subhashini
-
కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
పేరుకే జీరో పాలిటిక్స్ అని నీతులు చెబుతారు, నాతో మాత్రం ఏకంగా కోటి 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయించారని జనసేన మాజీ నాయకురాలు చిట్టె సుభాషిణి ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనలోని చాలామంది వీర మహిళలు ఉన్నారు. అందులో ఈమె కూడా ఒకరు. పవన్ కల్యాణ్ ఏదో మంచి చేసేస్తారని భ్రమపడి ఏకంగా అమెరికా నుంచి చాన్నాళ్ల క్రితమే ఇక్కడకొచ్చేశారు. కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టినప్పటికీ 2019లో టికెట్ ఇవ్వలేదు సరికదా ఘోరంగా అవమానించారు. ఈ క్రమంలోనే తాజాగా 'సాక్షి' టీవీలో ఇంటర్వ్యూలో ఈమె పాల్గొన్నారు. జనసేన, పవన్ కల్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు. అమెరికాలో భర్తతో కలిసుంటున్న చిట్టె సుభాషిణి.. పిల్లలతో సహా ఇక్కడికి ఎందుకొచ్చారు? అసలు జనసేనలో ఎలా చేరారు? అమెరికా నుంచి ఇక్కడికి ఎంత డబ్బులు తీసుకొచ్చారు? జీరో పాలిటిక్స్ అని చెప్పి.. జనసేన నాయకులు కోట్లాది రూపాయలు ఎలా స్వాహా చేస్తున్నారు? ఎస్సీ మహిళనని కూడా చూడకుండా తనని ఎలా అవమానించారు? పవన్ కల్యాణ్ మాయలో పడి చాలామంది ఏమవుతున్నారు? అసలు జనసేన ప్రజల్ని ఎలా మోసం చేస్తోంది? లాంటి విషయాల్ని సుభాషిణి పూసగుచ్చినట్లు చెప్పారు. ఇవన్నీ కూడా దిగువన వీడియోలు ఉన్నాయి. ఓసారి చూస్త మీకు, మరీ ముఖ్యంగా జనసైనికులకు క్లారిటీ వచ్చేస్తుంది. -
అమెరికా జీవితాన్నివదిలేసి పవన్ కళ్యాణ్ కోసం వస్తే..!
-
ఏసీ అక్కర్లేదు, ఒక చెట్టున్నా చాలు
న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఏసీ గదుల్లోంచి బయటకు రావడానికే జనం ఇష్టం పడడం లేదు. సుభాషిణి చంద్రమణి అనే మహిళ మాత్రం ఎండ నుంచి రక్షణకి ఏసీ గదులు అక్కర్లేదని ఒక చెట్టు చాలని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆమె మండుటెండలో నిల్చొని ఉష్ణోగ్రతని రికార్డు చేస్తే 40 డిగ్రీల సెల్సియస్ చూపించింది. అలా నడుచుకుంటూ పక్కనే ఉన్న చెట్టు నీడలోకి వెళితే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంటే ఏకంగా 13 డిగ్రీలు తేడా ఉందన్న మాట. ఆమె ఈ ప్రయోగం చేసి దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తే అది వైరల్‌గా మారింది. -
భగవంతుడా.. బిడ్డ కోసమైనా బతికించు
17 ఏళ్ల వయసు నిండకముందే పెళ్లి.. కొంతకాలం కాపురం సజావుగా సాగింది. అంతలోనే ఆ ఇల్లాలికి తీవ్ర అనారోగ్య సమస్య తలెత్తింది. అప్పటికే ఆమె మూడు నెలల గర్భిణి.. భార్య అనారోగ్య విషయం తెలుసుకున్న భర్త కనికరం లేకుండా ఆమెపై దాడి చేసి వెళ్లిపోయాడు. గుండెకు మూడు రంధ్రాలతోపాటు, ముక్కుకు సంబంధించి ఇంకో సమస్య. నిరుపేదరాలైన గృహిణి తల్లిదండ్రుల వద్దకు చేరింది. ప్రాణాపాయ స్థితిలో మంచానికే పరిమితమై వైద్యం చేయించుకునేందుకు దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది. సాక్షి, నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని భక్తవత్సలనగర్‌లో నివాసం ఉంటున్న మరియమ్మ, సుబ్బారావు దంపతులు నిరుపేదలు. వారికి ఐదుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. వారిలో ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా.. సుభాషిణి ఐదో సంతానం. ఆరో సంతానమైన కుమారుడు ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. సుబ్బారావు కూలి పనులు చేస్తుంటాడు. ఏమైందంటే.. సుభాషిణికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. సంతోషంగా జీవిస్తున్న సమయంలో ఆమెకు ముక్కుల నుంచి రక్తస్రావం జరిగింది. నెల్లూరు ప్రభుత్వ పెద్దాస్పత్రి, కిమ్స్‌లో వైద్యపరీక్షలు చేయించగా గుండెకు రంధ్రాలున్నట్టు తేలింది. దీంతో భర్త భార్యతో గొడవ పెట్టుకుని రోకలి బండతో తల పగులగొట్టి మరో మహిళ వద్దకు వెళ్లిపోయాడు. సుభాషిణికి తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ రావడంతో చెన్నైలో చికిత్స చేయించుకున్నారు. అక్కడి డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి భర్త చేసిన దాడి కారణంగా మెదడు నుంచి ముక్కుకు వచ్చే నరాలు దెబ్బతిన్నాయని తేల్చారు. వారి సూచన మేరకు చెన్నై పూనమలై కేకేఆర్ ఆస్పత్రికి సుభాషిణిని తల్లిదండ్రులు తీసుకెళ్లారు. అప్పులు చేసి రూ.3.80 లక్షలతో ఆపరేషన్ చేయించారు. ఆ తర్వాత గుండె వైద్యం కోసం మద్రాస్ మెడికల్ మిషన్ ఆస్పత్రికి వెళ్లగా వారు సీటీ, ఎంఆర్ఐ పరీక్షలు చేసి గుండె సాగిందని (ప్రొలాప్స్), 3 రంధ్రాలున్నట్లు తెలిపారు. వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక మందులు రాయించుకుని నెల్లూరుకు వచ్చారు. అంతలోనే శరీరం మొత్తం అలర్జీ వచ్చింది. తర్వాత సుభాషిణికి మరో అనారోగ్య సమస్య వచ్చింది. ఉన్నట్టుండి ఫిట్స్ రావడం మొదలైంది. మరో వైపు సరైన తిండి లేక మంచానికే పరిమితమైంది. ఆపరేషన్ ఒక్కటే మార్గం సుభాషిణికి వైద్యం చేయించేందుకు తల్లి మరియమ్మ కనిపించిన వారందరిని సాయం అడిగింది. ఎవరైనా నగదు ఇస్తే వైద్యం చేయించింది. రెడ్‌క్రాస్ వారు రూ.5 వేలు సాయం చేశారు. కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి విషయం రాగా నారాయణ ఆస్పత్రి వారితో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయాలన్నారు. సుభాషిణిని నారాయణ ఆస్పత్రిలో రెండువారాల పాటు వైద్యం చేశారు. రకరకాల పరీక్షలు చేశారు. స్కిన్ సమస్య తగ్గించారు. అయితే అప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితి దాటిపోయింది. కాగా నరాల సమస్యకు, పరీక్షలకు ఆస్పత్రిలో రూ.5 వేల వరకు డబ్బు తీసుకున్నారు. ఫిట్స్ రావడానికి కారణం మెదడులోని ఒక రక్తనాళంలో రక్తం గడ్డ కట్టిందని తెలిపారు. దానిని కరిగించాలని మరో వైపు గుండెకు కూడా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు పేర్కొన్నారు. గుండె ఆపరేషన్‌కు రూ.3.50 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. గుండెకు స్టంట్ వేయడం సాధ్యం కాదని, ఆపరేషన్ ఒక్కటే మార్గమన్నారు. డబ్బుల్లేక.. ప్రస్తుతం సుభాషిణి తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతోంది. రోజుకు నాలుగైదు సార్లు ఫిట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి మందులు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బుల్లేవు. ఇప్పుడు మందులు వాడడం లేదు. నారాయణ ఆస్పత్రిలో ఐదు నెలల క్రితం చేసిన పరీక్షల్లో కేవలం 40 శాతం మాత్రమే రక్తం శరీరంలో ఉంది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయి శరీరం పాలిపోయింది. మరియమ్మ కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. అయితే కుమార్తె ఆరోగ్య ముఖ్యమని చెబుతోంది. సుభాషిణి తన కుమార్తె ఐశ్వర్య జీవితం గురించి ఆలోచిస్తూ కన్నీరుమున్నీరవుతోంది. సుభాషిణి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్ నంబర్ 911020 42915 ఎస్ఎంబీ బ్రాంచ్, బీవీనగర్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏపీజీబీ 0004114 బాధితురాలి తల్లి ఫోన్ నంబర్ : 72889 03283 నా ఆపరేషన్ వాయిదా వేసుకున్నా నాకు కడుపునొప్పి వస్తోంది. పెద్దాస్పత్రిలో చూపించాను. గర్భసంచిలో గడ్డ ఉంది ఆపరేషన్ చేయాలన్నారు. నేను ఆపరేషన్ చేయించుకుంటే సుభాషిణి, మనుమరాలు ఐశ్వర్యను చూసే దిక్కులేక కడుపు నొప్పి భరిస్తున్నా. ఆపరేషన్ వాయిదా వేసుకుస్తున్నా. దాతలు స్పందించి సాయం చేస్తే నా బిడ్డకు వైద్యం చేయించుకుని ప్రాణాలు కాపాడుకుంటాను. – మరియమ్మ, సుభాషిణి తల్లి -
యాంకర్ సుమ గురించి ఆసక్తికర విషయం చెప్పిన నటి
బుల్లితెరపై యాంకర్ సుమ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె షో అంటే కంటెస్టెంట్స్‌కే కాదు ప్రేక్షకుల్లో సైతం జోష్ వస్తుంది. తనదైన పంచ్‌లు, వాక్చాతుర్యంతో అందరిని అబ్బురపరుస్తుంది సుమ. మైక్ పట్టుకుంటే చాలు గలగల మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే టీవీ షోలే కాదు స్టార్ హీరోల మూవీ ఈవెంట్స్, ప్రీ-రిలీజ్, ప్రమోషన్స్ అంటే సుమ లేకుండ అవి ఉండవు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ పలు సేవ కార్యక్రమాలు చేపడుతూ గొప్ప మనసు చాటుకుంటోంది. చదవండి: సుమ వల్లే నేను ఇలా ఉన్నాను: నటి ఎమోషనల్ ఇందుకు తాజా సంఘటనే ఉదాహరణ. ఆమె హోస్ట్ చేస్తున్న ఓ షోలో సీనియర్ నటి సుభాషిని అతిథిగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమ లేకపోతే తాను ఇప్పుడు ఇలా మీ ముందు ఉండేదానిని కాదంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే సుమనే కారణం. ఎంతో కాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న. వైద్యంగా కోసం సుమ ఆర్థికంగా సహాయం చేస్తుంది. నాకు ఆరు నెలలకు ఒకసారి మెడిసిన్స్ పంపిస్తుంది సుమ. చదవండి: ఆస్పత్రి నుంచి హీరో విక్రమ్ డిశ్చార్జి.. పాత వీడియో వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ మళ్లీ నాకు మానవ జన్మ ఉంటే నువ్వు నా కడుపున పాపగా పుట్టాలి. బంగారు తల్లివమ్మా నువ్వు’ అని అనడంతో సుమ కూడా ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైంది. వెంటనే నటి సుభాషిని దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకుంది. ఇలా ఇద్దరు కన్నీళ్లు పెట్టుకోవడం స్టేజ్‌పై ఒక్కసారిగా సైలెంట్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘సుమ తన మాటలతో అందరిని మన్ననలు పొందడమే కాదు.. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తూ గొప్ప వ్యక్తిగా ప్రూవ్ చేసుకున్నారు’ అంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
భర్తతో విడాకులు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్(గచ్చిబౌలి): మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ గోనె సురేష్ తెలిపిన మేరకు.. జేవీజీ హిల్స్ ఉబేర్ హైట్స్ లో నివాసముండే అంకపల్లి సుభాషిణి(41) సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. శనివారం రాత్రి ఫ్యాన్‌కు బెడ్ షీట్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. చాలా కాలం క్రితమే భర్తతో విడాకులు తీసుకుంది. ఇంటర్ చదివే కుమారుడు గోవర్థన్ కౌశిక్‌తో కలిసి నివాసం ఉంటోంది. రెండు నెలలుగా ఫిట్స్‌తో బాధపడుతోంది. కారు, బైక్ నడపవద్దని డాక్టర్లు సూచించినట్లు తెలిసింది. ఇటీవల కారు కొనుక్కున్న ఆమె కారు నడప వద్దని సూచించడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడింది. సుభాషిణి ఆత్మహత్యకు మానసిక ఒత్తిడే కారణమని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (యాక్సిడెంట్లో ప్రియుడు మృతి.. నువ్వే లేకుంటే నేనెందుకని..) -
కులదురహంకార హత్యల్ని నిరోధించాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో కుల దురహంకార హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టం రూపొందించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ డిమాండ్ చేశారు. తమ పార్టీ 15 ఏళ్ల క్రితమే అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించిందని గుర్తు చేశారు. బాధితులకు షెల్టర్, పరిహారం, కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నవారికి రక్షణ తదితర అంశాలు ఆ బిల్లులో పొందుపరిచామన్నారు. నాటి కాంగ్రెస్‌తోపాటు నేటి బీజేపీ ప్రభుత్వానికీ ఆ చట్టం రావటం ఇష్టం లేదని, అందుకే రెండు పార్టీలు మౌనంగా ఉంటున్నాయని ఆమె విమర్శిం చారు. హైదరాబాద్ ఎంబీ భవన్లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబుతో కలిసి సుభాషిణి అలీ విలేకరులతో మాట్లాడారు. నాగరాజు కుటుంబానికీ, ఆశ్రిన్‌కు కలిపి రూ.75లక్షల పరిహారం, అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. -
కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను: లేడీ కమెడియన్
Allari Subhashini : అల్లరి సినిమాతో లేడీ కమెడియన్‌గా గుర్తింపు పొందిన నటి సుభాషిణి. ఆ సినిమాతో అల్లరి సుభాషిణిగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా సినిమాల్లో నటించని సుభాషిణి ఇటీవలె ఓ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తనకు క్యాన్సర్ వచ్చిందని, ఆ సమయంలో కేసీఆర్ తనకు సహాయం చేశారని చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. 'అనారోగ్య సమస్యలు ఎదురు కావడంతో ఓసారి హాస్పిటల్‌కి వెళ్లి పరీక్షలు చేయిస్తే క్యాన్సర్ అని తేలింది. చికిత్సకు దాదాపు 15 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ప్రగతిభవన్‌కు వెళ్లి సహాయం చేయమని కోరాను. కేసీఆర్ గారు స్పందించి వెంటనే 15 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఎలాంటి ఖర్చు లేకుండా ఆపరేషన్ జరిగింది. ఇందుకు సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సైతం తనకు లక్ష రూపాయలు సహాయం చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు కూడా ఆర్థిక సహాయం అందించారు. ఆరోగ్య పరంగా కోలుకున్నాను. ప్రస్తుతం ఆఫర్లు వస్తున్నాయి త్వరలోనే సినిమాల్లో నటిస్తాను అని పేర్కొంది. చదవండి :నిధి అగర్వాల్‌కు ‘హరి హర వీరమల్లు' సర్ప్రైజ్ చెల్లితో పాటు భర్తను కూడా సినిమాల్లోకి తీసుకొస్తున్న కాజల్! -
అసభ్యకర సందేశాలు పంపుతున్న మహిళ అరెస్ట్
నాగోలు: సెల్ఫోన్లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైమ్ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్ నార్త్ లాలాగూడకు చెందిన బి.సుభాషిణి (39) అదే ప్రాంతానికి చెందిన వి.వెంకటేశ్వరరావును ప్రేమించి రెండవ వివాహం చేసుకుంది. ఇదివరకే వెంకటేశ్వరరావుకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు తెలియకుండా సుభాషిణితో మరోచోట కాపురం పెట్టాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుభాషిణి.. మొదటి భార్య ఫోన్ నెంబర్ తెలుసుకుని అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తోంది. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు సుభాషిణిని గురువారం రిమాండ్‌కు తరలించారు. -
కష్టాల్లో సీనియర్ నటి.. ఆదుకున్న చిరంజీవి
సాక్షి, హైదరాబాద్ : ‘అల్లరి’ సినిమాతో ప్రసిద్ధి పొందిన సీనియర్ నటి సుభాషిణీ తీవ్ర కష్టాల్లో ఉన్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. ఆమె కష్టాల గురించి తెలుసుకున్న సీనియర్ హీరో, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆమె అనారోగ్యం గురించి తెలుసుకొని.. రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ బుధవారం స్వయంగా సుభాషిణి ఇంటికి వెళ్లి.. ఆమెకు రూ. రెండు లక్షలు అందజేశారు. కష్టాల్లో ఉన్న సీనియర్ నటికి చిరంజీవి సాయం అందించడంపై సోషల్ మీడియాలో పలువురు ప్రశంసిస్తున్నారు. -
పద్ధతి మార్చుకోలేదని ప్రాణం తీశాడు
- ప్రియురాలిని చంపిన ప్రియుడు - శవం సహా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు తనకల్లు: వివాహేతర సంబంధం వద్దని చెప్పినా పద్ధతి మార్చుకోనందుకు ప్రియురాలిని అంతమొందించిన ప్రియుడి ఉదంతం తనకల్లు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. శవం సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణానికి చెందిన అశోక్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్థానిక ఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న కుమార్ బ్రిక్స్, టైల్స్ వర్క్ చేసేవాడు. కుమార్ అప్పుడుప్పుడు సిమెంట్ ఇటుకలు, టైల్స్‌ని అశోక్‌కు చెందిన టాటా ఏస్ వాహనంలో తరలించేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈ నేపధ్యంలో కుమార్ ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్తూ అతని భార్య మల్లీశ్వరి(40)తో ఏడాది నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు. విషయం తెలుసుకున్న కుమార్.. అశోక్‌తో గొడవపెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత అశోక్ తిరుపతికి వెళ్లి కారును బాడుగుల కోసం పెట్టుకొని అక్కడే ఉంటున్నాడు. అయినా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం అలాగే కొనసాగేది. మంగళవారం మల్లీశ్వరిని కొక్కంటిక్రాస్‌కు రప్పించుకున్నాడు. అక్కడి నుంచి తన కారు(ఏపీ 03 టీవీ 5788)లో ఆమెను కూర్చోబెట్టుకొని పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఆపి కారులోనే గొడవపెట్టుకున్నాడు. ‘నువ్వు నాతోనే కాదు.. ఇంకా ఆరుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. వెంటనే వాటన్నింటినీ వదులుకో’ అని అశోక్ హుకుం జారీ చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అశోక్ కారులో ఉంచిన కొడవలితో మల్లీశ్వరి మెడపై ఐదుసార్లు నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం శవాన్ని కారులోనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఆమెని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ తెలిపారు. -
నెల్లూరులో రెచ్చిపోయిన దోపిడి దొంగలు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో గురువారం మధ్యాహ్నం దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానిక ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన ఆదిలక్ష్మమ్మ(80) తన కోడలు సుభాషిణితో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అత్తాకోడళ్లు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు వారిని తీవ్రంగా గాయపరిచి ఇంట్లో ఉన్న 20 సవర్ల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇది గుర్తించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
స్కూల్ బస్సు - బైక్ ఢీ.. మహిళ మృతి
వేగంగా వెళ్తున్న స్కూలు బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా చెన్నూరు మండలం చిన్నమాసుపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకంది. కడప నుంచి చెన్నూరు వెళ్తున్న స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న సుభాషిణి(28) అక్కడికక్కడే మృతిచెందగా.. ఆమె కూతురు గౌరి(5)కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో గురుకుల ప్రిన్సిపల్ సుభాషిణి
నెల్లూరు జిల్లాలో మరోఅవినీతి చేప అధికారుల వలలో చిక్కింది. నెల్లూరు జిల్లా చిల్లకూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుభాషిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సోమనాథ్ ట్రేడర్స్ నిర్వాహకులు పులిపాటి వెంకటేశ్వర్లు, కేవీ లక్ష్మినారాయణ 2013-14కు సంబంధించి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, కప్పులు సరఫరా చేశారు. ఇందుకుగాను వారికి రూ.1.27 లక్షలు చెల్లించాల్సి ఉంది. నగదు చెల్లించాలని సుభాషిణికి వారం కిందట ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. బిల్లులు చెల్లించాలని సోమనాథ్ ట్రేడర్స్ నిర్వాహకులు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌ను కోరగా రూ.20 వేలు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలు ఇచ్చేలా బేరం కుదిరింది. అనంతరం వారు ఏసీబీ డీఎస్పీ నంజుండప్పను కలిసి విషయాన్ని వివరించారు. ఏసీబీ అధికారుల సూచన మేరకు ట్రేడర్స్ నిర్వాహకులు ప్రిన్సిపల్‌కు ఇంటి వద్దరూ.10 వేలు, పాఠశాల సీనియర్ అసిస్టెంట్ రమణయ్యకు పాఠశాలలో రూ.5 వేలు ఇచ్చారు. ఏసీబీ అధికారులు ఒక్కసారిగా ఇద్దరిపై దాడులు చేసి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఊడ్చిపారేస్తాం
బద్వేలు అర్బన్, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా వారిని విస్మరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఊడ్చిపారేస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ బద్వేలు, గోపవరం మండలాల నాయకురాళ్లు, సత్యవతి, సుభాషిణి, హుసేనమ్మలు హెచ్చరించారు. బుధవారం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో పట్టణంలో చీపుర్లతో రోడ్లు ఊడుస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతోప్రస్తుతం అందుతున్న వేతనాలు తమకు ఏమాత్రం సరిపోవడం లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటి సభ్యుడు వీరశేఖర్, పట్టణ కార్యదర్శి బాలు, డీవైఎఫ్ఐ పట్టణ కన్వీనర్ చిన్ని పాల్గొన్నారు. పోరుమామిళ్లలో... అంగన్వాడీలపై పోలీసులు లాఠీచార్జీ చేసి, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండువద్ద మోకాళ్లపై నిలబడి అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. ముందుగా సీఐటీయూ కార్యాలయం నుంచి ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ బస్టాండువద్దకు వచ్చి మోకాళ్లపై కూర్చున్నారు. సీఐటీయూ నాయకుడు భైరవప్రసాద్, అంగన్వాడీ యూనియన్ నేతలు మేరి, రమాదేవి, వినోదాదేవి, విజయరేణుకలు మాట్లాడుతూ కనీసవేతనం రూ. 10 వేలు ఇవ్వాలని, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బి.కోడూరులో... తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటం ఆగదని అంగన్వాడీ అధ్యక్షురాళ్లు శోభాదేవి, లలితమ్మలు అన్నారు. హైదరాబాద్‌లో అంగన్వాడీలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం ఎందుకంత చిన్నచూపు చూస్తుందో అర్థం కావడం లేదన్నారు. అంతకు ముందు తహసీల్దారు కార్యాలయం వద్ద చీపుర్లతో వీధులు ఊడ్చి తమ నిరసనను తెలిపారు.