పెళ్లికి స్టార్‌ హీరోయిన్‌ రెడీ.. మెహందీ ఫోటో వైరల్‌ | Sonakshi Sinha And Zaheer Iqbal Mehndi Celebration Pics Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

పెళ్లికి స్టార్‌ హీరోయిన్‌ రెడీ.. మెహందీ ఫోటో వైరల్‌

Published Sat, Jun 22 2024 4:04 PM | Last Updated on Sat, Jun 22 2024 5:45 PM

Sonakshi Sinha And Zaheer Iqbal Mehndi Celebration Pics Goes Viral

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్‌ నటుడు జహీర్‌ ఇక్బాల్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతుంది. రేపే(జూన్‌ 23) వీరి పెళ్లి జరుగుతుందని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రహస్యంగానే పెళ్లి పనులు షూరు చేశారు. తాజాగా ముంబైలోని సోనాక్షి ఇంట మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు.  ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

అలా ప్రేమలో పడి.. 
‘డబుల్‌ ఎక్స్‌ఎల్‌’ సినిమాలో సోనాక్షి, ఇక్బాల్‌ జంటగా నటించారు.  ఆ మూవీ షూటింగ్‌ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ విషయాన్ని మాత్రం బహిరంగంగా ప్రకటించాలేదు. బాలీవుడ్‌లో వార్తలు వచ్చిన స్పందించకపోవడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం అందరికి తెలిసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇటీవల తరచు వినిపించాయి.

 కానీ సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా మాత్రం...తన కూతురు ప్రేమ, పెళ్లి గురించి తెలియదని చెప్పడంతో అంతా షాకయ్యారు.  ఈ పెళ్లి అతనికి ఇష్టంలేదనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల కాబోయే అల్లుడుని హత్తుకొని ఫోటో దిగి.. తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని చెప్పకనే చెప్పారు. అంతేకాదు తన  ఒక్కగానొక్క కుమార్తె పెళ్లినే తానే దగ్గరుండి ఘనంగా చేస్తానని ప్రకటించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement