మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో 'మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్‌లిఫ్ట్' లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ. 3.35 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.
మేబ్యాక్ GLS 600 సరికొత్త బంపర్‌ను పొందింది. ఎయిర్ ఇన్‌టేక్స్‌లోని గ్రిల్ మేబ్యాక్ లోగో నమూనాను కూడా పొందుతుంది. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ పొందుతుంది. ఇది పోలార్ వైట్, సిల్వర్ మెటాలిక్ అనే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. అయితే డ్యూయెల్ పెయింట్ స్కీమ్ అనేది ఆప్షనల్ అని తెలుస్తోంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో పెద్దగా గమనించదగ్గ అప్డేట్స్ లేదు. అయితే కొత్త స్టీరింగ్ వీల్, ఏసీ వెంట్స్, అప్‌డేటెడ్ టెలిమాటిక్స్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటివి ఇందులో లభిస్తాయి. ఇందులో అదే 11.6 ఇంచెస్ ఎంబీయూఎక్స్ స్క్రీన్స్ మొదలైనవి ఉంటాయి.
మెర్సిడెస్ మేబ్యాక్ జీఎల్ఎస్ 600 ఫేస్‌లిఫ్ట్ 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది 557 హార్స్ పవర్ మరియు 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 22 హార్స్ పవర్, 250 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 48వీ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్‌ను కూడా పొందుతుంది. ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి, 4మ్యాటిక్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment