miss use
-
టెక్నాలజీ ఉంది కదా అని ఎవరైనా ఇలా చేస్తారా! వీడియో చూడండి
టెక్నాలజీ పెరగడంతో కార్లలో ADAS వంటి అప్డేటెడ్ ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులో ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి వాహన వినియోగదారులను ప్రమాదం నుంచి తప్పించడానికి, ప్రమాదం జరిగే ముందు అలర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ ఫీచర్లను కొంత మంది దుర్వినియోగం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వెనుక సీటును బెడ్‌గా మార్చి ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుతూ ఉండటం చూడవచ్చు. అయితే ఈ కారులో డ్రైవర్ లేకపోవడం గమనించవచ్చు. కారు ఎంత వేగంగా వెళ్తోంది, ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు అందుబాటులో లేదు, కానీ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కారు హైవే మీద ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. కారులో ఉన్న వ్యక్తి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ ఉపయోగించినట్లు అర్థమవుతోంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ ఫీచర్ డ్రైవర్ ప్రమేయం లేకుండా ఒక స్థిరమైన వేగంతో ప్రయాణించడానికి అనుమతిస్తుంది. అత్యవసర సమయంలో డ్రైవర్ కారుని కంట్రోల్ చేయకపోతే ఆటోమేటిక్‌గా కారు ఆగిపోతుంది. వెంటనే కారు ఆగిపోతే.. వెనుక నుంచి వచ్చే వాహనాలు ఈ కారుని ఢీ కొట్టే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే కారులో ప్రయాణించే వాళ్ల ప్రాణాలకే ప్రమాదం. ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్.. View this post on Instagram A post shared by Auto Journal India (@autojournal_india) -
బిగ్ అప్డేట్.. పోస్టల్ బ్యాలెట్ రద్దుకు ఈసీ ప్రతిపాదన!
న్యూఢిల్లీ: ఎన్నికల విధుల్లో ఉండి సొంత నియోజకవర్గానికి వెళ్లలేని వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే, ఈ పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగానికి గురవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కాకుండా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ‘పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేలా పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగాన్ని తగ్గించేందుకు’ ఈ ప్రతిపాదనను ఈసీ తీసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖకు గత వారం ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ స్థానంలో ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ల వినియోగానికి ఎన్నికల నిర్వహణ చట్టం 1961లోని 18వ నిబంధనకు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ అనూప్ చంద్ర పాండేలు సూచించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు, సర్వీస్ ఓటర్లు, కస్టడీలో ఉన్నవారు ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేలా ఈ 18వ నిబంధన వీలు కల్పిస్తోంది. జాతీయ స్థాయి ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా 10లక్షలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. సుమారు కోటి మంది ఎన్నికల విధుల్లో ఉంటారు. అందులో పోలీసులు, పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉంటారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల డ్యూటీలో ఉన్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఎన్నికల విధుల్లోకి వెళ్లేవారికి శిక్షణ సమయంలోనే పోస్టల్ బ్యాలెట్‌ను అందిస్తారు. వారు అక్కడి నుంచి విధుల్లోకి వెళ్లేలోపు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లతో ఫెసిలిటేషన్ సెంటర్స్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ చాలా మంది పోస్టల్ బ్యాలెట్‌ను తమతో తీసుకెళ్తున్నట్లు గుర్తించామని, సుదీర్ఘంగా వారితోనే పోస్టల్ బ్యాలెట్‌ను ఉంచుకోవటం ద్వారా దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాంటి వాటిని తగ్గించేందుకే ఫెసిలిటేషన్ సెంటర్స్‌లోనే అభ్యర్థుల ముందు ఓటు వినియోగించుకునేలా నిబంధనల్లో మార్పు చేయాలని ఈసీ ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు షాక్.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ నో.. -
పూలే జయంతి ‘నిధుల దుర్వినియోగం’పై నివేదికివ్వండి
సాక్షి, హైదరాబాద్: జ్యోతిరావు పూలే జయంతి వేడుకల దుర్వినియోగ అభియోగాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిధుల దుర్వినియోగం రిట్లో కౌంటర్ దాఖలు చేయాలని గత జనవరిలో హైకోర్టు నోటీసులు జారీ చేస్తే నాలుగు నెలలైనా ఇప్పటివరకూ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుతోపాటు బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రంలో పూలే జయంతి వేడుకల నిర్వహణకు బీసీ సంక్షేమ శాఖ రూ.11.25 లక్షలు మంజూరు చేస్తే హైదరాబాద్‌లో చేసిన ఖర్చులో సుమారు 70 శాతం వరకు దుర్వినియోగం అయిందని ఆరోపిస్తూ హైదరాబాద్‌కు చెందిన శివుపల్లి రాజేశం పిల్ దాఖలు చేశారు. 18 నుంచి అన్ని కేసులనూ విచారించనున్న హైకోర్టు లాక్డౌన్ కారణంగా అత్యవసర కేసుల్ని మాత్రమే విచారిస్తున్న హైకోర్టు ఈ నెల 18వ తేదీ సోమవారం నుంచి అన్ని రకాల కేసులనూ విచారించాలని నిర్ణయించింది. రిట్లు, క్రిమినల్, సివిల్ కేసులను ఆన్లైన్లో ఏ విధంగా దాఖలు చేయాలో హైకోర్టు వెబ్సైట్లో వివరాలను పొందుపర్చినట్లు రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు. -
డేటా దుర్వినియోగానికి జైలు శిక్ష..
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసిన పక్షంలో కంపెనీలు ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రానుంది. కోట్ల రూపాయల జరిమానాలు కట్టడంతో పాటు వాటి ఎగ్జిక్యూటివ్‌లు జైలు శిక్షలు కూడా ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన వ్యక్తిగత డేటా భద్రత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీన్ని ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వ్యక్తిగత డేటా భద్రత బిల్లు నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో సదరు కంపెనీ .. రూ. 15 కోట్ల దాకా లేదా తన అంతర్జాతీయ టర్నోవరులో 4 శాతం మొత్తాన్ని జరిమానాగా కట్టాల్సి వస్తుంది. ఒకవేళ వ్యక్తుల డేటాను కావాలనే చట్టవిరుద్ధంగా ప్రాసెసింగ్ చేశారని తేలిన పక్షంలో సదరు కంపెనీలో డేటా వ్యాపార విభాగానికి ఇంచార్జిగా ఉన్న ఎగ్జిక్యూటివ్‌కు మూడేళ్ల దాకా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే తమ డేటాను పూర్తిగా తొలగించేలా తగు చర్యలు తీసుకోవడానికి వ్యక్తులకు హక్కులు లభిస్తాయి. డేటా బిల్లులో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► వ్యక్తులకు సంబంధించిన కీలక డేటాను అన్ని ఇంటర్నెట్ కంపెనీలు.. భారత్‌లోనే భద్రపర్చాలి. ఒకవేళ విదేశాల్లో ప్రాసెస్ చేయాల్సి వస్తే.. చట్ట నిబంధనలకు లోబడి, ఆయా వ్యక్తుల నుంచి కచ్చితంగా పూర్తి అనుమతులు తీసుకోవాలి. ► ఆరోగ్యం, మతం, రాజకీయ అభిప్రాయాలు, బయోమెట్రిక్స్, జన్యుపరమైన, ఆర్థికపరమైన వివరాలను కీలక డేటాగా పరిగణించడం జరుగుతుంది. కీలక డేటాలో మార్పులు, చేర్పుల గురించి కేంద్రం ఎప్పటికప్పుడు ప్రకటిస్తుంది. ► చిన్నపాటి ఉల్లంఘనలకు కంపెనీలపై రూ. 5 కోట్లు లేదా గ్లోబల్ టర్నోవరులో 2% దాకా జరి మానా విధించవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులకు జైలు శిక్ష కూడా విధించవచ్చు. -
చాపకింద ’నీరు’లా..
’నీరుచెట్టు’లో అవినీతి పర్వం నిధులు మట్టిపాలు పురోగతి లేని పనులు నాణ్యత దేవుడికెరుక అధికారుల చోద్యం నీరుచెట్టు పథకంలో అవినీతి చాపకింద నీరులా ప్రవహిచింది. రూ.కోట్లు పక్కదారి పట్టాయి. చేసినవి కొద్ది పనులే అయినా నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారులు ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. ఆకివీడు : ఎప్పట్లానే ఈ ఏడాదీ నీరుచెట్టు పథకం నిధులు నీటిపాలయ్యాయి. చాపకింద నీరులా అవినీతి పరవళ్లు తొక్కింది. జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ ఎన్నిసార్లు హెచ్చరించినా నీటి సంఘాలు ఖాతరు చేయలేదు. ఇరిగేషన్ అధికారుల తీరు మారలేదు. జిల్లాలో కాలువలు, డ్రెయిన్లులో మట్టి తొలగింపు, పూడిక తీత, గట్లు పటిష్ట పరిచే పనులను నీరుచెట్టు పథకంలో చేపట్టారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.160 కోట్లు ఏప్రిల్ నెలాఖరున విడుదల చేసింది. వీటితో వివిధ ప్రాంతాల్లో 666 పనలు చేపట్టాలని నీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ పనులను చేపట్టేందుకు నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల ప్రతినిధులు ముందుకు వచ్చారు. పనులను తమకంటే తమకే ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన మంత్రులతో ఒత్తిడి చేయించి మరీ తీసుకున్నారు. అయితే వాటిని సకాలంలో మొదలు పెట్టలేదు. మే నెల 15కి గానీ పనులు ప్రారంభించలేదు. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ పనులు చేపట్టలేదు. జిల్లావ్యాప్తంగా కేవలం 150 పనులను మాత్రమే తూతూమత్రంగా చేసి చేతులు దులుపుకున్నారు. రూ.70కోట్లు బిల్లులు డ్రా చేసుకున్నారు. పత్తాలేని క్వాలిటీ కంట్రోల్ చేసిన 150 పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. క్వాలిటీ కంట్రోల్ అధికారుల తనిఖీ లేకపోవడంతో రూ.70కోట్లు నీటిపాలయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు చేసిన అవినీతి పనులు కొట్టుకుపోయాయి. పలు చోట్ల గట్లు అండలుగా జారిపోయాయి. పంట కాలువల్లో పూడిక తీశామని చెబుతున్నా.. నీటి ప్రవాహం చూస్తే అసలు పనులు చేసినట్టే అనిపించడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల నిధులే ఇవ్వలేదు ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో కాలువల్లో పూడిక పేరుకుపోయినా పూడిక తీయించలేదు. కర్రనాచు పేరుకుపోయి నీటి ప్రవాహానికి తీవ్ర అవరోధం ఏర్పడుతోందని రైతులు మొత్తుకున్నా.. అధికారులు నిధులు కేటాయించలేదు. ఇప్పటికైనా మిగిలిన నిధుల నుంచి తమ ప్రాంతాల్లో పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. జారిపోయింది వెంకయ్యవయ్యేరులో కర్రనాచు మొలకెత్తకుండా బెడ్ కాంక్రీట్ నిర్మించారు. అయితే బెరమ్స్ నిర్మాణం చేపట్టకపోవడంతో మళ్లీ యథాస్థితికి చేరింది. నీరుచెట్టులో రూ.18 లక్షలతో పూడిక తీసి మట్టిని గట్టుపైకి చేర్చి వదిలేశారు. మళ్లీ ఆ మట్టి కాలువలోకి జారిపోయింది. ఈ పనుల వల్ల ఉపయోగమేముంది? గ్లాడ్సన్, యువ రైతు, చెరుకుమిల్లి. 150 పనులు పూర్తి జిల్లాలో నీరుచెట్టు పథకం 150 పనుల పూర్తయ్యాయి. రూ.70కోట్లు ఖర్చయ్యాయి. చెరువుల్లోనూ, కాలువల్లో పూడిక తీత, మట్టి పనులు జరిగాయి. మిగిలిన పనులు వానలు తెరిపించిన తర్వాత చేపట్టేందుకు చర్యలు చేపడతాం. శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజినీర్, నీటిపారుదల శాఖ, ఏలూరు.