1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe: చంద్రయాన్-3 ఇటీవల చంద్రుని మీద అడుగుపెట్టి భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా చరిత్రలో 'ఇండియా' పేరు సువర్ణాక్షరాలతో లికించడానికిది దోహదపడింది. అరుదైన గొప్ప రికార్డుని సొంతం చేసుకున్న చంద్రయాన్-3 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు రూ.615 కోట్ల బడ్జెట్ వెచ్చించినట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పటి వరకు విక్రయించిన అత్యంత ఖరీదైన ఒక బెంజ్ కారు భారతీయ చంద్రయాన్-3 బడ్జెట్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ కారు ఏది? దాని ఖరీదెంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే..
నివేదికల ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు 1955 మెర్సిడెస్ 300 ఎస్ఎల్ఆర్ 'ఉహ్లెన్‌హాట్ కూపే' (1955 Mercedes-Benz 300 SLR Uhlenhaut Coupe) అని తెలుస్తోంది. ఈ కారుని వేలం పాటలో 143 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1203 కోట్లు.
జర్మనీలో స్టుట్‌గార్ట్‌లోని మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఆర్ఎమ్ సోథెబీస్ నిర్వహించిన ఒక ప్రైవేట్ వేలంలో ఈ కారు కనీవినీ ఎరుగని ధరకు అమ్ముడైంది. ఈ కారు ఎందుకు ఇంత ఖరీదైనదంటే? ఇలాంటి మోడల్స్ ప్రపంచంలో కేవలం రెండు మాత్రమే ఉన్నాయి.
ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న పుష్ప నటుడు - ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!
నిజానికి ఈ కార్లు లే మాన్స్‌లో రేసింగ్‌కు వెళ్ళడానికి అనుకూలంగా బెంజ్ కంపెనీ తయారు చేయడం జరిగింది. దీని సృష్టించిన సృష్టికర్త పేరునే ఈ కారుకి పెట్టడం ఇక్కడ గమనించవలసిన విషయం. ఈ కారు గరిష్ట వేగం 180 మైల్స్/గం (గంటకు 289.6 కిమీ) అని తెలుస్తోంది. ఈ కారు చాలా రేసుల్లో ఉపయోగించిన తరువాత కేవలం సెలబ్రిటీలను రవాణా చేయడానికి ఉపయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment