సాక్షి, కొత్తగూడెం: రెండు నెలలుగా కొనసాగుతున్న ఉన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పినపాక అభ్యర్థిగా రేగా కాంతారావు పేర్లను వెల్లడించారు. భద్రాచలం నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా అశ్వారా వుపేట స్థానాన్ని టీడీపీకి కేటాయించగా, అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఇల్లెందు విషయంలో మాత్రం ఇంకా ముడి వీడలేదు.
ఆ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం 31 మంది దర ఖాస్తు చేసుకున్నారు. వీరిలో హరిప్రియ, చీమల వెంక టేశ్వర్లు, దళ్‌సింగ్, డాక్టర్ రామచంద్రనాయక్‌తో పా టు, తాజాగా టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇల్లెందు టికెట్ విషయంలో పార్టీ నాయ కత్వం డైలమాలో ఉంది. తొలి జాబితాలో ఇక్కడి అభ్యర్థిని ప్రకటిస్తే రెబెల్స్ భారీగా ముందు కొస్తారని, అం దుకే నామినేషన్ల ఘట్టం చివరి వరకు పెండింగ్‌లో పెట్టునున్నారని తెలుస్తోంది. ఇక పినపాక అభ్యర్థిగా రేగా కాంతారావు పేరు అందరూ ఊహించిందే. ఆయ న 2009లో మొదటిసారి విజయం సాధించారు. 2014 లో పొత్తుల్లో భాగంగా ఈ సీటును సీపీఐకి కేటాయించడంతో రేగాకు టికెట్ దక్కలేదు. అయిన్పప్పటికీ పార్టీని వీడకుండా విధేయంగా పనిచేయడంతో ఈసారి టికెట్ వరించింది.
కొత్తగూడెం అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు తీవ్ర పోటీని తట్టుకుని టికెట్ సాధించారు. ఇక్కడి నుంచి ఎడవల్లి కృష్ణ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు సైతం చివరకు వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించగా, భంగపాటుకు గురైన వనమా చివరి నిమిషంలో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం టికెట్ సాధించారు. భద్రాచలం అభ్యర్థి పొదెం వీరయ్య స్థానికేతరుడు. ములుగు టికెట్ కోసం వీరయ్య గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ స్థానాన్ని దనసరి అనసూయ(సీతక్క) దక్కించుకోవడంతో వీరయ్యకు స్థానచలనం తప్పలేదు. ఇక పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి అశ్వారావుపేట టికెట్ దక్కించుకున్న మెచ్చా నాగేశ్వరరావు గత ఎన్నికల్లోనూ టీడీపీ తరఫునే పోటీ చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment