ట్విన్స్.. అనగానే నైంటీస్ వారికి టక్కున హలో బ్రదర్ సినిమా కళ్లముందు కదులుతుంది.. మనలో చాలా మంది స్కూల్స్, కాలేజ్ ప్రయాణంలో అనేక మంది కవలలను కలిసే ఉంటారు.. వీరిలో ఎక్కువ మంది ఇద్దరు ఆడవారు.. ఇద్దరు మగవారిని చూసుంటాం.. కొందరు ఇద్దరినీ కలిసి ట్విన్స్‌గా చూసుంటాం.. మనం ఇప్పుడు తెలుసుకునే ట్విన్స్ కూడా అలాంటివారే.. అయితే అలాంటి ఇలాంటి ట్విన్స్ కాదండోయ్.. ఈ ట్విన్నర్స్.. ఆటల్లో విన్నర్స్..వీరే నగరానికి చెందిన అయమ అగర్వాల్, అనయ్ అగర్వాల్.. వీరు చెస్‌లోనూ, ఇతర ఆటల్లోనూ చిరుతల్లా పావులు కదుపుతూ.. పథకాలు గెలుస్తూ.. వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తున్నారు..వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..
శ్రీనగర్‌కాలనీ: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వరుణ్ అగర్వాల్, పనాషా అగర్వాల్ సంతానమే అయమ, అనయ్ అగర్వాల్ అనే కవలలు..వీరికి ప్రస్తుతం తొమ్మిదేళ్లు...నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతున్నారు. చిన్నతనం నుండే అల్లరి ఎక్కువ... ఎక్కువగా గొడవపడుతూ బాగా అల్లరి చేసేవారు. ఆ అల్లరిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో వీరిని ఆటల వైపు మళ్లించాలని తల్లిదండ్రులు భావించారు.
చెస్ వల్ల క్రమశిక్షణతో పాటు మేధస్సు, మైండ్ రిలాక్స్ అవుతుందని తల్లి పనాషా ఇండియన్ చెస్‌మాస్టర్స్ స్కూల్లో చేరి్పంచారు. చేరిన కొద్దిరోజుల్లోనే నగరంలోని జూనియర్ టోర్నమెంట్స్‌లో మెడల్స్ సాధించి ప్రతిభను చాటారు. పాల్గొన్న ప్రతిటోర్నమెంట్‌లోనూ విన్నర్స్‌గా, రన్నర్స్‌గా నిలుస్తూ వచ్చారు. వీరి ప్రతిభకు ముగ్దులైన కోచ్ చైతన్య సురేష్ వీరికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌కి పోటీపడేలా తీర్చిదిద్దారు.
వరల్డ్ ఛాంపియన్స్‌గా..
కోచ్‌ల సహాయంతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌లో పాల్గొన్నారు. గతేడాది ఈజిప్‌్ట, సెర్బియాలోని బిల్‌గ్రేడ్‌లో జరిగిన చెస్‌టోరీ్నలో పాల్గొని ఛాంపియన్స్‌గా నిలిచారు. అమయ ప్రపంచవ్యాప్తంగా 60 మంది క్రీడాకారులతో పోటీపడి అండర్–8 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. చైనా, కెనెడా, మలేషి యా, మంగోలియా, శ్రీలంకలాంటి ఆటగాళ్లను ఎత్తుకు పైఎత్తులతో చిత్తు చేసింది.
ఫిబ్రవరిలో అనయ్ అండర్–8లో 90 మందితో పోటీపడి మెక్సికో, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, మంగోలియాపై విజయాన్ని, రష్యా, శ్రీలంక, ఆ్రస్టేలియా, స్లొవేకియాతో డ్రా చేసుకొని ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ సంవత్సరం చెక్‌రిపబ్లిక్ పరాగ్వేలో జరిగిన చెస్‌టోర్నమెంట్‌లో ఫిడే రేటింగ్‌లో టాప్‌లో ఉన్న వారిలో అనయ్ విన్నర్‌గా, అయమ రన్నర్‌గా నిలిచి ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్స్‌లో అమయ 1728, అనయ్ 1773 రేటింగ్స్‌లో కొనసాగుతున్నారు. ఈ కవల చిచ్చరపిడుగులు రెండు సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటూ దేశ, విదేశాల్లోని చెస్ ఛాంపియన్ షిప్స్‌లో పాల్గొని మెడల్స్‌ను సాధిస్తున్నారు.
చదువుల్లోనూ చురుకే...
అమయ, అనయ్ చెస్‌లోనే కాకుండా చదువుల్లోనూ చురుగ్గా రాణిస్తూ, క్లాస్ టాపర్స్‌గా నిలుస్తున్నారు. చెస్‌తో పాటు పియానో, అథ్లెటిక్స్‌లోనూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు, కోచ్‌లు, స్కూల్ మేనేజ్‌మెంట్‌ల సహకారంతో ఆల్‌రౌండర్స్‌గా నిలుస్తూ ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలుస్తున్న ఈ సూపర్ ట్విన్స్ మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుందామా మరి..
Comments
Please login to add a commentAdd a comment