'నాన్నను, పిన్నిని కఠినంగా శిక్షించాలి' | my father, aunt sholud be punish | Sakshi
Sakshi News home page

'నాన్నను, పిన్నిని కఠినంగా శిక్షించాలి'

Published Fri, Jul 10 2015 3:39 PM | Last Updated on Sun, Sep 3 2017 5:15 AM

'నాన్నను, పిన్నిని కఠినంగా శిక్షించాలి'

'నాన్నను, పిన్నిని కఠినంగా శిక్షించాలి'

హైదరాబాద్: కన్నతండ్రి, పిన్ని చేతిలో ఘోరంగా చిత్రహింసలు అనుభవించిన ప్రత్యూష తొలిసారి వారికి శిక్ష పడాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. ఎల్బీ నగర్లోని అవేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష శుక్రవారం సాక్షితో మాట్లాడింది. తాను వాళ్లకు పుట్టలేదనే కారణంతో ఏడాది కాలంగా తనను టార్చర్ పెడుతూ వచ్చారని వాపోయింది. తనను ప్రతిక్షణం మానసికంగా, శారీరకంగా చాలా రోజుల నుంచి వేధిస్తున్నారని ప్రత్యూష వెల్లడించింది.

తన పేరు మీద ఏ ఆస్తులు ఉన్నాయో కూడా తెలియదని, తనలాంటి దుస్థితి మరెవరికి రాకూడదని కన్నీరు మున్నీరైంది. ఇంత ఘోరంగా వేధించిన తన నాన్నకు, పిన్నికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ఏడాది కాలంగా గదిలో నిర్బంధించి తండ్రి చిత్ర హింసలు పెట్టడంతో తీవ్రగాయాలయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమెను రీనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement