న్యూఢిల్లీ: గతంలో అనేక సార్లు జరిగినట్టే ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఘోరంగా తప్పాయి! బిహార్‌లో బీజేపీ విజయం తథ్యం అని ప్రకటిం చినా సర్వేలన్నీ తారుమారయ్యాయి. రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుం దని పేరున్న ‘టుడేస్ చాణక్య’ కూడా తప్పులో కాలేసింది. ఇప్పుడు తన అంచనాకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. బీజేపీ కూటమి ఏకంగా 155 సీట్లు నెగ్గుతుందని, మహాకూటమి 83 సీట్లకే పరిమితం అవుతుందని టుడేస్ చాణక్య తెలిపింది. అయితే ఫలితాలు పూర్తి భిన్నంగా రావడంతో ‘మా అంచనాలు తప్పినందుకు మా మిత్రులు, శ్రేయోభిలాషులు, అందరినీ క్షమాపణలు కోరుతున్నాం.
బిహార్ నాడి పట్టలేకపోయాం. విజేతలకు అభినందనలు’ అని ఆ సం స్థ ప్రకటించింది. బీజేపీ నేతృత్వంలోని కూటమి 120-130 సీట్లు గెల్చుకుం టుందని, జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమి 105-115 సీట్లు దక్కించుకుంటుందన్న ఎన్డీటీవీ అంచనా కూడా తప్పింది. దైనిక్ జాగరణ్ జరిపిన సర్వేలో ఎన్డీఏ 130, మహా కూటమి 97 సీట్లు గెల్చుకుంటాయని తేలింది. ఏబీపీ న్యూస్-నీల్సన్ కూడా బీజేపీ కూటమి 130, మహా కూటమి 108 సీట్లు నెగ్గుతుందని తెలిపింది. ఇండియా టుడే-సిసిరో బీజేపీ కూటమి 120, మహాకూటమి 117 సీట్లు గెల్చుకుంటాయని అంచనా వేసింది.
కచ్చితంగా అంచనా వేసినవి ఇవీ: కొన్ని సంస్థలు, నిపుణులు బిహార్ ఫలితాలను కచ్చితంగా అంచనా వేయగలిగారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, రాజకీయ విశ్లేషకుడు యోగేంద్రయాదవ్ బిహార్‌లో నితీశ్ కూటమిదే విజయమని, మహకూటమి 130 సీట్లకుపైగా సొంతం చేసుకోవచ్చని చెప్పారు. న్యూస్ నేషన్ కూడా వాస్తవ ఫలితాలకు దగ్గరగా వచ్చింది. ఈ సంస్థ మహా కూటమికి 122, బీజేపీకి 117 సీట్లు వస్తాయని చెప్పింది. న్యూస్‌ఎక్స్, సీఎన్‌ఎక్స్ కూడా మహాకూటమి 135 సీట్లు నెగ్గి విజయం సాధిస్తుందని చెప్పింది.
ఎగ్జిట్ పోల్స్ తలకిందులు!
Published Mon, Nov 9 2015 3:08 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement