క్షమాపణలు సరిపోవు | CINTAA apologises for ignoring 2008 complaint in Tanushree Dutta-Nana Patekar controversy | Sakshi
Sakshi News home page

క్షమాపణలు సరిపోవు

Published Thu, Oct 4 2018 1:08 AM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

CINTAA apologises for ignoring 2008 complaint in Tanushree Dutta-Nana Patekar controversy - Sakshi

తనుశ్రీ దత్తా

నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు హిందీ పరిశ్రమలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘హార్న్‌ ఓకే ప్లీజ్‌ ’ సినిమా టైమ్‌లో నానా పటేకర్‌ తనను వేధించిన విషయాన్ని సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌కు (సీఐఎన్‌టీఏఏ) ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండాపోయిందని తనుశ్రీ వాపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడే తనుశ్రీ కారుపై జరిగిన దాడి తాలూకు వీడియో ఒకటి బయటికొచ్చింది.

ఆ వీడియో నిజమా? కాదా? అనే చర్చ జరుగుతోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పుడు సీఐఎన్‌టీఏఏ స్పందించింది. ‘‘ 2008లో తనుశ్రీ చేసిన ఫిర్యాదును సక్రమంగా పరిష్కరించలేకపోయామని చెప్పడానికి చింతిస్తున్నాం. అప్పటి చీఫ్‌ గ్రీవెన్స్‌ ఆఫ్‌ సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ విభాగం ఈ ఇష్యూను సమావేశంలో ప్రస్తావించలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పటి విధుల్లో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఆమెకు మా క్షమాపణలు సరిపోవు.

కానీ నిబంధనల ప్రకారం మూడేళ్ల క్రితం నాటి కేసులు అసోషియేషన్‌ పరిగణించదు. ఇకపై ఇలాంటి ఫిర్యాదులను మా అసోసియేషన్‌ తేలికగా తీసుకోదు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే తనుశ్రీ వివాదం కొలిక్కి రావాలని అందుకోసం ఓ ఎంక్వైరీ టీమ్‌ ఉండాలని సంబంధిత ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తాం’’ అని సీఐఎన్‌టీఏఏ ప్రతినిధులు ఓ ప్రెస్‌ నోట్‌ను విడుదల చేశారంటూ బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అలాగే తనుశ్రీకి ఎవరో బెదిరింపు కాల్స్‌ చేయడంతో ఆమెకు ముంబై పోలీసులు రక్షణ కూడా ఇస్తున్నారన్నది తాజా సమాచారం.

మరోవైపు తాను చేసిన ఆరోపణలకు సంబంధించి నానా పటేకర్‌ నుంచి తనకు ఇంకా ఏ నోటీసులు రాలేదని తనుశ్రీ అంటున్నారని బాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే నటి డింపుల్‌ కపాడియా ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ ఇంటర్వ్యూలో నానా ఎంతో ప్రతిభ ఉన్నవాడని ప్రశంసల వర్షం కురిపించిన డింపుల్‌ అతనిలో ఉన్న ‘డార్క్‌ సైడ్‌’ కూడా తెలుసు అనడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement