కేసీఆర్ దత్త పుత్రిక ప్రేమికుడు దొరికాడు | kcr adopted daughter lover found | Sakshi
Sakshi News home page

కేసీఆర్ దత్త పుత్రిక ప్రేమికుడు దొరికాడు

May 3 2016 9:44 AM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్ దత్త పుత్రిక ప్రేమికుడు దొరికాడు - Sakshi

కేసీఆర్ దత్త పుత్రిక ప్రేమికుడు దొరికాడు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ప్రత్యూషను ప్రేమించిన యువకుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఆళ్లగడ్డ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న  ప్రత్యూషను ప్రేమించిన యువకుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్థానిక పోలీసుల సమాచారం మేరకు.. ప్రత్యూష హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యశాలలో చికిత్స పొందుతున్న సమయంలో అదే ఆసుపత్రికి తమ బంధువుల చికిత్స నిమిత్తం వెళ్లిన ఆళ్లగడ్డ యువకుడు వెంకట మద్దిలేటి(బుజ్జి)తో పరిచయమైంది.

ఈ పరిచయం ప్రేమగా మారి ఇరువురూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇరువురూ కలిసి ఉన్న ఫొటోలు వాట్సాప్లో హల్ చల్ చేశాయి. దీనిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఆరాతీశారు. వెంకట మద్దిలేటి స్థానిక ఆటో మొబైల్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement