తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ లోని కన్ను కొట్టే సీన్‌తో ‘వింక్ బ్యూటీ’ గా పేరు తెచ్చుకున్న నటి ప్రియా ప్రకాశ్ వారియర్! సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ హీరోయిన్ ఫ్యాషన్ ట్రెండ్స్‌ను ఫాలో అవడంలోనూ అంతే ఫాస్ట్‌గా ఉంటుంది. అలా ఆమె అభిమానాన్ని చూరగొన్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి..
ప్రత్యూష గరిమెళ్ల..
హైదరాబాద్‌కు చెందిన ప్రత్యూష గరిమెళ్ల.. చిన్నప్పటి నుంచి తను పెద్ద ఫ్యాషన్ డిజైనర్‌ని కావాలని కలలు కన్నారు. ఆ ఆసక్తితోనే ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. అనంతరం 2013లో హైదరాబాద్‌లో తన పేరు మీదే ఓ బొటిక్‌ను ప్రారంభించించారు. అతి సూక్ష్మమైన అల్లికలతో వస్త్రాలకు అందాన్ని అద్దడమే ఆమె బ్రాండ్ వాల్యూ.
చాలామంది సెలబ్రిటీలకు దుస్తులను డిజైన్ చేసింది. ధర డిజైన్‌ను బట్టే. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్ అన్నింటిలోనూ ఆమె డిజైన్స్ లభ్యం. కాగా ఈ ఏడాది జూన్‌లో ప్రత్యూష గరిమెళ్ల బలవన్మరణానికి పాల్పడి తన వాళ్లను విషాదంలోకి నెట్టారు.
ఆమ్రపాలి
నిజానికి ఇదొక మ్యూజియం. అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ ఆభరణాల కళను కాపాడేందుకు ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా కలసి జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలు కూడా ఉంది. కానీ ధర లక్షల్లో ఉంటుంది.
అందుకే, అలాంటి డిజైన్స్‌లో ఆభరణాలు రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలి జ్యూయెలరీ’ని ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలో, మామూలు పీస్ అయితే ఆమ్రపాలి జ్యూయెలరీలో లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్‌కు ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్‌లైన్‌లోనూ ఆమ్రపాలి జ్యూయెలరీని కొనుగోలు చేయొచ్చు.
బ్రాండ్ వాల్యూ
డ్రెస్ డిజైనర్: ప్రత్యూష గరిమెళ్ల
ధర: రూ. 40,800
జ్యూయెలరీ
బ్రాండ్: ఆమ్రపాలి జ్యూయెల్స్
ధర: డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
అదో సరదా
వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. ట్రాన్స్‌పెరెంట్ గొడుగు, రెయిన్ కోట్ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్ స్లిప్పర్స్ వేసుకుని స్కూల్ బస్ కోసం వెయిట్ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. - ప్రియా ప్రకాశ్ వారియర్
-దీపిక కొండి
చదవండి: Floral Designer Wear: ఈవెనింగ్ పార్టీల్లో ఫ్లోరల్ డిజైనర్ వేర్‌తో మెరిసిపోండిలా!
Comments
Please login to add a commentAdd a comment