
పట్నా : రాహుల్ గాంధీ వల్లే తాను మహాకూటమి నుంచి బయటకు వచ్చానని తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఈ విషయం గురించి నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మీద వచ్చిన అవినీతి ఆరోపణల పట్ల రాహుల్ గాంధీ ఒక స్టాండ్ తీసుకోలేకపోయారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం వంటి అంశాలను నేను ఎన్నటికి అంగీకరించను. ఆర్జేడీ విధానాలు ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోవు. దాంతో వారితో కలిసి పనిచేయడం నాకు చాలా కష్టంగా మారింద’ని తెలిపారు.
అంతేకాక ‘ప్రతి విషయంలో వాళ్లు నాకు అడ్డుపడేవారు. ఆ పార్టీ కార్యకర్తలు నా అనుమతి లేకుండానే ప్రతి చిన్న విషయానికి పోలీస్ స్టేషన్‌లకు ఫోన్ చేసేవారు. ఇవన్ని నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాయి. అయితే వీటన్నింటి గురించి రాహుల్ గాంధీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో నేను కూటమి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింద’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment