Janasena Former Leader Chette Subhashini Latest Exclusive Interview, Watch Video Inside | Sakshi

అమెరికాలో లైఫ్ వదిలేసి పవన్ కోసం వచ్చా.. ఇప్పుడు నా పరిస్థితి ఇలా

Published Tue, Apr 30 2024 5:01 PM | Last Updated on Tue, Apr 30 2024 5:57 PM

Janasena Former Leader Chette Subhashini Interview Latest

పేరుకే జీరో పాలిటిక్స్ అని నీతులు చెబుతారు, నాతో మాత్రం ఏకంగా కోటి 50 లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేయించారని జనసేన మాజీ నాయకురాలు చిట్టె సుభాషిణి ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనలోని చాలామంది వీర మహిళలు ఉన్నారు. అందులో ఈమె కూడా ఒకరు. పవన్ కల్యాణ్ ఏదో మంచి చేసేస్తారని భ్రమపడి ఏకంగా అమెరికా నుంచి చాన్నాళ్ల క్రితమే ఇక్కడకొచ్చేశారు. కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టినప్పటికీ 2019లో టికెట్ ఇవ్వలేదు సరికదా ఘోరంగా అవమానించారు. ఈ క్రమంలోనే తాజాగా 'సాక్షి' టీవీలో ఇంటర్వ్యూలో ఈమె పాల్గొన్నారు. జనసేన, పవన్ కల్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు.  

అమెరికాలో భర్తతో కలిసుంటున్న చిట్టె సుభాషిణి.. పిల్లలతో సహా ఇక్కడికి ఎందుకొచ్చారు? అసలు జనసేనలో ఎలా చేరారు? అమెరికా నుంచి ఇక్కడికి ఎంత డబ్బులు తీసుకొచ్చారు? జీరో పాలిటిక్స్ అని చెప్పి.. జనసేన నాయకులు కోట్లాది రూపాయలు ఎలా స్వాహా చేస్తున్నారు? ఎస్సీ మహిళనని కూడా చూడకుండా తనని ఎలా అవమానించారు? పవన్ కల్యాణ్ మాయలో పడి చాలామంది ఏమవుతున్నారు? అసలు జనసేన ప్రజల్ని ఎలా మోసం చేస్తోంది? లాంటి విషయాల్ని సుభాషిణి పూసగుచ్చినట్లు చెప్పారు. ఇవన్నీ కూడా దిగువన వీడియోలు ఉన్నాయి. ఓసారి చూస్త మీకు, మరీ ముఖ్యంగా జనసైనికులకు క్లారిటీ వచ్చేస్తుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement