భారత్‌లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతంటే? | 2023 Mercedes Benz GLC launched price and features | Sakshi
Sakshi News home page

Mercedes Benz: భారత్‌లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతంటే?

Published Thu, Aug 10 2023 7:15 AM | Last Updated on Thu, Aug 10 2023 7:15 AM

2023 Mercedes Benz GLC launched price and features - Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ వాహనాల తయారీలో ఉన్న మెర్సిడెస్‌–బెంజ్‌ ప్రీమియం ఎస్‌యూవీ జీఎల్‌సీ కొత్త వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.73.5 లక్షలు. 

పెట్రోల్, డీజిల్‌ పవర్‌ట్రెయిన్స్‌తో లభిస్తుంది. ఇప్పటికే 1,500ల పైచిలుకు బుకింగ్స్‌ నమోదయ్యాయని కంపెనీ ప్రకటించింది. భారత్‌లో మెర్సిడెస్‌కు అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీ ఇదే. తొలిసారిగా మెర్సిడెస్‌ కార్లలో ఎన్‌టీజీ 7 ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను పొందుపరిచారు. 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజన్‌తో తయారైన జీఎల్‌సీ 300 4మేటిక్‌ గరిష్ట వేగం గంటకు 240 కిలోమీటర్లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement