ఆర్టిస్టులకు హృతిక్‌ రోషన్‌ సాయం | Hero Hrithik Roshan Money And Groceries Donates To CINTAA Amid Coronavirus | Sakshi
Sakshi News home page

సినీ కార్మికుల కోసం బాలీవుడ్‌ స్టార్‌ హీరో విరాళం

Jun 4 2021 5:52 PM | Updated on Jun 4 2021 6:02 PM

Hero Hrithik Roshan Money And Groceries Donates To CINTAA  Amid Coronavirus - Sakshi

సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (CINTAA)కు 20 లక్షల రూపాయల విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. అంతే కాకుండా..

కరోనా అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీని కూడా దెబ్బ కొట్టింది. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల షూటింగులు లేక ఎంతోమంది సినీకార్మికులు రోడ్డున పడ్డారు. పని లేక పూట గడవని స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ముందుకు వచ్చాడు. సినీ అండ్‌ టీవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (CINTAA)కు 20 లక్షల రూపాయల విరాళం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు. అంతే కాకుండా సింటా సభ్యులకు నిత్యావసర సరుకులను సైతం అందించాడు. 

ఈ విషయాన్ని సింటా జనరల్‌ సెక్రటరీ అమిత్‌ బేల్‌ మీడియాకు వెల్లడించాడు. 'హృతిక్‌ అందించిన డబ్బును నిరుపేద కార్మికులకు అందించాం. ఈ స్టార్‌ హీరో గతేడాది కూడా రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చాడు. అతడి సాయం మాకెంతగానో ఉపయోగపడుతోంది. నటుడు విక్కీ కౌశల్‌ రూ.2.5 లక్షలు, నటి ఫ్లోరా సైనా రూ.25 వేలు అందించారు' అని తెలిపాడు.

చదవండి: హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య పోస్టుపై బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement