నిగారింపు కోసం... పోషకాలు
అందంగా ఉండాలంటే ఎవరైనా ప్రామాణికంగా తీసుకునేది చర్మ సౌందర్యాన్నే! చర్మపు నిగారింపు పెరగాలంటే బ్యూటీ ప్యాక్‌లు, మసాజ్‌లతో పాటు తీసుకునే ఆహారం పైనా శ్రద్ధ పెట్టాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ, దోస, ద్రాక్ష, కమలా... వంటి పండ్లను, రసాలను తీసుకోవాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు... సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల దాడిని అడ్డుకుంటాయి. ఫలితంగా చర్మ సౌందర్యం దెబ్బతినదు కాలానుగుణంగా వచ్చే మామిడిపండ్లలో 20 రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి.
మామిడిపండులో ఉండే సహజసిద్ధ గుణాలు బీటా-సి, విటమిన్ ‘ఎ’లు కణాలను ఉత్తేజపరచడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన చర్మకణాలు కాంతిని పెంచుతాయి క్యారెట్లు కంటిచూపును మెరుగుపరుస్తాయని చాలామందికి తెలుసు. పొడిచర్మాన్ని మృదువుగా మార్చే సుగుణాలు క్యారెట్‌లో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ చర్మానికి సహజసిద్ధ నూనెలు అందించేందుకు సహాయపడుతుంది. ఫలితంగా చర్మకాంతి మెరుగుపడుతుంది.