ప్రత్యూష స్నేహితులపై చర్యలు.. | CINTAA to take action against Dolly Bindra, Rakhi Sawant | Sakshi
Sakshi News home page

ప్రత్యూష స్నేహితులపై చర్యలు..

Published Thu, Apr 14 2016 8:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM

బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్న ఇద్దరు నటీమణులు రాఖీ సావంత్, డాలీ బింద్రాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మెంబర్స్ ఆఫ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సీఐఎన్టీఏఏ) ప్రకటించింది.

ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్న ఇద్దరు నటీమణులు.. రాఖీ సావంత్, డాలీ బింద్రాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మెంబర్స్ ఆఫ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సీఐఎన్టీఏఏ) ప్రకటించింది. 'వీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలీదు. ఓ వైపు నటి చనిపోతే మరోవైపు వీరందరూ పబ్లిసిటీ కోసం పడిచస్తున్నారు. సీఐఎన్టీఏఏలో వీరు కూడా సభ్యులు కావడం మూలన సస్పెండ్ చేయలేకపోతున్నాం' అని వివాదాల కమిటీ చైర్మన్ అమిత్ భేల్ తెలిపారు.

ప్రత్యూష మరణం తర్వాత డాలీ ఆమెతో వాట్సాప్లో జరిపిన సంభాషణను ప్రత్యూష తల్లి సమక్షంలో మీడియా ముందుకు తీసుకువచ్చారు. ప్రత్యూషను ఆసుపత్రికి తీసుకువచ్చినపుడు ఆమె నుదుటి మీద కుంకుమ బొట్టు ఉందని ఆమె పేర్కొంది. ఆత్మహత్యలు ఆగాలంటే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫ్యాన్లను బ్యాన్ చేయాలంటూ రాఖీ కోరింది. ఈ అంశాలపై సీఐఎన్టీఏఏ సభ్యులతో చర్చించానని త్వరలో చర్యలపై మాట్లాడుతానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement