illendunu
-
మిగిలింది...ఇల్లెందే!
సాక్షి, కొత్తగూడెం: రెండు నెలలుగా కొనసాగుతున్న ఉన్న ఉత్కంఠకు తెరపడింది. కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, పినపాక అభ్యర్థిగా రేగా కాంతారావు పేర్లను వెల్లడించారు. భద్రాచలం నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను ప్రకటించారు. పొత్తుల్లో భాగంగా అశ్వారా వుపేట స్థానాన్ని టీడీపీకి కేటాయించగా, అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఇల్లెందు విషయంలో మాత్రం ఇంకా ముడి వీడలేదు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం 31 మంది దర ఖాస్తు చేసుకున్నారు. వీరిలో హరిప్రియ, చీమల వెంక టేశ్వర్లు, దళ్‌సింగ్, డాక్టర్ రామచంద్రనాయక్‌తో పా టు, తాజాగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కూడా రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇల్లెందు టికెట్ విషయంలో పార్టీ నాయ కత్వం డైలమాలో ఉంది. తొలి జాబితాలో ఇక్కడి అభ్యర్థిని ప్రకటిస్తే రెబెల్స్ భారీగా ముందు కొస్తారని, అం దుకే నామినేషన్ల ఘట్టం చివరి వరకు పెండింగ్‌లో పెట్టునున్నారని తెలుస్తోంది. ఇక పినపాక అభ్యర్థిగా రేగా కాంతారావు పేరు అందరూ ఊహించిందే. ఆయ న 2009లో మొదటిసారి విజయం సాధించారు. 2014 లో పొత్తుల్లో భాగంగా ఈ సీటును సీపీఐకి కేటాయించడంతో రేగాకు టికెట్ దక్కలేదు. అయిన్పప్పటికీ పార్టీని వీడకుండా విధేయంగా పనిచేయడంతో ఈసారి టికెట్ వరించింది. కొత్తగూడెం అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు తీవ్ర పోటీని తట్టుకుని టికెట్ సాధించారు. ఇక్కడి నుంచి ఎడవల్లి కృష్ణ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు సైతం చివరకు వరకు తీవ్ర ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించగా, భంగపాటుకు గురైన వనమా చివరి నిమిషంలో వైఎస్సార్సీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరి ప్రస్తుతం టికెట్ సాధించారు. భద్రాచలం అభ్యర్థి పొదెం వీరయ్య స్థానికేతరుడు. ములుగు టికెట్ కోసం వీరయ్య గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ స్థానాన్ని దనసరి అనసూయ(సీతక్క) దక్కించుకోవడంతో వీరయ్యకు స్థానచలనం తప్పలేదు. ఇక పొత్తుల్లో భాగంగా టీడీపీ నుంచి అశ్వారావుపేట టికెట్ దక్కించుకున్న మెచ్చా నాగేశ్వరరావు గత ఎన్నికల్లోనూ టీడీపీ తరఫునే పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు చేతిలో ఓడిపోయారు. -
ఇల్లెందును ముక్కలు చేయొద్దు
సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ఖమ్మం సిటీ: జిల్లాల పునర్విభజన పేరుతో ఇల్లెందు నియోజకవర్గాన్ని ముక్కలు చేయొద్దని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల పునర్విభజన ముసాయిదాలో శాస్త్రీయత లోపించిందని, ఆయా ప్రాంతాల చారిత్రక.. సాంస్కతిక అస్థిత్వానికి ముప్పు ఏర్పడిందని అన్నారు. జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను భౌగోళికాంశాల ఆధారంగా మహబూబాబాద్‌లో కలిపితే ఖమ్మం జిల్లాకు నష్టం కలుగుతుందన్నారు. ఈ రెండు మండలాల్లోని ప్రజలకు జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం ద్వారా పెద్ద గాయం చేశారని, ఇప్పుడు మరో రెండింటిని కూడా తొలగిస్తే.. ఆ గాయంపై కారం చల్లినట్టుగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా చేయకుండా ఖమ్మం లేదా కొత్తగూడెం జిల్లాలో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం మండలంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇప్పటివరకు గంపెడాశతో ఉన్న ఇక్కడి నిరుద్యోగ యువత.. ప్రభుత్వ నిర్ణయంతో నిరాశ, నిస్పహలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వనరులు కోల్పోయిన ఖమ్మం జిల్లా బీదగా మారే ప్రమాదముందన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామన్న మంత్రి తుమ్మల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా సాగు నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం కింద ఇప్పటివరకూ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. ఇది మాటల ప్రభుత్వమేనని, చేతులు ఉండవనే విషయానికి ఇది నిదర్శనమని అన్నారు. చేసే పనులను మాత్రమే చెప్పాలని తుమ్మలకు హితవు పలికారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు ఇస్తామని సీఎం కేసీఆర్ గొప్పలు చెబుతున్నారని, వాస్తవానికి తెలంగాణలో అంత సాగు భూమి లేదని రెవెన్యూ సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. లేని భూమికి నీళ్లెలా ఇస్తారని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు జానిమియా, సలాం, నర్సింహారావు, పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.