ఇలాంటి బెంజ్ కారు ఎప్పుడైనా చూసారా! ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్.. | Mercedes-Maybach Vision 6 Concept Coupe Showcased In India - Sakshi
Sakshi News home page

ఇలాంటి బెంజ్ కారు ఎప్పుడైనా చూసారా! ఇండియాలో ఇదే ఫస్ట్ టైమ్..

Published Thu, Oct 12 2023 4:18 PM | Last Updated on Thu, Oct 12 2023 5:39 PM

Mercedes Benz New Car Vision 6 Concept Details - Sakshi

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇప్పటికే భారతీయ మార్కెట్లో అనేక ఆధునిక మోడల్స్ ప్రవేశపెట్టి అత్యధిక ప్రజాదరణ పొందింది. కాగా ఇటీవల ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో విజన్ మేబ్యాక్ 6 ఎలక్ట్రిక్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది.

మెర్సిడెస్ బెంజ్ ప్రదర్శించిన ఈ కొత్త కారు దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా అద్భుతంగా ఉండటం గమనించవచ్చు. 2016లో కాలిఫోర్నియాలోని పెబుల్ బీచ్‌లో అడుగుపెట్టి ఈ కారు దాదాపు 7 సంవత్సరాలకు దేశీయ విఫణిలో కనిపించింది.

దాదాపు 6 మీటర్ల పొడవున్న ఈ కారు డిజైన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. కావున ఇది ఒక్క చూపుతోనే చూపరులను ఆకట్టుకుంటుంది. ఎల్ఈడీ లైట్స్, ఇంటిగ్రేటెడ్ డిఫ్యూజర్, 24 ఇంచెస్ వీల్స్ వంటివి ఇందులో కనిపిస్తాయి. అయితే ఇంటీరియర్ ఫీచర్స్ గురించి కంపెనీ వెల్లడించలేదు.

ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్

80 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లతో 750 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఒక చార్జితో ఏకంగా 500 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ లేటెస్ట్ లగ్జరీ బెంజ్ కారు గురించి చాలా వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement