
నవ్వు తెప్పించే లాఫింగ్‌గ్యాస్ ఓ జంట ప్రాణాలు తీసింది. ఉక్రెయిన్‌కు చెందిన స్పీడ్ చెస్ చాంపియన్ స్టానిస్‌లావ్ బోగ్డానోవిచ్ (27), అతని స్నేహితురాలు అలెగ్జాండ్రా వెర్నిగోరా (18) మరణించారు. వీరు మాస్కోలోని తమ ఫ్లాట్‌లో విగత జీవులుగా కనిపించారు. ప్లాట్‌లో ఉన్న లాఫింగ్ గ్యాస్ బెలూన్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంతకీ ఎందుకు వారు లాఫింగ్ గ్యాస్ తెచ్చుకున్నారనేది మిస్టరీగా మారింది. ఇద్దరూ కూడా స్పీడ్ చెస్ ఛాంపియన్‌లు. ఇటీవల ఒక ఇంటర్నెట్ చెస్ పోటీలో రష్యా తరఫున బరిలోకి దిగారు. ఉక్రెయిన్‌పై తలపడి, గెలుపొందారు.
అయితే తాజాగా వారిద్దరూ వారం రోజుల నుంచి కనపించకుండా పోయారు. అనంతరం వీరి ఫ్లాట్‌లో శవాలై కనిపించారు. వీరి ఇంట్లో లాఫింగ్ గ్యాస్ బెలూన్లు ఉన్నాయి. బెలూన్ సాయంతో ఈ గ్యాస్‌ను పీలుస్తుంటారని తెలుస్తోంది. ఇది శస్త్రచికిత్సల సమయంలో మత్తు కోసం ఉపయోగిస్తుంటారు. దీన్ని సాధారణంగా పీల్చితే విపరీతమైన నవ్వు తెప్పిస్తుంది. అదే సరదా కోసం సొంతంగా పీల్చితే మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ జంట కూడా నవ్వాలనే ఉద్దేశ్యంతోనే దాన్ని పీల్చి ప్రమాదవశాత్తు ప్రాణాలు వదిలి ఉంటారని అనుమానిస్తున్నారు.
చదవండి: దుర్మార్గులు దొరికారు
Comments
Please login to add a commentAdd a comment