ప్రత్యూష(ఫైల్)
కృష్ణాజిల్లా, పెనమలూరు: రెండు రోజుల క్రితం యనమలకుదురులో అదృశ్యమైన నల్లబోతుల ప్రత్యూష కేసులో పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నేతలు పెనమలూరు పోలీస్‌స్టేషన్ వద్ద శుక్రవారం ఆందోళనకు దిగారు. అత్తింటి వారే ప్రత్యూషను హత్యచేసి కనిపించకుండా చేశారని ఆరోపిస్తూ పోలీసులు నిందితులకు మద్దతుగా ఉన్నారంటూ వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ప్రత్యూష తల్లి నిర్మల స్పృహ కోల్పోవడంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్పందించిన పోలీసులు కేఈబీ కెనాల్‌ను జల్లెడపట్టారు. చివరికి ప్రత్యూష మృతదేహాన్ని చోడవరం గ్రామం వద్ద గుర్తించారు.
ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ప్రత్యూష (20)కు యనమలకుదురు మాజీ పంచాయతీ వార్డు సభ్యుడు నల్లబోతుల విజయ్‌కిరణ్‌తో 2016లో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నాడు. విజయ్‌కిరణ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కాగా భార్యాభర్తల మధ్య కొంత కాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 19న భార్యభర్తల మధ్య మరోసారి వాగ్వివాదం జరిగింది. అదే రోజు రాత్రి ప్రత్యూష కేఈబీ కెనాల్‌లో దూకి గల్లంతైంది. ఈ ఘటనకు ముందు ఆమె తల్లితో ఫోన్‌లో మాట్లాడింది. ఆ తరువాత ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అదే రోజు అర్ధరాత్రి భర్త విజయ్‌కిరణ్ ప్రత్యూష కనబడటంలేదని అత్త నిర్మలకు చెప్పి మౌనంగా ఉండి పోయాడు.
కేఈబీ కెనాల్ నుంచి మృతదేహాన్ని తీస్తున్న దృశ్యం
మిస్సింగ్ కేసు నమోదుపై వివాదం
కాగా ప్రత్యూష కనిపించకపోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రత్యూష తల్లి అల్లుడిపై అనుమానం వ్యక్తంచేసినా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయడం వివాదంగా మారింది. గత మంగళవారం నుంచి ప్రత్యూష కనిపించకపోయినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, అత్తింటి వారికి మద్దతుగా ఉన్నారని ఆరోపిస్తూ శుక్రవారం ప్రత్యూష కుటుంబ సభ్యులు, బంధువులు, మహిళా çసంఘాల నేతలు పోలీస్‌స్టేషన్‌కు వద్ద ఆందోళనకు దిగారు. ఈ సమయంలో ప్రత్యూష తల్లి నిర్మల పోలీస్‌స్టేషన్ వద్ద స్పృహ కోల్పోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment