massages
-
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. ఈ క్రేజీ పెన్‌తో చెక్!
నిద్రలేమి, అలసటతో కళ్ల చుట్టూ వచ్చే నల్లటి వలయాలను తొలగిస్తుంది.. లిప్ స్టిక్ వాడకం, డీహైడ్రేషన్ వంటి కారణాలతో పెళుసుగా మారిన పెదవులను తేమగా ఉంచుతుంది ఈ మినీ డివైజ్(ఐ, లిప్స్ కేర్ మసాజర్). మినీ స్కిన్ లిఫ్టింగ్ యాంటీ రింకిల్స్ రిమూవర్ పెన్.. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ముడతలు, మచ్చలను తొలగిస్తుంది. ఇది 42 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌తో సున్నితమైన భాగాలకు ఎలాంటి హానీ కలగకుండా ట్రీట్మెంట్ ఇస్తుంది. దీనికి ఒక గంట చార్జింగ్ పెడితే నాలుగు గంటలపైనే నిర్విరామంగా పనిచేస్తుంది. హై ఫ్రీక్వెన్సీ మైక్రో–వైబ్రేషన్ టెక్నాలజీతో నిమిషానికి 12వేల సార్లు వైబ్రేట్ అవుతుంది. ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి ఒకే ఒక్క బటన్ ఉంటుంది. దాంతో దీన్ని వినియోగించడం చాలా సులభం. ఆన్ అయినప్పుడు మసాజ్ హెడ్ కింద రెడ్/బ్లూ కలర్ లైట్ వెలుగుతుంది. ఈ డివైజ్‌ని వాడటం వల్ల చర్మ కణాల్లో రక్తప్రసరణ చక్కగా అవుతుంది. వృద్ధాప్య ముడతలు పోతాయి. అలసటను దూరం చేస్తుంది. ఏ కారణం చేతైనా ఈ పెన్ను ఆఫ్ చెయ్యడం మరచిపోతే.. రెండు నిమిషాల తర్వాత ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. దీన్ని సులభంగా మేకప్ కిట్‌లో వేసుకుని ఎక్కడికైనా వెంట తీసుకుని వెళ్లొచ్చు. భలే బాగుంది కదూ. చదవండి: స్నాక్స్ విత్ టీ ఆర్ కాఫీ: పైన నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్.. పక్కనే కెటిల్.. ధర రూ.5,212! -
అసభ్యకర సందేశాలు పంపుతున్న మహిళ అరెస్ట్
నాగోలు: సెల్ఫోన్లో అసభ్యకర సందేశాలు పంపుతూ వేధింపులకు పాల్పడుతున్న మహిళను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రాచకొండ సైబర్ క్రైమ్ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి కథనం ప్రకారం... సికింద్రాబాద్ నార్త్ లాలాగూడకు చెందిన బి.సుభాషిణి (39) అదే ప్రాంతానికి చెందిన వి.వెంకటేశ్వరరావును ప్రేమించి రెండవ వివాహం చేసుకుంది. ఇదివరకే వెంకటేశ్వరరావుకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు తెలియకుండా సుభాషిణితో మరోచోట కాపురం పెట్టాడు. ఈ విషయం మొదటి భార్యకు తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో సుభాషిణి.. మొదటి భార్య ఫోన్ నెంబర్ తెలుసుకుని అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతూ వేధింపులకు గురిచేస్తోంది. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు సుభాషిణిని గురువారం రిమాండ్‌కు తరలించారు. -
బ్యాడ్ ఇంగ్లిష్ టీచర్ సస్పెన్షన్
కృష్ణాజిల్లా, మచిలీపట్నం: జిల్లాలోని చందర్లపాడు మండల కేంద్రంలో ఉన్న హైస్కూల్లో ఇంగ్లిషు టీచర్‌గా పని చేస్తున్న డీ శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తున్నట్లుగా డీఈవో ఎంవీ రాజ్యలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే... విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడు. కొన్నాళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో సహనం నశించిన విద్యార్థినులు సమస్యను తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటంతో పాటు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన జిల్లా విద్యా శాఖాధికారులు చర్యలకు ఉపక్రమించారు. విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చే రీతిలో వ్యవహరించిన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకునేందుకు డీఈవో రాజ్యలక్ష్మి సిద్ధమయ్యారు. ఈ మొత్తం వ్యహారంపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని నందిగామ డెప్యూటీ డీఈవో చంద్రకళను ఆదేశించారు. చందర్లపాడు ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు, తోటి ఉపాధ్యాయులను ఆమె విచారించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు నుంచి వివరాలు సేకరించారు. ఈ విచారణలో పదో తరగతి విద్యార్థినులకు టీచర్ తన సెల్ ద్వారా అసభ్యకరమైన వాట్సాప్ మెసేజ్‌లను పంపుతున్నట్లు వెల్లడయ్యింది. అంతే కాకుండా తన ఇంటి వద్ద ఉపయోగించే సెల్ నుంచి కూడా అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నట్లు తేలింది. ఈ మేరకు డీఈవోకు సమగ్ర నివేదికను అందజేశారు. దాని ఆధారంగా టీచర్‌పై డీఈవో రాజ్యలక్ష్మి సస్సెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా సదరు ఉపాధ్యాయుడు ముందస్తు అనుమతి లేకుండా మండల కేంద్రం విడిచి వెళ్లడానికి వీల్లేదని ఆదేశించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల హెచ్ఎంకి సూచిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చిచ్చురేపిన ఎస్ఎంఎస్
సాక్షి, హైదరాబాద్: సహజీవనం చేస్తున్న ప్రేమికుల మధ్య ఎస్ఎంఎస్ చిచ్చురేపింది. దీనిపై ప్రశ్నించడంతో అలిగిన యువతి కుమారుడు, భర్తను వదిలి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికిలోనైన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..కడప జిల్లా, పులివెందులకు చెందిన ఎర్రగొండు చరణ్ తేజరెడ్డి నగరానికి వలసవచ్చాడు. కుత్బుల్లాపూర్‌లోని వాజ్‌పేయి నగర్లో ఉంటూ స్థానిక నర్సరీలో పని చేసేవాడు. ఈ క్రమంలో నర్సరీకి వస్తున్న పావని అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అనంతరం వీరిద్దరూ వాజ్‌పేయినగర్‌లోని ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. వీరికి కుమారుడు ధనుష్‌రెడ్డి(13 నెలలు) ఉన్నాడు. చిచ్చు రేపిన ఎస్ఎంఎస్.. వారం రోజుల క్రితం పావని ఫోన్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ‘ఐలవ్ యూ’ పావని అంటూ మెసేజ్ వచ్చింది. దీనిని చూసిన చరణ్‌తేజ ఆమెను వివరణ కోరగా, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మనస్తాపానికిలోనైన పావని మూడు రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా చిన్నారిని సైతం వదిలేసి వెళ్లిపోయింది. దీంతో ఆందోళనకు గురైన చరణ్ ఆమె కోసం గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో మనస్తాపానికిలోనైన అతను గురువారం రాత్రి ఇంట్లో చీరతో సీలింగ్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాబు ఏడుపుతో వెలుగులోకి.. అర్ధరాత్రి నుంచి బాబు ఏడుపులు విన్న స్థానికులు శుక్రవారం తెల్లవారు జామున చరణ్‌తేజ ఇంటి తలుపు తట్టారు. తలుపులు తెరవకపోవడంతో బద్దలకొట్టి లోపలికి వెళ్లి చూడగా నేలపై బాబు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. సీలింగ్‌కు చరణ్ ఉరివేసుకుని కనిపించాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పట్టించుకోని పావని.. చరణ్‌తేజ్ రెడ్డి ఆత్మహత్యపై స్థానికులు, చరణ్ స్నేహితులు పావనికి ఫోన్ చేసి సమాచారం అందించారు. దీనిని తేలిగ్గా తీసుకున్న ఆమె ‘అవునా.. నిజమా? అంటూ ఫొటోలు పంపండి చూస్తానంటూ చులకనగా మాట్లాడిందని చరణ్ స్నేహితులు పేర్కొన్నారు. విజయవాడకు చెందిన పావని, కడప జిల్లాకు చెందిన చరణ్‌తేజ రెడ్డి పెళ్లి చేసుకున్నారా..లేదా అన్నది తెలియరాలేదు. వారిద్దరికీ సంబంధించిన ఒక్క ఫొటో కూడా ఇంట్లో లభ్యం కాకపోవడం గమనార్హం. -
వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలపై ఫిర్యాదు
నెల్లిమర్ల : తనపై సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపించారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులపై ఓ యువతి నెల్లిమర్ల పోలీసుస్టేషన్న్లో ఫిర్యాదు చేసింది. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేటకు చెందిన ఆ యువతి, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం పట్టణానికి చెందిన వి.సునీల్‌కుమార్ జరజాపుపేటకు చెందిన ఓ యువతి పట్ల అసభ్యకరంగా గోడపత్రికలు ముద్రించి, చెడుగా ప్రచారం చేశాడు. వీటిని జరజాపుపేటలోని ఇళ్ల గోడలకు అంటించాడు. అలాగే మరో యువకుడు పి.పవన్‌కల్యాణ్ ఆ వాల్‌పోస్టర్లకు ఫోటోలు తీసి, వాటిని వాట్సాప్‌లో పోస్ట్ చేశాడు. సదరు యువతి ఇరువురిపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం సునీల్‌కుమార్, పవన్‌కల్యాణ్‌లపై కేసు నమోదు చేశారు. -
నిగారింపు కోసం... పోషకాలు
అందంగా ఉండాలంటే ఎవరైనా ప్రామాణికంగా తీసుకునేది చర్మ సౌందర్యాన్నే! చర్మపు నిగారింపు పెరగాలంటే బ్యూటీ ప్యాక్‌లు, మసాజ్‌లతో పాటు తీసుకునే ఆహారం పైనా శ్రద్ధ పెట్టాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోస, ద్రాక్ష, కమలా... వంటి పండ్లను, రసాలను తీసుకోవాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు... సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల దాడిని అడ్డుకుంటాయి. ఫలితంగా చర్మ సౌందర్యం దెబ్బతినదు కాలానుగుణంగా వచ్చే మామిడిపండ్లలో 20 రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. మామిడిపండులో ఉండే సహజసిద్ధ గుణాలు బీటా-సి, విటమిన్ ‘ఎ’లు కణాలను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన చర్మకణాలు కాంతిని పెంచుతాయి క్యారెట్లు కంటిచూపును మెరుగుపరుస్తాయని చాలామందికి తెలుసు. పొడిచర్మాన్ని మృదువుగా మార్చే సుగుణాలు క్యారెట్లో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి సహజసిద్ధ నూనెలు అందించేందుకు సహాయపడుతుంది. ఫలితంగా చర్మకాంతి మెరుగుపడుతుంది.