chess champion
-
ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు (ఫోటోలు)
-
ప్రేయసిని పెళ్లాడిన చదరంగ రారాజు.. ఫొటోలు చూశారా? (ఫోటోలు)
-
ప్రపంచ చెస్ ఛాపింయన్ గా అవతరించిన తెలుగు తేజం
-
ఈ ట్విన్నర్స్.. ఆటల్లో విన్నర్స్..
ట్విన్స్.. అనగానే నైంటీస్ వారికి టక్కున హలో బ్రదర్ సినిమా కళ్లముందు కదులుతుంది.. మనలో చాలా మంది స్కూల్స్, కాలేజ్ ప్రయాణంలో అనేక మంది కవలలను కలిసే ఉంటారు.. వీరిలో ఎక్కువ మంది ఇద్దరు ఆడవారు.. ఇద్దరు మగవారిని చూసుంటాం.. కొందరు ఇద్దరినీ కలిసి ట్విన్స్‌గా చూసుంటాం.. మనం ఇప్పుడు తెలుసుకునే ట్విన్స్ కూడా అలాంటివారే.. అయితే అలాంటి ఇలాంటి ట్విన్స్ కాదండోయ్.. ఈ ట్విన్నర్స్.. ఆటల్లో విన్నర్స్..వీరే నగరానికి చెందిన అయమ అగర్వాల్, అనయ్ అగర్వాల్.. వీరు చెస్లోనూ, ఇతర ఆటల్లోనూ చిరుతల్లా పావులు కదుపుతూ.. పథకాలు గెలుస్తూ.. వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తున్నారు..వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..శ్రీనగర్‌కాలనీ: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వరుణ్ అగర్వాల్, పనాషా అగర్వాల్ సంతానమే అయమ, అనయ్ అగర్వాల్ అనే కవలలు..వీరికి ప్రస్తుతం తొమ్మిదేళ్లు...నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతున్నారు. చిన్నతనం నుండే అల్లరి ఎక్కువ... ఎక్కువగా గొడవపడుతూ బాగా అల్లరి చేసేవారు. ఆ అల్లరిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో వీరిని ఆటల వైపు మళ్లించాలని తల్లిదండ్రులు భావించారు. చెస్ వల్ల క్రమశిక్షణతో పాటు మేధస్సు, మైండ్ రిలాక్స్ అవుతుందని తల్లి పనాషా ఇండియన్ చెస్మాస్టర్స్ స్కూల్లో చేరి్పంచారు. చేరిన కొద్దిరోజుల్లోనే నగరంలోని జూనియర్ టోర్నమెంట్స్‌లో మెడల్స్ సాధించి ప్రతిభను చాటారు. పాల్గొన్న ప్రతిటోర్నమెంట్లోనూ విన్నర్స్‌గా, రన్నర్స్‌గా నిలుస్తూ వచ్చారు. వీరి ప్రతిభకు ముగ్దులైన కోచ్ చైతన్య సురేష్ వీరికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌కి పోటీపడేలా తీర్చిదిద్దారు. వరల్డ్ ఛాంపియన్స్‌గా.. కోచ్‌ల సహాయంతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌లో పాల్గొన్నారు. గతేడాది ఈజిప్‌్ట, సెర్బియాలోని బిల్గ్రేడ్లో జరిగిన చెస్టోరీ్నలో పాల్గొని ఛాంపియన్స్‌గా నిలిచారు. అమయ ప్రపంచవ్యాప్తంగా 60 మంది క్రీడాకారులతో పోటీపడి అండర్–8 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. చైనా, కెనెడా, మలేషి యా, మంగోలియా, శ్రీలంకలాంటి ఆటగాళ్లను ఎత్తుకు పైఎత్తులతో చిత్తు చేసింది. ఫిబ్రవరిలో అనయ్ అండర్–8లో 90 మందితో పోటీపడి మెక్సికో, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, మంగోలియాపై విజయాన్ని, రష్యా, శ్రీలంక, ఆ్రస్టేలియా, స్లొవేకియాతో డ్రా చేసుకొని ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ సంవత్సరం చెక్‌రిపబ్లిక్ పరాగ్వేలో జరిగిన చెస్టోర్నమెంట్లో ఫిడే రేటింగ్‌లో టాప్‌లో ఉన్న వారిలో అనయ్ విన్నర్‌గా, అయమ రన్నర్‌గా నిలిచి ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్స్‌లో అమయ 1728, అనయ్ 1773 రేటింగ్స్‌లో కొనసాగుతున్నారు. ఈ కవల చిచ్చరపిడుగులు రెండు సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటూ దేశ, విదేశాల్లోని చెస్ ఛాంపియన్ షిప్స్‌లో పాల్గొని మెడల్స్‌ను సాధిస్తున్నారు. చదువుల్లోనూ చురుకే... అమయ, అనయ్ చెస్‌లోనే కాకుండా చదువుల్లోనూ చురుగ్గా రాణిస్తూ, క్లాస్ టాపర్స్‌గా నిలుస్తున్నారు. చెస్‌తో పాటు పియానో, అథ్లెటిక్స్‌లోనూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు, కోచ్‌లు, స్కూల్ మేనేజ్మెంట్ల సహకారంతో ఆల్‌రౌండర్స్‌గా నిలుస్తూ ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలుస్తున్న ఈ సూపర్ ట్విన్స్ మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుందామా మరి.. -
ఉగ్రవాదిగా ఆ దిగ్గజం! ఇది పుతిన్ ఆడే చదరంగం
ప్రత్యర్థుల అణచివేతకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎందాక అయినా వెళ్తారని కళ్లారా చూస్తున్నదే!. నావల్నీ మరణం.. అందుకు ఒక ఉదాహరణ. తాజాగా చెస్ దిగ్గజం గ్యారీ కాస్పరోవ్Garry Kasparovను రష్యా ఉగ్రవాదుల జాబితాలో చేర్చడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పుతిన్ ప్రభుత్వంపై ఆయన బహిరంగంగా విమర్శలు గుప్పించడమే అందుకు ప్రధాన కారణమని ఇక్కడ చెప్పనక్కర్లేదు. అసలు 'ఉగ్రవాదులు, తీవ్రవాదులు' లిస్టులో చేరడానికి రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఎలాంటి విధానాలు పాటిస్తోంది?.. ఉగ్రవాదులు-అతివాదుల జాబితాలో చేరడానికి ప్రత్యేకించి అర్హతలేమీ అక్కర్లేదు. పుతిన్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే చాలూ. ఇలాగే ఇప్పుడు కాస్పరోవ్ పేరును తీవ్రవాదులు-ఉగ్రవాదుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను సైతం ఈ చెస్ మాజీ ఛాంపియన్ బహిరంగంగానూ ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రోస్‌ఫిన్‌మానిటరింగ్ (రష్యా ఆర్థిక పర్యవేక్షణా సంస్థ) విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోకి గ్యారీ కాస్పరోవ్ పేరు చేరింది. గ్యారీ కాస్పరోవ్ ప్రభుత్వ అణచివేత విధానాలకు భయపడి 2014లోనే ఆయన రష్యా నుంచి వెళ్లిపోయారు. పదేళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. 2022లో రష్యా న్యాయశాఖ ఆయనపై విదేశీ ఏజెంట్ అనే ముద్ర కూడా వేసింది. తాజాగా.. ఈ జాబితాలో ఆయన పేరును చేర్చడం వల్ల ఆయన ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ఆంక్షల్ని విధించేందుకు రష్యాకు అవకాశం ఉంటుంది. కాగా, గ్యారీ కాస్పరోవ్‌పై పుతిన్ సర్కార్ తీసుకున్న చర్యలను హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. అణచివేతకు ఈ ఆంక్షలను రష్యా ప్రభుత్వం ఆయుధంగా ఉపయోగిస్తుందని మండిపడుతున్నాయి. -
చైతన్య భారతి: చిచ్చర పిడుగు... విశ్వనాథ్ ఆనంద్ / 1969
ఢిల్లీలో జాతీయ జూనియర్ సంఘం చాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. అది 1983. విశ్వనాథ్ ఆనంద్‌ను నేను మొదటిసారిగా కలుసుకున్న సందర్భం కూడా అదే. టోపీ పెట్టుకున్న ఓ సన్నటి కుర్రాడు పోటీలు జరుగుతున్న ఆవరణలోకి వచ్చాడు. అతని ముఖంలో ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అతని చదరంగం ఆటను మొట్టమొదటిసారిగా నేను అక్కడే చూశాను. అతను మెరుపు వేగంతో ఆడుతున్నాడు. నాకతని ఆట చూడగానే కలిగిన అభిప్రాయం అది. అతను అతి చురుకుగా, నిర్దుష్టంగా, ఆట ఆడుతున్నాడు. అతనికి మేమంతా వెంటనే ‘చిచ్చర పిడుగు’ అని పేరు పెట్టేశాం. ఆ వేగం అతని హావభావాల్లో కూడా కనిపిస్తోంది. అతను ఒక చోట నిలకడగా కూర్చొని ఆడడు. ఆడుతున్నంత సేపూ అలా తిరుగుతూనే ఉంటాడు. 1992లో నేనతన్ని మరోసారి కలిశాను. అప్పుడు నేనే అతనితో ఆడాను. 1980లలో, 1986 వరకు అతను ఓడించలేని వ్యక్తేమీ కాదు. అతనితో నేడు ఆడటమే కాదు, కొన్ని ఆటల్లో గెలిచాను కూడా! 1992లో అతన్ని నేను చూసినప్పుడు మాత్రం అతను తన ఆటలో బాగా పురోగతి సాధించాడనిపించింది. అతను మారినట్లే అతని ఆట కూడా మరో స్థాయికి చేరుకుంది. చిచ్చర పిడుగు దశ నుంచి అతను మరింత నిబ్బరంగా ఆడే స్థాయికి చేరుకున్నాడు. అసలు సిసలు గ్రాండ్ మాస్టర్‌గా మారిపోయాడు. ఆ మార్పు 1986 లోనే వచ్చిందనిపించింది. 1987 నాటికి అది స్థిరపడింది. అప్పుడు అతను ప్రపంచ జూనియర్ చాంపియన్ అయ్యాడు. అతనిలో అంతర్లీనంగా గ్రాండ్ మాస్టర్ కాగల లక్షణాలన్నీ ఉన్నాయి. ఆనంద్ అక్షరాలా బాల మేధావి. ఈ రంగంలో రష్యా ఆధిపత్యానికి ఆనంద్ చరమ గీతం పాడాడు. అంతకు ముందు ఆ పని బాబీఫిషర్ చేశాడు. గ్యారీ కాస్పరోవ్, అనాతొలి కార్పోవ్, లాదిమర్ క్రామ్నిక్ల ఆధిపత్యాన్ని నిలదీసిన వ్యక్తి ఆనంద్. ఆ రోజుల్లో చదరంగంలో భారత్‌కు అంతగా పేరు లేదు. అందువల్ల ఆనంద్ విజయం భారత ప్రతిష్టను ఆకాశానికెత్తేసింది. అతని విజయానికి అతని తల్లిదండ్రులు కూడా చాలా వరకు కారణం. విశ్వనాథ్‌కి వచ్చిన అవార్డులు దివ్యేందు బారువా, చదరంగంలో గ్రాండ్ మాస్టర్, అర్జున అవార్డు గ్రహీత తదితరాలు. (చదవండి: రాజా రామ్ మోహన రాయ్ / 1772–1833) -
నవ్వించే గ్యాస్ చాంపియన్ల ప్రాణాలు తీసింది
నవ్వు తెప్పించే లాఫింగ్గ్యాస్ ఓ జంట ప్రాణాలు తీసింది. ఉక్రెయిన్‌కు చెందిన స్పీడ్ చెస్ చాంపియన్ స్టానిస్లావ్ బోగ్డానోవిచ్ (27), అతని స్నేహితురాలు అలెగ్జాండ్రా వెర్నిగోరా (18) మరణించారు. వీరు మాస్కోలోని తమ ఫ్లాట్‌లో విగత జీవులుగా కనిపించారు. ప్లాట్‌లో ఉన్న లాఫింగ్ గ్యాస్ బెలూన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఎందుకు వారు లాఫింగ్ గ్యాస్ తెచ్చుకున్నారనేది మిస్టరీగా మారింది. ఇద్దరూ కూడా స్పీడ్ చెస్ ఛాంపియన్లు. ఇటీవల ఒక ఇంటర్నెట్ చెస్ పోటీలో రష్యా తరఫున బరిలోకి దిగారు. ఉక్రెయిన్‌పై తలపడి, గెలుపొందారు. అయితే తాజాగా వారిద్దరూ వారం రోజుల నుంచి కనపించకుండా పోయారు. అనంతరం వీరి ఫ్లాట్‌లో శవాలై కనిపించారు. వీరి ఇంట్లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు ఉన్నాయి. బెలూన్ సాయంతో ఈ గ్యాస్‌ను పీలుస్తుంటారని తెలుస్తోంది. ఇది శస్త్రచికిత్సల సమయంలో మత్తు కోసం ఉపయోగిస్తుంటారు. దీన్ని సాధారణంగా పీల్చితే విపరీతమైన నవ్వు తెప్పిస్తుంది. అదే సరదా కోసం సొంతంగా పీల్చితే మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ జంట కూడా నవ్వాలనే ఉద్దేశ్యంతోనే దాన్ని పీల్చి ప్రమాదవశాత్తు ప్రాణాలు వదిలి ఉంటారని అనుమానిస్తున్నారు. చదవండి: దుర్మార్గులు దొరికారు -
తొలిసారి ఓటు వేయబోతున్నాను : చెస్ స్టార్
ఆమె చదరంగ క్షేత్రంలో తన ప్రత్యర్థులపై ఎత్తుకు పైఎత్తులు వేస్తూ చెక్ పెడుతుంది. ప్రత్యర్థి వేసే ఎత్తులను వెంటనే పసిగట్టి... ఎలాంటి ఎత్తు వేస్తే తనకు విజయం పాదాక్రాంతమవుతుందో ముందుచూపుతో ఆలోచిస్తుంది. చిన్ననాటి నుంచి చదరంగంపై మక్కువతో పావులను తన ఆరో ప్రాణంగా మార్చుకుని జిల్లా స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు చెస్ ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారిణిగా ఎదిగింది. దాదాపు రెండు దశాబ్దాలుగా వివిధ వయో విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఆ చెస్ క్రీడాకారిణియే ద్రోణవల్లి హారిక. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన చెస్ గ్రాండ్‌మాస్టర్ హారికను ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత నాలుగో పౌర పురస్కారం ‘పద్మశ్రీ’తో గౌరవించింది. రాబోయే ఎన్నికల్లో ఓటర్లు కులం, మతం ప్రాతిపదికన కాకుండా సమర్థుడైన నాయకుడికి ఓటు వేయాలని ఆమె సూచించింది. గతంలో ఎన్నికల వేళ టోర్నీలు ఆడుతూ విదేశాల్లో ఉన్నకారణంగా ఓటు వేయలేకపోయానని... ఈసారి కచ్చితంగా తన ఓటును వినియోగించుకుంటానని హారిక తెలిపింది. ప్రభుత్వాలు ఏవైనా దేశం కోసం పేరు తెచ్చే క్రీడాకారులకు సరైన గుర్తింపు ఇవ్వాలని, వారికిచ్చే హామీలను సకాలంలో నెరవేర్చాలని ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హారిక తెలిపింది. పలు అంశాలపై హారిక వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోలో రాజకీయ పార్టీలు క్రీడల గురించి ప్రస్తావించకపోవడానికి కారణమేంటి? ఒకవేళ ప్రస్తావిస్తే ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటారు? ఇతర రంగాలతో పోలిస్తే క్రీడా రంగంలో ఉండే వారి సంఖ్య తక్కువ. అందుకే రాజకీయ పార్టీలు క్రీడల గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయవేమోనని నా అభిప్రాయం. నా సలహా ప్రకారమైతే మంచి ఫలితాలు సాధించే క్రీడాకారులకు సముచిత రీతిలో నగదు పురస్కారాలు ఇవ్వాలి. వారికి సరైన సమయంలో సరైన గుర్తింపు ఇవ్వాలి. ముఖ్యంగా క్రీడాకారులకు ఇచ్చే హామీలు సకాలంలో అమలుచేసే చిత్త్తశుద్ధి ఉండాలి. ఈ విషయాల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదు. క్రీడా సమాఖ్యల్లో రాజకీయ నాయకుల ప్రాతినిధ్యం ఉండటాన్ని మీరు సమర్థిస్తారా? వారి వల్ల ఉపయోగం ఉంటుందని భావిస్తారా? క్రీడా సమాఖ్యల్లో క్రీడా నేపథ్యమున్న వారుంటే సత్ఫలితాలు లభిస్తాయి. క్రీడాకారుల తల్లిదండ్రులకు స్థానం కల్పించినా ఫర్వాలేదు. క్రీడలతో పరిచయం లేని వారుంటే క్రీడాకారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయంపై వారికి అవగాహన ఉండదు. క్రీడాకారులందరికీ ప్రభుత్వాలు సమప్రాధాన్యత ఇస్తున్నాయా? కొందరికి భారీ మొత్తంలో నజరానాలు లభిస్తాయి... మరికొందరిని అసలే పట్టించుకోరు. ఈ విషయంలో మీ అభిప్రాయం? క్రీడాకారులందరికీ ప్రభుత్వాలు సమ ప్రాధాన్యత ఇవ్వడం లేదని కచ్చితంగా చెప్పగలను. ఎక్కడా సమతుల్యత కనిపించడంలేదు, పాటించడంలేదు. ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. అన్నీ ఉన్న వారికి ఇంకా ఇస్తూ పోతే అది క్రీడాభివృద్ధికి దోహదపడదు. అర్హత లేని వారిని కూడా అందలం ఎక్కిస్తున్నారు. గొప్ప ఫలితాలు సాధించకున్నా ప్రభుత్వాల నుంచి భారీ మొత్తంలో నగదు పురస్కారాలు పొందిన వారున్నారు. క్రీడాకారులకు నజరాలు ఇచ్చే విషయంలో లోటుపాట్లు ఉండకూడదనుకుంటే సమర్థులైన క్రీడాధికారులను నియమించాలి. ఏ క్రీడాకారుడికి ఎంత మొత్తం ఇవ్వాలి, వారికి ఏ రకమైన సహాయం అవసరం ఉందనే విషయాలపై వారికి మంచి అవగాహన ఉండాలి. మన దేశం క్రీడలను ప్రేమించే దేశమని, క్రీడలు ఆడే దేశం కాదని గతంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. క్రీడల్లో భారత్ అగ్రగామి కావాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? సచిన్ అన్నది నిజమే. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన క్రీడాకారులకు ప్రేమాభిమానాలు లభిస్తాయి. అయితే చాలా దేశాల్లో ఇది కనిపించదు. అయితే క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే విషయంలో చాలా మంది రిస్క్ తీసుకోవాలనుకోరు. కనీసం డిగ్రీ కలిగి ఉంటే తమ పిల్లలకు ఉద్యోగభద్రత ఉంటుందని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఈ విషయంలో ఇప్పుడిపుడే తల్లిదండ్రుల మైండ్‌సెట్ మారుతోంది. అయితే ఇక్కడా ఓ సమస్య ఉంది. అవసరమైనంత సమయం కేటాయించకుండా తక్కువ సమయంలో, తొందరగా సక్సెస్ సాధించాలని భావిస్తున్నారు. ఏ రంగంలోనైనా సక్సెస్ లభించాలంటే చాలా కష్టపడాలి. ఎంతో ఓపిక ఉండాలి. ఏదైనా సాధించగలమనే నమ్మకం ఉండాలి. ఇలాంటి రిస్క్ తీసుకుంటే క్రీడలపట్ల ఆకర్షితులయ్యే సంఖ్య పెరుగుతుంది. రాజకీయాలను, రాజకీయ పార్టీల వార్తలను ఫాలో అవుతారా? నిజం చెప్పాలంటే అంతగా పట్టించుకోను. అయితే ఇంట్లో సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి అప్పడప్పుడు మాట్లాడుకుంటారు. ఆ సమయంలోనే వాటి గురించి తెలుసుకుంటానుతప్ప ప్రత్యేకంగా రాజకీయాల గురించి ఆలోచించను. రాబోయే ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకుంటారా? ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన సమయాల్లో నేను దేశం తరఫున టోర్నీలు ఆడేందుకు విదేశాల్లో ఉండాల్సి రావడంతో ఓటు వేయలేకపోయాను. ఈసారి మాత్రం ఇక్కడే ఉంటున్నాను. తొలిసారి తప్పకుండా నా ఓటు వేయబోతున్నాను. తెలుగు రాష్ట్రాల ఓటర్లకు మీరిచ్చే సందేశం ఏమిటి? తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అభ్యర్థులు మన కులం వాళ్లని, మన మతం వాళ్లని చూడకుండా సమర్థుడైన నాయకుడికి ఓటు వేయండి. –కరణం నారాయణ -
తెలంగాణ చిన్నారి... థాయ్‌లాండ్‌లో మెరిశాడు
ఆసియా యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలుడు ఆదిరెడ్డి అర్జున్ అద్భుత ప్రదర్శన చేశాడు. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ పోటీల్లో ఎనిమిదేళ్ల అర్జున్ అండర్–8 బాలుర విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత ఏడు రౌండ్లకుగాను అర్జున్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఆరు గేముల్లో నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ మరో గేమ్‌లో ఓడిపోయాడు. అండర్–12 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు డి. గుకేశ్ ఏడు పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. -
ఒలింపియాడ్ పతకమే లక్ష్యం
చెస్ క్రీడాకారిణి ప్రత్యూష తుని : చెస్ ఒలింపియాడ్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని తునికి చెందిన చదరంగం క్రీడాకారిణి బి.ప్రత్యూష తెలిపారు. తుని రైల్వేస్టేçÙన్లో మంగళవారం సాయంత్రం ఆమె విలేకరులతో మాట్లాడారు. వచ్చే నెల 2 నుంచి 14 వరకూ అజర్బైజాన్ దేశం బాకార్ పట్టణంలో నిర్వహించే అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు వెళుతున్నట్టు వివరించారు. ఇండియా నుంచి ఐదుగురు క్రీడాకారిణులతో కూడిన జట్టు ఈ పోటీలకు వెళుతుందన్నారు. ఇందులో ఏపీ నుంచి తనతోపాటు ద్రోణవల్లి హారిక, ఢిల్లీకి చెందిన తానియా సత్యదేవ్, మహారాష్ట్ర నుంచి సౌమ్య స్వామినాథన్, ఒడిశాకు చెందిన పద్మినీ రీత్ ఉన్నారన్నారు. అజర్‌బైజా¯Œæకు బుధవారం బయలుదేరుతున్నట్టు ప్రత్యూష వివరించారు. ప్రస్తుతం 2,329 పాయింట్లతో ఉన్నానని, ఒలిపింయాడ్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది నవంబర్ 10 నుంచి 16 వరకూ కోల్‌కతాలో జరిగే వుమెన్–ఎ టోర్నమెంట్, డిసెంబర్ 2 నుంచి 14 వరకూ లండన్‌లో జరిగే క్లాసిక్ టోర్నీ, సెప్టెంబర్ 18 నుంచి 28 వరకూ ఖతార్‌లో జరిగే ఓపెన్ చెస్ టోర్నమెంట్లలో తాను పాల్గొంటున్నానని చెప్పారు. నవంబర్ నెలాఖరుకు మహిళా గ్రాండ్‌మాస్టర్ అవుతానని ప్రత్యూష వివరించారు. -
చెస్ చాంప్ అర్జున్‌కు సన్మానం
హైదరాబాద్: జాతీయ అండర్-13 చెస్ చాంపియన్‌గా నిలిచిన వరంగల్ కుర్రాడు ఎరిగైసి అర్జున్ను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం (టీఎస్‌సీఏ) సన్మానించింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌సీఏ అధ్యక్షుడు ఎ. నరసింహా రెడ్డి, కార్యదర్శి వెంకటేశ్వర రావు, సంయుక్త కార్యదర్శి కె. కరుణాకర్ రెడ్డిలు అర్జున్ను, అతని కోచ్ రామరాజులను అభినందించారు. ఇటీవల గుజరాత్లో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో అతను బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. 11 రౌండ్ల ఈ టోర్నీలో ఓటమి అన్నదే ఎరుగని అర్జున్ 9 విజయాలు సాధించాడు. రెండు గేముల్లో డ్రా చేసుకొని 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 5, 6 తేదీల్లో చెస్ టోర్నీ టీఎస్‌సీఏ ఆధ్వర్యంలో ర్యాపిడ్ చెస్ టోర్నీ ఈ నెల 5, 6 తేదీల్లో జరగనుంది. బేగంపేట్‌లోని ఇండియన్ ఎయిర్‌లైన్స్ కాలనీలో ఉన్న ఎ9 చెస్ అకాడమీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 10 వేలు. అండర్-7, 9, 11, 13 విభాగాల్లో విజేతలు, రన్నరప్‌గా నిలిచినవారికి నగదు బహుమతి అందజేస్తారు. ఐదు రౌండ్ల స్విస్ లీగ్ ఫార్మాట్లో పోటీలు జరుగుతాయి. మరిన్ని వివరాలకు గుమ్మడి స్రవంతి (99851-55557)ని సంప్రదించవచ్చు. -
‘రారాజు’కుసత్కారం
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే తొలిసారిగా చెన్నైలో ప్రపంచ చెస్ చాంపియన్ టోర్నీ నిర్వహిం చేందుకు చర్యలు తీసుకుంది. ఇందుకు రూ.29 కోట్లను కేటాయించింది. ఈ నెల ఏడో తేదీన నెహ్రూ స్టేడియంలో ప్రపంచ చెస్ చాంపియన్ టోర్నీని ముఖ్యమంత్రి జయలలిత లాంఛనంగా ప్రారంభించారు. ఎనిమిదో తేదీ నుం చి నగరంలోని ఓ స్టార్ హోటల్లో చెస్ టోర్నీ ఆరంభం అయింది. టైటిల్ గెలుచుకోవడం లక్ష్యంగా భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, నార్వేకు చెందిన 22 ఏళ్ల యువకుడు స్వెన్ మాగ్నస్ కార్ల్సెన్ తలపడ్డారు. పన్నెండు రౌండ్ల మ్యాచ్‌లో 6.5 పాయింట్లు సాధించిన వారే విజేతగా నిలుస్తారు. అయితే, పది రౌండ్లలోనే విజయం కార్ల్సెన్ను వరించింది. తొలుత డ్రా దిశగా రౌండ్లు సాగినా, ఐదు, ఆరు, తొమ్మిది రౌండ్లు కార్ల్సెన్కు అనుకూల వాతావరణాన్ని కలిగించడంతో ప్రపంచ చెస్ రారాజుగా నిలిచాడు. బహుమతి ప్రదానోత్సవం: ప్రపంచ చెస్ టైటిల్ దక్కిం చుకున్న విజేతకు బహుమతి ప్రదానోత్సవం సోమవారం ఉదయం నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఇందులో ప్రపంచ చెస్ రారాజు కార్ల్సెన్ను నీలగిరుల్లో లభించే అరుదైన ఆలివ్ ఆకులతో తయారు చేసిన హారంతో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. ఈ వేడుక నిమిత్తం హోటల్ వద్దకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి మహ్మద్ మజీముద్దీన్, క్రీడల అభివృద్ధి శాఖ కార్యదర్శి కే రాజారామన్, ఫిడే ప్రతినిధి హరిహరన్ ఘన స్వాగతం పలికారు. అఖిల భారత చెస్ సమ్మేళనం అధ్యక్షుడు జేసీడీ ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. ఫిడే అధ్యక్షుడు ఇల్లిం షినోను తమిళనాడు చెస్ సంఘం అధ్యక్షుడు వెంకటరామరాజ ఆహ్వానం పలికారు. ముందుగా తమిళ్ తాయ్ వాల్త్, ఫిడే పాటల్ని ప్రార్థనా గీతంగా ఆలపించడం విశేషం. సత్కారం: ఫిడే ప్రపంచ చెస్ టోర్నీ టైటిల్ విజేత కార్ల్సెన్, రన్నరప్‌గా నిలిచిన ఆనంద్‌ను బంగారు, వెండి పతకాలతో ఆ సంస్థ అధ్యక్షుడు ఇల్లిం షినో సత్కరించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా సత్కారం చేశారు. ఆనంద్‌కు 1350 గ్రాముల వెండితో తయారు చేసిన షీల్డ్‌ను, రూ.ఆరు కోట్ల మూడు లక్షల నగదు బహుమతితో కూడిన చెక్‌ను అందజేశారు. అనంతరం రారాజు కార్ల్సెన్కు నీలగిరి కొండల్లో లభించే అరుదైన ఆలివ్ ఆకులతో తయారు చేసిన హారాన్ని జయలలిత అందజేశారు. అలాగే, 3.5 కిలోల బంగారం పూతతో సిద్ధం చేసిన షీల్డ్‌ను బహుకరించారు. రూ. 9.90 కోట్ల ఫ్రైజ్ మనీని చెక్కు రూపంలో అందజేశారు. చివరగా భారత జాతీయ గీతంతో పాటుగా నార్వే జాతీయ గీతంతో 2013 చెస్ టోర్నీ టైటిల్ విజేత బహుమతి ప్రదానోత్సవాన్ని ముగించారు. -
కార్ల్సెన్కు ప్రపంచ చెస్ టైటిల్