక్షలు’’ అని అభిమానులు పేర్కొన్నారు. తమ అభిమాన కథానాయిక పెళ్లి చేసుకోవడం అభిమానులు ఆనందపడే విషయం. అలాగే పెళ్లి తర్వాత కాజల్ సినిమాలకు దూరం కావాలనుకోవడంలేదు. ఇది అభిమానులకు రెండింతలు ఆనందాన్నిస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
పెళ్లి సందడి షురూ
హీరో నితిన్, షాలినీల పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. కరోనా కారణంగా వారి పెళ్లిని నిరాడంబరంగా చేయాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం రాత్రి 8:30 గంటలకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరగనుంది. ఈ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొద్ది మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో ఇటీవల నిశ్చితార్థం కూడా సింపుల్‌గా జరిపారు. పెళ్లి వేడుకల్లో భాగంగా మెహందీ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం నితిన్ ని పెళ్లి కొడుకుని చేశారు. ఈ వేడుకకు హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్, హారికా అండ్ హాసినీ క్రియేష¯Œ ్స నిర్మాత చినబాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ‘‘నన్ను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా ఆశీర్వదించడానికి పవర్‌స్టార్, త్రివిక్రమ్, చినబాబుగార్లు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వారికి ధన్యవాదాలు’’ అన్నారు నితిన్. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మెహందీలో మెరిసిన షాలిని-నితిన్
హైదరాబాద్ : యంగ్ హీరో నితిన్ పెళ్లి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఆదివారం రాత్రి 8.30 నితిన్-షాలినిలు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత తాజ్ ఫలక్‌నుమా హోటల్లో ఈ వేడుక జరుగనుంది. ఈ క్రమంలో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అదిరిపోయేలా నిర్వహిస్తున్నారు. తాజాగా మెహందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నితిన్ స్నేహితురాలు, ప్రముఖ స్టైలిస్ట్ డిజైనర్ కోన నీరజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.(నితిన్ ఎంగేజ్మెంట్తో వేడుకలు షురూ) ఈ వేడుకలో చేతులకు మెహందీ పెట్టుకున్న షాలిని.. రెడ్ కలర్ లెహంగాలో మెరిసిపోయారు. నితిన్ బ్లూ కలర్ కుర్తాలో కళ్లకు డిఫరెంట్ గాగూల్స్ పెట్టి స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మరోవైపు ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా.. పరిమిత అతిథుల సమక్షంలో షాలిని మెడలో నితిన్ మూడు మూళ్లు వేయనున్నారు. సినీ పరిశ్రమ నుంచి హీరోలు పవన్ కల్యాణ్, వరుణ్ తేజ్, దర్శకుడు త్రివిక్రమ్.. నితిన్-షాలినిల వివాహా వేడుకలకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కూడా నితిన్ తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. (నితిన్ పెళ్లికి టైమ్ ఫిక్స్) -
నటి పెళ్లి సందడి మొదలైంది.. వైరల్
సాక్షి, త్రిసూర్: దక్షిణాది నటి భావన మరికొన్ని గంటల్లో చిరకాల మిత్రుడు, శాండిల్‌వుడ్ ప్రొడ్యూసర్ నవీన్‌ను వివాహం చేసుకోనున్నారు. నటి కుటుంబంలో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి రెండు రోజుల ముందు కొందరు సన్నిహితుల సమక్షంలో శనివారం భావన మెహందీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్లో తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పసుపు రంగు దుస్తుల్లో మేలిమి బంగారంలా భావన ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతేడాది మార్చి 9న నవీన్, భావనల ఎంగేజ్మెంట్ జగిన సంగతి విదితమే. కాగా చాలాకాలం తర్వాత కేరళలోని త్రిసూర్ లో 'లులు కన్వెన్షన్ సెంటర్'లో రేపు (జనవరి 22న) వీరి వివాహం జరిపేందుకు అంతా సిద్ధం చేశారు. వీరి మిత్రులు, బంధువులు, సన్నిహితులు ఇప్పటికే ఒక్కొక్కరుగా త్రిసూరు చేరుకుంటున్నారు. మెహందీ ఫంక్షన్ నటి భావన స్వగృహంలో చేసినట్లు సమాచారం. సోమవారం భావన వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొందరిని మాత్రమే వివాహానికి ఆహ్వానించామని, చాలా సింపుల్‌గా శుభకార్యం నిర్వహించనున్నట్లు నటి కుటుంసభ్యులు తెలిపారు. -
బెని‘గిఫ్ట్’!
పెళ్లొకరిది... గిఫ్ట్ ఇంకొకరిదంటే ఇదే మరి! ఆడపడచు సోహా అలీఖాన్ మెహందీ ఫంక్షన్లో బాలీవుడ్ కలల రాణి కరీనా కపూర్‌కు ఓ అపురూప బహుమతి దక్కింది. ఇచ్చింది కూడా తన అక్క కరిష్మానే! సోహా మెహందీ సందర్భంగా... వారసత్వంగా వస్తున్న అమ్మమ్మ కృష్ణారాజ్‌కపూర్ రింగ్‌ను చెల్లికి మురిపెంగా ప్రజెంట్ చేసింది కరిష్మా. ఈ ఉంగరాన్ని ఇరవై ఏళ్ల కిందట కృష్ణ... కరిష్మాకు ఇచ్చిందట. ప్రస్తుతం కరణ్‌జోహార్ చిత్రం షూటింగ్లో క్షణం తీరిక లేకుండా ఉన్న కరీనా... సోహా ఫంక్షన్‌కు వచ్చి వెళ్లిపోయిందట. ఈ కార్యక్రమంలో అక్కాచెల్లెళ్లు కరిష్మా, కరీనా ఎంతో ఆప్యాయంగా గడిపారనేది ఓ వెబ్సైట్ కథనం. -
అంతంత ఖర్చు అవసరమా?
పెళ్లి సందర్భంగా అమ్మాయికి పెట్టే నగలు, వస్త్రాలు, అలంకరణ... అన్నీ ఖరీదైనవే. వాటికి ఖర్చుపెట్టే లక్షల సొమ్ముని దంపతుల భవిష్యత్తు కోసం జాగ్రత్త చేస్తే ఎంత ఉపయోగంగా ఉంటుంది చెప్పండి! మొన్నామధ్య మా బంధువులమ్మాయి పెళ్లి పిలుపు వచ్చింది. పెళ్లి పత్రిక ఓ చిన్నసైజు ఇంగ్లీషు మ్యాగజైన్‌లా ఉంది. పత్రికే ఇలా ఉందంటే... ఇక పెళ్లి హడావిడి ఎలా ఉంటుందో అనుకున్నాను. అయితే నేనూహించినదానికంటే పదిరెట్లు ఎక్కువ హంగామా ఉందక్కడ. పెళ్లి సెట్‌కోసం ప్రత్యేకంగా ఒక ఆర్ ్డడెరైక్టర్ని మాట్లాడుకున్నారట. పెళ్లి సెట్‌కి వాళ్లు పెట్టిన ఖర్చు తెలిస్తే....పెళ్లికి బంధువులకంటే ముందు ఇన్కమ్టాక్స్వాళ్లు వస్తారు. పెళ్లయిపోయాక అందరూ బయలుదేరుతున్నారు. నేను పెళ్లికూతురు తరపున కదా! చివరిదాకా ఉన్నాను. పెళ్లివాళ్లంతా వెళ్లిపోయాక సెట్టింగ్వాళ్లు దిగారు. వస్తూనే సెట్‌నంతా ఓ నాలుగుగంటల్లో విప్పేశారు. ‘ఈ కాస్త దానికి... ఏకంగా అంత డబ్బు ఖర్చుపెట్టారా...’ అనుకుని నేను కూడా వెనుదిరిగాను. అన్నట్టు... భోజనాల గురించి చెప్పలేదు కదా! ఒక్కో ప్లేటు 1500 రూపాయల ఖరీదట. అంటే ఒక మనిషి తినే తిండి ఖర్చన్నమాట. ‘భోజనాలు అదరగొట్టార్రా...’ అనే కామెంట్ బాగానే ఉంటుంది కానీ, 1500 రూపాయలకి చక్కని భోజనం ఎంతమంది చేయొచ్చనే కనీస ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది కదా! వీటన్నిటికంటే ప్రవేశద్వారం దగ్గర ఓ నలుగురమ్మాయిలు ఖరీదైన చీరలతో అచ్చం సినిమా తారల్లా ముస్తాబయి, వచ్చినవారిపై అత్తరు చల్లుతున్నారు. బంధువులనుకుంటారేమో...కాదు, ఈవెంట్ మేనేజర్ చేసిన ఏర్పాట్లలో వారు కూడా ఒకటన్నమాట. ఇవన్నీ అతిథులకోసం చేసిన హంగామా. ఇక పెళ్లికూతురు ఇంట్లో హంగామా దీనికి రెట్టింపు. నార్త్ నుంచి దిగుమతి అయిన మెహందీ ఫంక్షన్ గురించి వినే ఉంటారు మీరు. గోరింటాకు పెట్టుకునేటప్పుడు కూడా ఖర్చు లక్షల్లోనే ఉంటోంది. పెళ్లిచీర అరకోటికి పైగా ఉంటోంది. పెళ్లి సందర్భంగా అమ్మాయికి పెట్టే నగలు, వస్త్రాలు, అలంకరణ...అన్నీ ఖరీదైనవే. వాటికి ఖర్చుపెట్టే లక్షల సొమ్ముని దంపతుల భవిష్యత్తు కోసం జాగ్రత్త చేస్తే ఎంత ఉపయోగంగా ఉంటుంది చెప్పండి! పెళ్లికి వచ్చిన బంధువులకి మేకప్ చేయడం కోసం పార్లర్ సిబ్బందికి ఇచ్చే డబ్బుతో ఓ పేదవాడి పెళ్లయిపోతుందని మా స్నేహితుడెవరో అంటే నేను నమ్మలేదు. నా కళ్లతో చూశాక నమ్మక తప్పలేదు. పచ్చని పందిట్లో ఆకు నిండా పలహారాలతో భోజనం పెట్టి ఓ పూటలో ముగించే పెళ్లితంతుని ఐదురోజుల పెళ్లి, ఏడు రోజుల పెళ్లి.. అంటూ బోలెడంత హంగామా చేస్తున్నారు. పెళి ్లపేరుతో ఇన్నివేల మంది పేదలకు ఉచితంగా భోజనం పెట్టాం, ఉచితంగా బట్టలు పంచాం అని చెప్పుకుంటే కూడా గొప్పగానే ఉంటుంది. అలాంటి పనులను గొప్పగా చెప్పుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాను. డబ్బున్నవారిని చూసి మధ్యతరగతివారి మతులు చెడుతున్నాయి. వారికున్నదానితో సరిపెట్టకుండా... ఓ నాలుగో, ఐదో కట్టలు ఎక్కువ ఖర్చుపెట్టి తర్వాత తలపట్టుకుంటున్నారు. మొత్తానికి పెళ్లి వెల పెరుగుతోంది. -ఎస్. రామారావు, హైదరాబాద్