నాగోలు: సెల్‌ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైమ్ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్ నార్త్ లాలాగూడకు చెందిన బి.సుభాషిణి (39) అదే ప్రాంతానికి చెందిన వి.వెంకటేశ్వరరావును ప్రేమించి రెండవ వివాహం చేసుకుంది. ఇదివరకే వెంకటేశ్వరరావుకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు తెలియకుండా సుభాషిణితో మరోచోట కాపురం పెట్టాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుభాషిణి.. మొదటి భార్య ఫోన్ నెంబర్ తెలుసుకుని అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తోంది. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు సుభాషిణిని గురువారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment