
ఆసియా యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాలుడు ఆదిరెడ్డి అర్జున్ అద్భుత ప్రదర్శన చేశాడు. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ పోటీల్లో ఎనిమిదేళ్ల అర్జున్ అండర్–8 బాలుర విభాగంలో చాంపియన్‌గా అవతరించాడు. నిర్ణీత ఏడు రౌండ్లకుగాను అర్జున్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
ఆరు గేముల్లో నెగ్గిన ఈ హైదరాబాద్ ప్లేయర్ మరో గేమ్‌లో ఓడిపోయాడు. అండర్–12 బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు డి. గుకేశ్ ఏడు పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు.