
కిచెన్‌లో పని చేస్తుండగా పొరపాటున గిన్నెలు, వంటకాలు జారి కింద పడిపోవడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు గ్యాస్ పేలడం వంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. అందుకే వంటగదిలో ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. తాజాగా కిచెన్‌లో వంట చేస్తున్న ఓ మహిళ నెత్తిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ షాకింగ్ ఘటన సెప్టెంబర్ 16 చోటుచేసుకుంది.
చదవండి: ‘లంచం ఇస్తే తీసుకోండి.. కానీ’.. వివాదాస్పదంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు
వీడియోలో.. ఓ మహిళ వంటగదిలో వంట చేస్తోంది. ఓ వంటకం కోసం కొన్ని పదార్థాలను తీసుకోవడానికి కిందకు వంగి ఓ ప్లేట్ తీసుకుంది. ఆ సమయంలోనే స్టవ్ మంట వద్ద మహిళ జుట్టు తాకడంతో ఆకస్మాత్తుగా ఆమె జుట్టులో మొదట పొగ రావడం కనిపించింది. కానీ దానిని మహిళ గుర్తించలేదు. అప్పుడే కొన్ని వస్తువులు కిందపడదడంతో వాటిని తీసుకొనేందుకు మరోసారి కిందకు వంగారు. అప్పటికీ మంటను గమనించకుండా కిచెన్ అంతా తిరుగుతూ తన పని చేసుకుంటూ పోయారు.
చదవండి: అక్కడికి వెళ్తే ఈ స్వీట్ తినడం మాత్రం మర్చిపోకండి.. అద్భుతం.!
ఇలా 45 సెకన్ల తరువాత ఆమె తలపై వేడిగా అనిపించడంతో మహిళ జుట్టపై మంటలు అంటుకున్నాయిని గుర్తించారు. వెంటనే ఆమె మంటలను ఆర్పి వేసి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రశాంత్ సాహూ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వంటగదిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
చదవండి: వైరల్: ఇదేం వింత.. ఆ బాలిక ఏడిస్తే కంట్లోంచి రాళ్లు వస్తాయట!
Comments
Please login to add a commentAdd a comment