టెక్నాలజీ పెరగడంతో కార్లలో ADAS వంటి అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులో ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి వాహన వినియోగదారులను ప్రమాదం నుంచి తప్పించడానికి, ప్రమాదం జరిగే ముందు అలర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ ఫీచర్లను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వెనుక సీటును బెడ్‌గా మార్చి ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూడవచ్చు. అయితే ఈ కారులో డ్రైవర్ లేకపోవడం గమనించవచ్చు.
కారు ఎంత వేగంగా వెళ్తోంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు అందుబాటులో లేదు, కానీ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కారు హైవే మీద ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వ్యక్తి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ఉపయోగించినట్లు అర్థమవుతోంది.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ డ్రైవర్ ప్రమేయం లేకుండా ఒక స్థిరమైన వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అత్యవసర సమయంలో డ్రైవర్ కారుని కంట్రోల్ చేయకపోతే ఆటోమేటిక్‌గా కారు ఆగిపోతుంది. వెంటనే కారు ఆగిపోతే.. వెనుక నుంచి వచ్చే వాహనాలు ఈ కారుని ఢీ కొట్టే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే కారులో ప్రయాణించే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం.
ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్..
Comments
Please login to add a commentAdd a comment