Shatrugan Sinha
-
పెళ్లికి స్టార్ హీరోయిన్ రెడీ.. మెహందీ ఫోటో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతోంది. బాలీవుడ్ నటుడు జహీర్ ఇక్బాల్‌ను ప్రేమ వివాహం చేసుకోబోతుంది. రేపే(జూన్ 23) వీరి పెళ్లి జరుగుతుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, పెళ్లి గురించి ఈ జంట ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. రహస్యంగానే పెళ్లి పనులు షూరు చేశారు. తాజాగా ముంబైలోని సోనాక్షి ఇంట మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలా ప్రేమలో పడి.. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో సోనాక్షి, ఇక్బాల్ జంటగా నటించారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ విషయాన్ని మాత్రం బహిరంగంగా ప్రకటించాలేదు. బాలీవుడ్లో వార్తలు వచ్చిన స్పందించకపోవడంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం అందరికి తెలిసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే వార్తలు ఇటీవల తరచు వినిపించాయి. కానీ సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా మాత్రం...తన కూతురు ప్రేమ, పెళ్లి గురించి తెలియదని చెప్పడంతో అంతా షాకయ్యారు. ఈ పెళ్లి అతనికి ఇష్టంలేదనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఇటీవల కాబోయే అల్లుడుని హత్తుకొని ఫోటో దిగి.. తమ మధ్య ఎలాంటి విభేధాలు లేవని చెప్పకనే చెప్పారు. అంతేకాదు తన ఒక్కగానొక్క కుమార్తె పెళ్లినే తానే దగ్గరుండి ఘనంగా చేస్తానని ప్రకటించాడు. View this post on Instagram A post shared by Prachi Mishra Raghavendra (@mishraprachi) -
ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార రహిత రాష్ట్రాలు.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో ఉప ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. చాలాచోట్ల విజయ సంబురాలు జరుగుతున్నప్పటికీ.. ఈసీ అధికారిక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్ అసెంబ్లీ స్థానాల్లో.. శతృఘ్నసిన్హా, బాబుల్ సుప్రియోలు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దాదాపు వీళ్ల విజయం ఖాయమైంది. అసన్సోల్.. ఇది వరకు బీజేపీ సీటు. ఈ నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు విజయోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. I sincerely thank the electors of the Asansol Parliamentary Constituency and the Ballygunge Assembly Constituency for giving decisive mandate to AITC party candidates. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) April 16, 2022 ► నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో.. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఒకటి టీఎంసీ, రెండు కాంగ్రెస్, ఒకటి ఆర్జేడీ(విజయం) ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► ఇక బీహార్‌లో లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ బబోచాహన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఘన విజయం సాధించింది. ఆర్జేడీ అభ్యర్థి అమర్ కుమార్‌పాశ్వాన్ గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. ► ఛత్తీస్‌గఢ్ ఖాయిరాగఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి యశోధ నీలాంబర్ వర్మ ముందజంలో కొనసాగుతున్నారు. ► మహారాష్ట్ర కోల్హాపూర్(నార్త్) అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జైశ్రీ చంద్రకాంత్(అన్నా) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
‘ఆమె ఆడపులి.. రెచ్చగొట్టకండి’
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వానికి, మమతా బెనర్జీ సర్కారుకు మాటల యుద్ధం సాగుతోన్న విషయం తెలిసిందే. బెంగాల్లో హింసపై కేంద్రహోంశాఖ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మమత వ్యతిరేకంగా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విధితమే. అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మమత,, జై శ్రీరాం అన్న వారందరినీ అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ శతృఘ్న సిన్హా మమతకు మద్దతుగా నిలిచారు. ఆమె బెంగాల్ ఆడపులని.. ఆమెను రెచ్చగొట్టవద్దని అన్నారు. ‘ఇప్పటిదాకా చేసింది చాలు. బెంగాల్ నేల నుంచి వచ్చిన గొప్ప నేత, ఆడపులి మమతాబెనర్జీ. ఆమెను రెచ్చగొట్టే విధంగా అనవసర ప్రయత్నాలు వద్దు. ఈ డ్రామాలు, పోస్టుకార్డు యుద్ధాలు ఇక ఆగాలి. మతం పేరుతో రాజకీయాలు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు ప్రజలు అభివృద్ధిని మాత్రమే కోరుకుంటున్నారు. ఓ మహిళా నేత పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఈ దేశం మొత్తం చూస్తోంది. రాముడు, కృష్ణుడు, దుర్గా, కాళీమాత ఇలా దేవుళ్లందరికీ మనం భక్తులమే. పరిస్థితులను కావాలనే మరింత దిగజారాలే చేయడం ఎందుకు ? ’ అని శతృఘ్న సిన్హా వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. ఇటీవల రెండు మూడుసార్లు మమతాబెనర్జీని అడ్డుకున్న కొందరు యువకులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె కారు దిగి వారిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తడంతో దీదీ సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జైశ్రీరామ్ నినాదంపై తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, కానీ భాజపా నేతలు కావాలనే ఆ నినాదంతో మత రాజకీయాలకు తెరలేపి బెంగాల్లో ఆందోళనలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. -
కాంగ్రెస్‌లోకి శతృఘ్న
న్యూఢిల్లీ: బీజేపీ తిరుగుబాటు ఎంపీ శతృఘ్న సిన్హా(72) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుని మీడియాతో మాట్లాడారు. ‘బీజేపీ వన్‌మ్యాన్ షో– టూ మెన్ ఆర్మీ’గా మారిందనీ, పార్టీలో చర్చలకు తావులేదనీ, ప్రశ్నించిన వారిపై తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గాంధీజీ, నెహ్రూ వంటి మహామహులున్న పార్టీ అన్నారు. రాహుల్‌ను ప్రయత్నించిన– పరీక్షకు నిలబడిన– విజయవంతమయిన(ట్రైడ్–టెస్టెడ్–సక్సెస్ఫుల్)నేతగా అభివర్ణించారు. ‘బీజేపీ వ్యవస్థాపక దినం ఏప్రిల్ 6వ తేదీనే సొంత పార్టీని వీడాల్సి రావడం చాలా బాధాకరం. ఇందుకు కారణాలు మీకందరికీ తెలుసు. బీజేపీ వన్‌మ్యాన్ షో– టూమెన్ ఆర్మీగా మారిపోయింది’ అంటూ మోదీ, అమిత్‌షాల నాయకత్వాన్ని ఆయన పరోక్షంగా విమర్శించారు. ‘బీజేపీలో చర్చలకు తావులేకుండా పోయింది. ఎల్కే అడ్వాణీ, జశ్వంత్ సింగ్, యశ్వంత్ సిన్హా వంటి కీలక నేతలకు గౌరవం దక్కలేదు. ప్రశ్నించే సీనియర్ నేతలను మార్గదర్శక మండలిలో చేరుస్తోంది. విభేదించే వారు, ప్రశ్నించే వారిపై శత్రువులు, తిరుగుబాటుదారులంటూ ముద్రవేస్తోంది’ అని వ్యాఖ్యానించారు. ‘నిజం మాట్లాడినందుకే నేను తిరుగుబాటుదారునైతే, నేను అలాగే ఉంటా. పార్టీలో ప్రజాస్వామ్యం క్రమంగా నియంతృత్వంలోకి మారిపోతోంది. మీరు చెప్పే అబద్ధాలు, నిరర్ధక హామీలను ప్రజలు గ్రహించారు. మీ నిజ స్వరూపం బట్టబయలైంది’ అని మండిపడ్డారు. ‘ప్రతిదీ ప్రధాని కార్యాలయమే నిర్ణయిస్తోంది. మంత్రులకు స్వేచ్ఛలేదు’ అని పేర్కొన్నారు. అనంతరం ఆయన ట్విట్టర్లో..‘ మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు మతిలేని చర్య. దీని కారణంగా ఎంతో మంది చనిపోయినా పట్టించుకోలేదు. బీజేపీ ప్రచారం కోసం వెచ్చించే డబ్బును అభివృద్ధిపై ఖర్చుపెడితే దేశం ఎంతో బాగయ్యేది’ అని తెలిపారు. సిన్హాకు పట్నా సాహిబ్ టికెట్ శతృఘ్న సిన్హాకు పట్నా సాహిబ్ టికెట్ కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయన పార్టీలో చేరిన కొద్ది సేపటికే ఈ నిర్ణయం వెలువడింది. ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవి శంకర్‌ప్రసాద్‌తో తలపడనున్నారు. దీంతోపాటు మరికొందరి పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. రాహుల్ ఉత్సాహవంతుడు ‘ఉత్సాహవంతుడు, దేశ భవిష్యత్ ముఖచిత్రం అంటూ రాహుల్ గాంధీని శతృఘ్న సిన్హా పొగిడారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన న్యాయ్ వంటి పథకం దేశంలో ఇంతకుముందెన్నడూ లేదని పేర్కొన్నారు. ‘మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి మహా నేతలు సేవలందించిన గొప్ప పార్టీ కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో బిహార్‌లో మహాకూటమి విజయం సాధిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. రాహుల్ వంటి ఉత్సాహవంతుడి నాయకత్వంలో సరైన దిశగా ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నా. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి. కాంగ్రెస్, లాలూ, తేజస్వీ ఆర్జేడీ వర్థిల్లాలి. జైహింద్’ అని పేర్కొన్నారు. దేశ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నాకు కల్పిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నా’ అని అన్నారు. కొంతకాలంగా ఆయన సామాజిక మాధ్యమాల్లో మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే సమయంలో రాహుల్ గాంధీని, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు ఆపార్టీ నేతలపై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో పార్టీ పట్నాసాహిబ్ నుంచి ఆయనకు బదులు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు టికెట్ కేటాయించింది. దీంతో శతృఘ్న సిన్హా మార్చి 28వ తేదీన కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌తో భేటీ అయ్యారు. శనివారం కాంగ్రెస్‌లో చేరిపోయారు. -
శత్రుఘ్న సిన్హాకు బీజేపీ షాక్
పట్నా : తరచూ పార్టీని ఇరుకునపెట్టే వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి బిహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీని బీజేపీ బరిలో దించనుంది. పలు కీలక అంశాలపై పార్టీ వైఖరికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శత్రుఘ్న సిన్హాకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ నిరాకరించనున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్ర క్యాబినెట్లోకి తనను తీసుకోకపోవడంపై గుర్రుగా ఉన్న సిన్హా కొంత కాలంగా ప్రధాని మోదీకి, పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో గొంతువిప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని శత్రుఘ్న సిన్హా చెబుతున్న క్రమంలో సుశీల్ కుమార్ మోదీ పేరును తెరపైకితేవడం ద్వారా అసంతృప్త నేతకు చెక్ పెట్టేందుకు బీజేపీ పావులుకదుపుతోంది. వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన సిన్హా మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. రాఫెల్ డీల్ సహా పెట్రోల్, డీజిల్ ధరల భారం, రూపాయి క్షీణత వంటి అంశాలపై విపక్షాల ఆందోళనతో సిన్హా శ్రుతి కలిపారు. జనం సమస్యలతో సతమతమవుతుంటే మనం ఏసీ రూంల నుంచి బయటికి వచ్చి ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని మోదీ సర్కార్‌ను ఆయన నిలదీశారు. -
కేజ్రీవాల్‌పై సిన్హా ప్రశంసలు
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ అసంతృప్త ఎంపీ శత్రుఘ్న సిన్హా మరోసారి పార్టీని ఇరకాటంలో పెట్టే వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌తో తీవ్రంగా విభేదిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను శత్రుఘ్న సిన్హా బాహాటంగా సమర్ధించారు. లెఫ్టినెంట్ జనరల్ సర్వాధికారాలను నిరసిస్తూ జరుగుతున్న సమ్మెను విరమించి అధికారులను తిరిగి విధుల్లోకి చేరాలని కోరడం ద్వారా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డైనమిక్ నేతగా నిరూపించుకున్నారని ఆయన ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ తీసుకున్న చొరవ నేపథ్యంలో ప్రధాని సైతం జోక్యం చేసుకుని సమ్మెను విరమించచేస్తారని తాను భావిస్తున్నానన్నారు. ఢిల్లీ ప్రజల ప్రయోజనాలతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రధాని స్పందిస్తే మేలు చేసిన వారవుతారని వ్యాఖ్యానించారు. వేల మైళ్ల ప్రయాణమైనా ప్రారంభమయ్యేది ఒక్క అడుగుతోనే అంటూ సిన్హా ట్వీట్‌ను ముగించారు. 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తనను పక్కనపెట్టినప్పటి నుంచి పార్టీ నాయకత్వంపై ఆయన పలు సందర్భాల్లో కత్తిదూస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది నెలలుగా బీజేపీ కేంద్ర నాయకత్వంపై, ప్రధాని మోదీపై వీలుచిక్కినప్పుడల్లా విమర్శలతో విరుచుకుపడుతున్నారు. గత వారం పార్టీ భాగస్వామ్య పక్షం జేడీయూ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు గైర్హాజరైన సిన్హా, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో శత్రుఘ్న సిన్హా పాల్గొనడంపై బీజేపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి. -
యశ్వంత్‌ను వెనుకేసుకొచ్చిన శత్రుఘ్న్ సిన్హా
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై విమర్శలు గుప్పించిన తమ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హాను బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా సమర్ధించారు. సిన్హా అసలైన రాజనీతిజ్ఖుడని వాస్తవ పరిస్థితినే ఆయన ప్రతిబింబించారని వ్యాఖ్యానించారు. పలు అంశాలపై పార్టీ వైఖరితో విభేదించిన బిహార్ ఎంపీ శత్రుఘ్న సిన్హా యశ్వంత్‌ను విమర్శించిన నేతలనూ టార్గెట్ చేశారు. పార్టీ, దేశ ప్రయోజనాల కోసం యశ్వంత్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం చిన్న పిల్లల చేష్టగా అభివర్ణించారు. యశ్వంత్ వ్యాఖ్యలకు వక్రభాష్యాలు చేయడం చౌకబారు, దిగజారుడు చర్యలేనని వరుస ట్వీట్లలో శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. పార్టీ కన్నా దేశమే ముఖ్యమని, జాతి ప్రయోజనాలే ముందువరుసలో ఉంటాయని ఇటీవల ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యశ్వంత్ సిన్హా రాసిన ప్రతి ఒక్కటీ పార్టీ, దేశ ప్రయోజనాల కోణంలోనే ఉన్నదని తాను గట్టిగా అభిప్రాయపడుతున్నానని శత్రుఘ్నసిన్హా ట్వీట్ చేశారు. దేశంలో అత్యంత విజయవంతమైన ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యశ్వంత్ పేరొందారని, దేశ ఆర్థిక వ్యవస్థ వాస్తవ పరిస్థితికి ఆయన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. -
ఆ హీరో మరో 'హీరో'ను పొగిడారు!
పట్నా: అలనాటి బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా సహచర పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను 'హీరో' అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని కితాబిచ్చారు. ఢిల్లీ క్రికెట్ బోర్డు అక్రమాల విషయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీపై కీర్తి ఆజాద్ బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ అసమ్మతి ఎంపీగా ముద్రపడిన షాట్‌గన్ శత్రుఘ్న ఆయనకు బాసటగా నిలువడం గమనార్హం. 'ఈ రోజుకు నిజమైన హీరో కీర్తి ఆజాదే. మిత్రులారా నాదొక విన్నపం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేవారిపై వెంటనే విరుచుకుపడకండి. వారిపై నిర్బంధ చర్యలకు పాల్పడకండి' అని శత్రుఘ్న బుధవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఎంపీ కీర్తి ఆజాద్‌పై బీజేపీ అధినాయకత్వం చర్యలు తీసుకోకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు విభిన్నమైన పార్టీగా పేరొందిన బీజేపీ ఇప్పుడు విభేదాలు పార్టీగా మారిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా డీడీసీఎ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి కూడా ఆయన ఓ సలహా ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని, గతంలో అద్వానీజీ అనుసరించిన మార్గాన్ని జైట్లీ కూడా పాటించాలని సూచించారు. హవాలా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో 1990లో అద్వానీ ఎన్నికల్లో పోటీచేయని విషయాన్ని పరోక్షంగా గుర్తుచేశారు. KirtiAzad-hero of the day.Humble appeal to friends.Avoid knee jerk reaction/coercive action against friend who's fighting against corruption — Shatrughan Sinha (@ShatruganSinha) December 23, 2015