న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఏసీ గదుల్లోంచి బయటకు రావడానికే జనం ఇష్టం పడడం లేదు. సుభాషిణి చంద్రమణి అనే మహిళ మాత్రం ఎండ నుంచి రక్షణకి ఏసీ గదులు అక్కర్లేదని ఒక చెట్టు చాలని ప్రయోగాత్మకంగా నిరూపించారు.
ఆమె మండుటెండలో నిల్చొని ఉష్ణోగ్రతని రికార్డు చేస్తే 40 డిగ్రీల సెల్సియస్ చూపించింది. అలా నడుచుకుంటూ పక్కనే ఉన్న చెట్టు నీడలోకి వెళితే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంటే ఏకంగా 13 డిగ్రీలు తేడా ఉందన్న మాట. ఆమె ఈ ప్రయోగం చేసి దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేస్తే అది వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment