ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విడుదలయ్యారు.
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విడుదలయ్యారు. మంగళవారం సాయంత్రం చర్లపల్లి జైలు నుంచి సండ్ర బెయిల్పై బయటకు వచ్చారు.
ఈ రోజు ఏసీబీ కోర్టు సండ్ర వెంకట వీరయ్యకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఏసీబీ కోర్టు సండ్రకు షరతు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు సండ్ర న్యాయవాదులు రూ. 2 లక్షలను పూచీకత్తుగా చెల్లించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా వెలుగుచూసిన ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్రను ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.