కూచ్‌బెహార్: కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటుకు తాను ప్రయత్నిస్తుండగా, తమ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎం భిన్న స్వరాలు వినిపిస్తున్నాయని టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల చర్యలు రాష్ట్రంలో బీజేపీకి లాభం కలిగించేలా ఉన్నాయని విమర్శించారు. కూచ్‌బెహార్‌లో సోమవారం జరిగిన పంచాయతీ ఎన్నికల ర్యాలీలో మమత మాట్లాడారు. ‘కేంద్రంలోని బీజేపీపై పోరాడేందుకు మేం మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.
కానీ, బెంగాల్‌ల్‌లో మాత్రం సీపీఎం, కాంగ్రెస్‌లు బీజేపీతో కలిసి పనిచేస్తున్నాయి. అటువంటి అపవిత్ర బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాం’అని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్ బెంగాల్ అధ్యక్షుడు ఆధిర్ రంజన్ ఛౌధురి స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో టీఎంసీ విశ్వసనీయతపై ఎప్పటి నుంచో అనుమానాలున్నాయన్నారు. బీజేపీపై పోరాటం విషయంలో తమకు చెప్పే అర్హత మమతా బెనర్జీకి లేదని సీపీఎం ఎదురుదాడి చేసింది. ఈ నెల 23న బిహార్‌లోని పట్నాలో సీఎం నితీశ్ సారథ్యంలో 12కు పైగా రాజకీయ పార్టీల నేతలు సమావేశమై 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోరాడాలని వీరు నిర్ణయించారు. తాజాగా మమతా బెనర్జీ మరో బాంబు పేల్చడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment