CiNTAA
-
ఆర్టిస్టులకు హృతిక్ రోషన్ సాయం
కరోనా అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీని కూడా దెబ్బ కొట్టింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల షూటింగులు లేక ఎంతోమంది సినీకార్మికులు రోడ్డున పడ్డారు. పని లేక పూట గడవని స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ ముందుకు వచ్చాడు. సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA)కు 20 లక్షల రూపాయల విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. అంతే కాకుండా సింటా సభ్యులకు నిత్యావసర సరుకులను సైతం అందించాడు. ఈ విషయాన్ని సింటా జనరల్ సెక్రటరీ అమిత్ బేల్ మీడియాకు వెల్లడించాడు. 'హృతిక్ అందించిన డబ్బును నిరుపేద కార్మికులకు అందించాం. ఈ స్టార్ హీరో గతేడాది కూడా రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. అతడి సాయం మాకెంతగానో ఉపయోగపడుతోంది. నటుడు విక్కీ కౌశల్ రూ.2.5 లక్షలు, నటి ఫ్లోరా సైనా రూ.25 వేలు అందించారు' అని తెలిపాడు. చదవండి: హృతిక్ రోషన్ మాజీ భార్య పోస్టుపై బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్ వైరల్! -
క్షమాపణలు సరిపోవు
నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు హిందీ పరిశ్రమలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘హార్న్ ఓకే ప్లీజ్ ’ సినిమా టైమ్‌లో నానా పటేకర్ తనను వేధించిన విషయాన్ని సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు (సీఐఎన్‌టీఏఏ) ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందని తనుశ్రీ వాపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడే తనుశ్రీ కారుపై జరిగిన దాడి తాలూకు వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో నిజమా? కాదా? అనే చర్చ జరుగుతోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు సీఐఎన్‌టీఏఏ స్పందించింది. ‘‘ 2008లో తనుశ్రీ చేసిన ఫిర్యాదును సక్రమంగా పరిష్కరించలేకపోయామని చెప్పడానికి చింతిస్తున్నాం. అప్పటి చీఫ్ గ్రీవెన్స్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ విభాగం ఈ ఇష్యూను సమావేశంలో ప్రస్తావించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విధుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెకు మా క్షమాపణలు సరిపోవు. కానీ నిబంధనల ప్రకారం మూడేళ్ల క్రితం నాటి కేసులు అసోషియేషన్ పరిగణించదు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులను మా అసోసియేషన్ తేలికగా తీసుకోదు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే తనుశ్రీ వివాదం కొలిక్కి రావాలని అందుకోసం ఓ ఎంక్వైరీ టీమ్ ఉండాలని సంబంధిత ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం’’ అని సీఐఎన్‌టీఏఏ ప్రతినిధులు ఓ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారంటూ బాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. అలాగే తనుశ్రీకి ఎవరో బెదిరింపు కాల్స్ చేయడంతో ఆమెకు ముంబై పోలీసులు రక్షణ కూడా ఇస్తున్నారన్నది తాజా సమాచారం. మరోవైపు తాను చేసిన ఆరోపణలకు సంబంధించి నానా పటేకర్ నుంచి తనకు ఇంకా ఏ నోటీసులు రాలేదని తనుశ్రీ అంటున్నారని బాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే నటి డింపుల్ కపాడియా ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో నానా ఎంతో ప్రతిభ ఉన్నవాడని ప్రశంసల వర్షం కురిపించిన డింపుల్ అతనిలో ఉన్న ‘డార్క్ సైడ్’ కూడా తెలుసు అనడం విశేషం. -
ప్రత్యూష స్నేహితులపై చర్యలు..
ముంబై: బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ మరణాన్ని పబ్లిసిటీ కోసం వాడుకుంటున్న ఇద్దరు నటీమణులు.. రాఖీ సావంత్, డాలీ బింద్రాలపై చర్యలు తీసుకుంటున్నట్లు మెంబర్స్ ఆఫ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(సీఐఎన్‌టీఏఏ) ప్రకటించింది. 'వీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు తెలీదు. ఓ వైపు నటి చనిపోతే మరోవైపు వీరందరూ పబ్లిసిటీ కోసం పడిచస్తున్నారు. సీఐఎన్టీఏఏలో వీరు కూడా సభ్యులు కావడం మూలన సస్పెండ్ చేయలేకపోతున్నాం' అని వివాదాల కమిటీ చైర్మన్ అమిత్ భేల్ తెలిపారు. ప్రత్యూష మరణం తర్వాత డాలీ ఆమెతో వాట్సాప్‌లో జరిపిన సంభాషణను ప్రత్యూష తల్లి సమక్షంలో మీడియా ముందుకు తీసుకువచ్చారు. ప్రత్యూషను ఆసుపత్రికి తీసుకువచ్చినపుడు ఆమె నుదుటి మీద కుంకుమ బొట్టు ఉందని ఆమె పేర్కొంది. ఆత్మహత్యలు ఆగాలంటే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫ్యాన్లను బ్యాన్ చేయాలంటూ రాఖీ కోరింది. ఈ అంశాలపై సీఐఎన్‌టీఏఏ సభ్యులతో చర్చించానని త్వరలో చర్యలపై మాట్లాడుతానని తెలిపారు.