హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల మృతిపై మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఎమోషనల్ అయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ఎంతోమంది హీరోయిన్లకు డిజైనర్‌గా వ్యవహరించిన ప్రత్యూష శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె సినీ సెలబ్రెటీలు హీరోయిన్లు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన కూడా తన స్నేహితురాలైన ప్రత్యూష మృతికి నివాళులు అర్పించారు.
చదవండి: నా సినిమా ఫ్లాప్ అయినా కూడా రానా బాగుందనేవాడు: కమల్ హాసన్
ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. ‘మై బెస్టీ మై డియరెస్ట్ ఫ్రెండ్. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. తన మరణం నన్ను చాలా బాధిస్తోంది. ప్రతి విషయంలో ఎంతో ది బెస్ట్‌గా ఉండేది. ఇక కెరీర్, ఫ్యామిలీ, స్నేహితులు విషయంలోనూ ఉన్నత నిర్ణయాలు తీసుకునేది. అలా అన్ని విషయాల్లో ది బెస్ట్‌గా ఉండే ఆమె కూడా డిప్రెషన్‌కు గురైంది. ఈ సంఘటన తర్వాత కర్మ అనేది మన జీవితకాలం గుండా పయనిస్తుందనేది నిజమనిపిస్తుంది. తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఉపాసన భావోద్వేగానికి లోనయ్యారు.
చదవండి: Prathyusha Garimella: ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఆత్మహత్య
కాగా ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూష తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఎంతోమంది హీరోహీరోయిన్లకు, సెలబ్రిటీలకు ప్రత్యూష కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. టాలీవుడ్‌లో శృతిహాసన్, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధాదాస్, కాజల్, కీర్తి సురేశ్, కృతి కర్బందా, ఉపాసన, ప్రగ్యా జైస్వాల్, రానా, రామ్ చరణ్‌లకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. బాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరోయిన్లకు సైతం ఆమె ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేశారు. దీపికా పదుకొనె, పరిణితి చోప్రా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మాధురి దీక్షిత్, విద్యాబాలన్‌కు కూడా వర్క్ చేశారు. ఆమె డిజైన్ చేసిన డ్రెస్సులను కూడా చాలా మంది సెలబ్రెటీలు ఎండార్స్ కూడా చేశారు.
My bestie my dearest friend.
— Upasana Konidela (@upasanakonidela) June 11, 2022
Gone too soon - Upset/ Pissed / Sad
She had the best of everything, career, friends & family - yet succumbed to depression.
Post this incident, truly believe that karmic baggage passes through lifetimes.
We pray for her peace. 🙏#rip P pic.twitter.com/1aOXixKh85
Comments
Please login to add a commentAdd a comment