
సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఆలస్యం కావడం వల్ల సోషల్ మీడియాలో వ్యంగ్యంగా జోకులు వేస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. టీజేఎస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల కీలక సందర్భంలో సీట్లపై తేల్చకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. ఇప్పటికే మహాకూటమి ఉమ్మడిగా ప్రచారం మొదలు పెట్టాల్సి ఉందని, కూటమిలోని అతిపెద్ద భాగస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్సే ఈ జాప్యానికి కారణమని తెలిపారు. సీట్ల సర్దుబాట్లపై రోడ్ మ్యాప్ లేనందునే అనిశ్చితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్లు సర్దుబాటు, ఎజెండా అంశాలపై ఇప్పటికీ సరైన స్పష్టత లేద న్నారు. సీట్ల సర్దుబాటుపై రెండు మూడురోజు ల్లో పూర్తవుతుందన్నారు. పార్టీ కార్యాలయం శనివారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో సీట్ల సర్దుబాటు, పొత్తుల ప్రక్రియ, భవిష్యత్తు కార్యచరణపై చర్చ జరిగినట్లు కోదండరాం తెలిపారు. సీట్లను గౌరవంగా ఇవ్వకుంటే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీకి సూచించినట్టు చెప్పా రు. ఉమ్మడి సింబల్ గురించి ఈసీ నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిపారు.
అడిగింది 39 స్థానాలు...దక్కింది 8 స్థానాలు
గత 35 ఏళ్లుగా వరంగల్ పశ్చిమ, నిజామాబాద్, తాండూర్ వంటి చాలా స్థానాల్లో కాంగ్రెస్‌పార్టీ అసలు గెలవలేదని, కాంగ్రెస్‌పార్టీ బలహీనంగా ఉన్న ఆ నియోజకవర్గాల్లోనే టీజేఎస్ స్థానాలకు కోరిందని తెలిపారు. అలాంటి 21 నియోజకవర్గాల్లో టీజేఎస్‌కు నిలదొక్కుకునే శక్తి ఉందని వివరించారు. కూటమిలో మొత్తంగా తాము ముందుగా 39 అసెంబ్లీ స్థానాలను కోరామని ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గానికి ఒక సీటు చొప్పున 17 నియోజకవర్గాలు ఇవ్వాలని అడిగినట్టుగా ఆయన వెల్లడించారు. ఆ తరువాత 12 స్థానాలకు అంగీకరించామని, చివరకు 10 స్థానాలను కూడా ఒప్పుకున్నట్టుగా కోదండరాం చెప్పారు. కాం గ్రెస్ పార్టీ 8 స్థానాలతో జాబితాను ఇచ్చిందన్నారు.
కూటమి స్ఫూర్తిని దెబ్బతీయకూడదనే...
బెల్లంపల్లి, అశ్వారావుపేట వంటి పేర్లను కూడా వాటిలో చేర్చారని కోదండరాం చెప్పారు. సామాజిక న్యాయం కోసం ఎస్సీ, ఎస్టీ సీట్లు అడిగామని, మెద క్, దుబ్బాక స్థానాలను ఇచ్చారని చెప్పారు. చివరికి టీజేఎస్‌కు ఇచ్చిన 8 స్థానాల్లో స్పష్టతను ఇవ్వాలని కోరామన్నారు. సిద్దిపేటతో పాటు అనేక స్థానాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉందన్నారు. కూటమి స్ఫూర్తి్తని దెబ్బతీయకూడదనే ఓపిగ్గా ఉన్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment