
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం కార్యక్రమం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని పాటిగడ్డ గ్రామంలో చరణ్ రెడ్డితో ఆమె వివాహం నేడు (సోమవారం) జరగనుంది. ఈనేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఆమె పాటిగడ్డలోని లూర్దూమాత చర్చికి బయల్దేరి వెళ్లారు. పాటిగడ్డ గ్రామస్తులు, వరుడు చరణ్‌రెడ్డి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి వేడుకకు తరలివెళ్లారు. ప్రత్యూష వివాహానికి పలువురు ప్రముఖులు రానున్నారు. ఇక క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం నిర్వహించనున్నట్టు జిల్లా స్త్రీశిశు సంక్షేమశాఖ అధికారి మోతీ తెలిపారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణలోని పెళ్లి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. (చదవండి: ప్రత్యూష పెళ్లికూతురాయెనె.. )
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)