- చెస్ క్రీడాకారిణి ప్రత్యూష
ఒలింపియాడ్ పతకమే లక్ష్యం
Published Tue, Aug 30 2016 9:51 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
తుని :
చెస్ ఒలింపియాడ్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని తునికి చెందిన చదరంగం క్రీడాకారిణి బి.ప్రత్యూష తెలిపారు. తుని రైల్వేస్టేçÙన్‌లో మంగళవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 2 నుంచి 14 వరకూ అజర్‌బైజాన్ దేశం బాకార్ పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు వెళుతున్నట్టు వివరించారు. ఇండియా నుంచి ఐదుగురు క్రీడాకారిణులతో కూడిన జట్టు ఈ పోటీలకు వెళుతుందన్నారు. ఇందులో ఏపీ నుంచి తనతోపాటు ద్రోణవల్లి హారిక, ఢిల్లీకి చెందిన తానియా సత్యదేవ్, మహారాష్ట్ర నుంచి సౌమ్య స్వామినాథన్, ఒడిశాకు చెందిన పద్మినీ రీత్ ఉన్నారన్నారు. అజర్‌బైజా¯Œæకు బుధవారం బయలుదేరుతున్నట్టు ప్రత్యూష వివరించారు. ప్రస్తుతం 2,329 పాయింట్లతో ఉన్నానని, ఒలిపింయాడ్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 16 వరకూ కోల్‌కతాలో జరిగే వుమెన్–ఎ టోర్నమెంట్, డిసెంబర్ 2 నుంచి 14 వరకూ లండన్‌లో జరిగే క్లాసిక్ టోర్నీ, సెప్టెంబర్ 18 నుంచి 28 వరకూ ఖతార్‌లో జరిగే ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లలో తాను పాల్గొంటున్నానని చెప్పారు. నవంబర్ నెలాఖరుకు మహిళా గ్రాండ్‌మాస్టర్ అవుతానని ప్రత్యూష వివరించారు.
Advertisement